రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు

భారతీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటైన టయోటా తన 2023 ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఈ అప్డేటెడ్ ఇన్నోవా క్రిస్టా ధరలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఈ 2023 ఇన్నోవా క్రిస్టా గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టయోటా యొక్క ఇన్నోవా క్రిస్టా కోసం కొనుగోలుదారులు రూ. 50,000 చెల్లించి టయోటా కంపెనీ యొక్క అధికారక డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ అప్డేటెడ్ కారు ఇప్పటికే విక్రయించబడుతున్న ఇన్నోవా హైక్రాస్‌తో పాటు విక్రయించబడే అవకాశం ఉంది. త్వరలో భారతీయ మార్కెట్లో అందుబాటులోకి రానున్న కొత్త 2023 క్రిస్టా ఆధునిక డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులను ఆకర్శించడంలో సహాయపడతాయి.

2023 ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్ ప్రారభించిన టయోటా

2023 ఇన్నోవా క్రిస్టా మొత్తం నాలుగు ట్రిమ్స్ లో లభింస్తుంది. అవి G, GX, VX మరియు ZX. ఇందులో జి అనేది బేస్ వేరియంట్ కాగా, ZX అనేది టాప్ వేరియంట్ అవుతుంది. ఇందులో ఉన్న మొదటి మూడు వేరియంట్స్ 7 లేదా 8 సీట్ల కాన్ఫిగరేషన్స్ లో అందుబాటులో ఉంటాయి, కానీ ZX వేరియంట్ మాత్రం 7 సీటర్ మోడల్ లో మాత్రమే లభిస్తుంది.

అప్డేటెడ్ 2023 ఇన్నోవా క్రిస్టా మొత్తం ఐదు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి సూపర్ వైట్, పెర్ల్ క్రిస్టల్ షైన్, సిల్వర్, అవాంట్ గ్రేడ్ బ్రాంజ్ మరియు యాటిట్యూడ్ బ్లాక్ కలర్స్. ఇవన్నీ కూడా చూడ చక్కగా ఉంటాయి. డిజైన్ పరంగా ఇందులో ఎక్కువ మార్పులు లేదు, అయితే ఇది చూడటానికి మైల్డ్ ఫేస్‌లిఫ్ట్ మాదిరిగా ఉంటుంది. కానీ కంపెనీ ఈ కారు యొక్క ఫ్రంట్ ఫాసియాను అప్డేట్ చేయడం జరిగింది.

2023 ఇన్నోవా క్రిస్టా కొంత అప్డేట్ చేయబడింది కావున ముందు భాగం కొంత మార్పులకు లోనైనట్లు తెలుస్తుంది, కానీ సైడ్ ప్రొఫైల్ మాత్రం ఎక్కువ అప్డేట్ కాలేదు, కావున సైడ్ ప్రొఫైల్ నుంచి మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఈ మోడల్ ఇప్పుడు కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్సన్ తో మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ కూడా చాలా వరకు అప్డేట్ చేయబడి ఉంటుందని ఆశిస్తున్నాము.

2023 ఇన్నోవా క్రిస్టాలోని 2.4 లీటర్, 4 సిలిండర్, టర్బో చార్జ్డ్, డీజిల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇది ఎకో మరియు పవర్ అనే రెండు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుందని ఆశిస్తున్నాము. ఈ అప్డేటెడ్ మోడల్ తప్పకుండా ఇన్నోవా ప్రేమికులను ఆకర్శించే అవకాశం ఉంది.

అప్డేటెడ్ ఇన్నోవా క్రిస్టా ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఫుల్ కలర్డ్ TFT MID స్క్రీన్ ఉంటుంది. ఇది వాహనం గురించి కావలసిన సమాచారాన్ని డ్రైవర్ కి అందిస్తుంది. ఇంకా పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, యంబియంట్ లైటింగ్, రియర్ ఆటో ఏసీ మొదలైనవి ఉన్నాయి.

డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇందులో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కావున 2023 ఇన్నోవా క్రిస్టా 7 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, త్రి పాయింట్ సీట్ బెల్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి. 2023 ఇన్నోవా క్రిస్టా అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
2023 toyota innova crysta bookings open updated diesel engine details
Story first published: Friday, January 27, 2023, 15:20 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X