ఆటో ఎక్స్‌పో 2023: దేశీయ మార్కెట్లో విడుదలకానున్న మారుతి బ్రెజ్జా CNG - వివరాలు

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ మరియు CNG వాహనాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి 2023 ఆటో ఎక్స్‌పోలో తన బ్రెజ్జా CNG SUV ఆవిష్కరించింది. ఈ ఆధునిక CNG వెర్షన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మారుతి సుజుకి 2020 లో తన డీజిల్ ఉత్పత్తిని నిలిపివేసిన తరువాత CNG వెర్షన్ మీద పనిచేయడం మొదలు పెట్టింది. గత ఏడాది కూడా మారుతి సుజుకి విడుదల చేయనున్న ఈ CNG వేరియంట్ గురించి కొన్ని కథనాల ద్వారా తెలుసుకున్నాం. అయితే ఎట్టకేలకు 2023 ఆటో ఎక్స్‌పో వేదిక మీద ఈ బ్రెజ్జా CNG అడుగు పెట్టింది. దీన్ని బట్టి చూస్తీ ఈ CNG మోడల్ భారతీయ మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందనిపిస్తుంది.

దేశీయ మార్కెట్లో విడుదలకానున్న మారుతి బ్రెజ్జా CNG

మారుతి సుజుకి బ్రెజ్జా CNG మంచి డిజైన్ కలిగి ప్రస్తుతం వినియోగించడానికి అనుకూలంగా ఉండే ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త CNG మోడల్ చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. అయితే డిజైన్ పరంగా పెద్దగా మార్పులు జరగలేదు. కావున డిజైన్ అదే మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది.

మారుతి నుంచి రానున్న ఈ బ్రెజ్జా CNG వెర్షన్ లో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇందులో బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. పెట్రోల్ మోడల్ తో పోలిస్తే CNG మోడల్ యొక్క బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. దీనికి కారణం బూట్ స్పేస్ లో CNG ట్యాంక్ ఉంటుంది. ఈ కారణంగానే బూట్ స్పేస్ కొంత తక్కువగా ఉంటుంది. కంపెనీ యొక్క యెటర్ CNG మోడల్స్ లో కూడా బూట్ స్పేస్ తక్కువగానే ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలకానున్న మారుతి బ్రెజ్జా CNG

ఇంటీరియర్ విషయానికి వస్తే, మారుతి బ్రెజ్జా CNG వెర్షన్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ పొందుతుంది. ఇతర మారుతి CNG మోడల్స్ మాదిరిగానే బ్రెజ్జా CNG VXi మరియు ZXi వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇంటీరియర్ లో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ అసిస్టెంట్, OTA అప్‌డేట్‌లతో కనెక్టెడ్ కార్ టెక్ వంటి స్పోర్ట్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

మారుతి సుజుకి బ్రెజ్జా CNG అదే 1.5 లీటర్ కె15సి డ్యూయల్‌జెట్ ఇంజన్‌ పొందే అవకాశం ఉంది. ఇది పెట్రోల్ మోడ్ లో 100 hp పవర్ మరియు 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే CNG మోడ్ లో మారుతి బ్రెజ్జా 88 hp పవర్ మరియు 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ & మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్సన్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలకానున్న మారుతి బ్రెజ్జా CNG

ఇక కొత్త మారుతి సుజుకి CNG వెర్షన్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఒక కేజీ CNG కి గరిష్టంగా 26.11 కిమీ మైలేజ్ అందిస్తుందని భావిస్తున్నారు. మరియు ఎర్టిగా CNG కూడా ఇదే మైలేజ్ అందిస్తుంది. బ్రెజ్జా CNG మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌ను పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే మారుతి బ్రెజ్జా CNG భారతదేశంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన మొదటి CNG మోడల్‌ అవుతుంది.

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త బ్రెజ్జా CNG దాని పెట్రోల్ మోడల్ కంటే కూడా రూ. 95,000 ఎక్కువ ధర వద్ద విడుదలకానుంది. దీన్ని బట్టి చూస్తే మారుతి సుజుకి బ్రెజ్జా CNG ప్రారంభ ధరలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. కంపెనీ ఈ CNG వెర్షన్ యొక్క అధికారిక ధరలను త్వరలోనే వెల్లడించనుంది. దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త బ్రెజ్జా CNG గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Auto expo 2023 maruti brezza cng showcased telugu details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X