CNG విభాగంలో టాటా మోటార్స్ ప్రభంజనం.. 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన ఆల్ట్రోజ్ CNG

భారతీయ మార్కెట్లో ప్రస్తుతం పెట్రోల్ వాహనాలకంటే కూడా ఎలక్ట్రిక్ మరియు CNG వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ కారణంగానే కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను మరియు CNG వాహనాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ సిఎన్‌జి ఆవిష్కరించింది.

2023 ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ తన ఆల్ట్రోజ్ సిఎన్‌జి ఆవిష్కరించింది. నిజానికి CNG వాహనాల్లో బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. అయితే టాటా మోటార్స్ ఆవిష్కరించిన ఆల్ట్రోజ్ CNG మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇతర CNG మోడల్స్ తో పోలిస్తే ఆల్ట్రోజ్ CNG బూట్ స్పేస్ కొంత ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఇందులో ట్విన్ సిలిండర్ సిఎన్‌జి టెక్నాలజీ కలిగి ఉండటమే.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన ఆల్ట్రోజ్ CNG

టాటా ఆల్ట్రోజ్ CNG మోడల్ ట్విన్ సిలిండర్ సిఎన్‌జి టెక్నాలజీ కలిగి ఉంటుంది. దీని ప్రకారం కంపెనీ ఇంజినీర్లు ఇందులో రెండు చిన్న CNG ట్యాంకులను నిక్షిప్తం చేశారు. ఈ కారణంగా బూట్ స్పేస్ ఎక్కువగా లభిస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. టాటా ఆల్ట్రోజ్ iCNG తో పాటు ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన టాటా పంచ్ iCNG కూడా చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

టాటా మోటార్స్ తన ఆల్ట్రోజ్ సిఎన్‌జి స్పెసిఫికేషన్‌లను గురించి అధికారికంగా వెల్లడించలేదు. కానీ టాటా టిగోర్ ఐసిఎన్‌జిలలో అదే 1.2-లీటర్, సహజంగా-ఆస్పిరేటెడ్, సిఎన్‌జి-అనుకూల ఇంజన్‌ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నాము. ఇది 84.82 bhp పవర్ మరియు 113 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. అదే CNG మోడ్ లో 73 bhp పవర్ మరియు 95 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే పొందుతుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన ఆల్ట్రోజ్ CNG

టాటా ఆల్ట్రోజ్ CNG డిజైన్ పరంగా దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో iRA-కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ మరియు వాహనం గురించి కావాల్సిన సమాచారం అందించే డ్రైవర్ డిస్ప్లే కూడా ఉంటుంది.

టాటా ఆల్ట్రోజ్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా మాత్రమే కాకుండా ఉత్తమమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఐసోఫిక్స్ పాయింట్స్ మొదలైనవన్నీ ఉంటాయి. కావున ఇది వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తుంది. టాటా ఆల్ట్రోజ్ గ్లోబల్-NCAP సేఫ్టీ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ పొంది అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన ఆల్ట్రోజ్ CNG

ఇదీనుల ఉండగా టాటా మోటార్స్ 2023 ఆటో ఎక్స్‌పోలో 'టాటా పంచ్ iCNG' వెర్షన్ కూడా ఆవిష్కరించింది. దీన్ని బట్టి చూస్తే ఈ టాటా పంచ్ కూడా CNG వెర్షన్ లో విడుదలకావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టాటా పంచ్ CNG కూడా ఎక్కువ బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇందులో 30-లీటర్ల పరిమాణంలో రెండు చిన్న సిఎన్‌జి ట్యాంకులు అమర్చబడి ఉంటాయి. అదే సమయంలో ఇందులో స్పేర్ వీల్ కారు కింద అమర్చబడి ఉంటుంది.

టాటా పంచ్ iCNG ఇతర టాటా CNG కార్ల మాదిరిగానే కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. ఇది ఒక కేజీ CNG కి 25 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుందని భావిస్తున్నాము. కావున ఇది స్టాండర్డ్ పెట్రోల్ మోడల్ కంటే మంచి మైలేజ్ అందిస్తుంది. ఈ SUV త్వరలోనే భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ కొత్త టాటా పంచ్ iCNG ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

Most Read Articles

English summary
Auto expo 2023 tata altroz cng showcased design features telugu details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X