హారియర్ & సఫారి రెడ్ డార్క్ ఎడిషన్స్ ఆవిష్కరించిన టాటా మోటార్స్.. అద్భుతమైన డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్

ఆటో ఎక్స్‌పో 2023 లో భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తన హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్ మరియు సఫారి రెడ్ డార్క్ ఎడిషన్‌ వంటి వాటిని ఆవిష్కరించింది. కంపెనీ ఇప్పటికీ ఇందులో డార్క్ ఎడిషన్‌ను కలిగి ఉంది, అయితే ఇప్పుడు ఆవిష్కరించిన ఎడిషన్స్ అక్కడక్కడా రెడ్ కలర్ పొందుతాయి.

టాటా మోటార్స్ ఆవిష్కరించిన ఈ ఆధునిక రెడ్ డార్క్ ఎడిషన్స్ మెరుగైన టచ్‌స్క్రీన్ మరియు ADAS టెక్నాలజీ వంటి వాటిని పొందుతాయి. అయితే కంపెనీ ఈ సంవత్సరం చివరినాటికి హారియర్ మరియు సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్‌లను విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే టాటా యొక్క ఫ్లాగ్‌షిప్ SUVలలో ADAS టెక్నాలజీ ప్రారంభించడం. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

హారియర్ & సఫారి రెడ్ డార్క్ ఎడిషన్స్ ఆవిష్కరించిన Tata Motor

హారియర్ మరియు సఫారి రెడ్ డార్క్ ఎడిషన్‌లలోని ADAS టెక్నాలజీలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB), ఫార్వర్డ్ కొలిషన్ అలర్ట్, లేన్ అసిస్ట్ మరియు ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి రెండూ కూడా ఇప్పుడు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో రానున్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. డిజైన్ పరంగా ఇవి చూడటానికి ఆకర్షణీయంగా మరియు చూడగానే ఆకర్శించే విధంగా ఉంటాయి.

టాటా హారియర్, సఫారి రెడ్ డార్క్ ఎడిషన్‌లు, డార్క్ ఎడిషన్ లాగా కొంత భిన్నంగా చాలావరకు ఆల్-బ్లాక్ ఎక్స్‌టీరియర్‌ కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ 'ఒబెరాన్ బ్లాక్' అని పిలుస్తుంది. అయితే మనం అక్కడక్కడా రెడ్ కలర్ కూడా గమనించవచ్చు. ఇది ప్రధానంగా బ్రేక్ కాలిపర్‌లలో చూడవచ్చు. ఇక్కడ 18 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఈ ఎడిషన్ ముందు భాగంలోని గ్రిల్ మీద కూడా రెడ్ కలర్ చూడవచ్చు.

హారియర్ & సఫారి రెడ్ డార్క్ ఎడిషన్స్ ఆవిష్కరించిన Tata Motor

బయటవైపు రెడ్ కలర్ ఎక్కువ లేకుండా ఉన్నప్పటికీ ఇంటీరియర్ మాత్రం ఎక్కువ భాగం రెడ్ కలర్ పొందుతుంది. ఇది క్విల్టెడ్ ప్యాటర్న్‌తో కూడిన 'కార్నెలియన్' రెడ్ సీట్ అప్హోల్స్టరీ, రెడ్ లెథెరెట్ గ్రాబ్ హ్యాండిల్స్, డ్యాష్‌బోర్డ్‌పై గ్రే ట్రిమ్ మరియు స్టీరింగ్ వీల్‌పై పియానో ​​బ్లాక్ ఇన్సర్ట్‌లను చూడవచ్చు. ఇందులో 10.25 ఇంచెస్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ చూడవచ్చు. అంతే కాకుండా ఇందులో 9 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్‌ ఉంటుంది.

హారియర్ మరియు సఫారి రెడ్ డార్క్ ఎడిషన్‌లు సాధారణ వేరియంట్‌లలో అందించే సెమీ-డిజిటల్‌కు బదులుగా కొత్త, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతాయి. ఇందులో 360 డిగ్రీ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఎడిషన్ లో మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వరుస కోసం వెంటిలేషన్ ఫంక్షన్‌ వంటివి ఉన్నాయి. వీటితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్ దాని చుట్టూ యాంబియంట్ లైటింగ్ ఉంటుంది.

హారియర్ & సఫారి రెడ్ డార్క్ ఎడిషన్స్ ఆవిష్కరించిన Tata Motor

టాటా హారియర్ మరియు సఫారి రెడ్ డార్క్ ఎడిషన్‌లు రెండూ కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందినప్పటికీ యాంత్రికంగా ఎలాంటి మార్పులకు లోను కాలేదని తెలుస్తోంది. కావున ఇందులో అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఎడిషన్లు ఈ సంవత్సరం విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ ఎప్పుడు విడుదలవుతుంది అనేదాని గురించి కంపెనీ అధికారిక సమాచారం అందించలేదు.

టాటా మోటార్స్ 2023 ఆటో ఎక్స్‌పోలో టాటా హారియర్ మరియు సఫారి రెడ్ డార్క్ ఎడిషన్‌తో పాటు టాటా పంచ్ CNG, టాటా హారియర్ ఈవి, టాటా అవిన్యా, టాటా కర్వ్ మరియు టాటా సియెర్రా వంటి ఆధునిక మోడల్స్ కూడా ఆవిష్కరించింది. ఆయితే కంపెనీ దేశీయ మార్కెట్లో హారియర్ మరియు సఫారి రెడ్ డార్క్ ఎడిషన్‌ విడుదల చేసిన తరువాత మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. హారియర్ మరియు సఫారి రెడ్ డార్క్ ఎడిషన్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Auto expo 2023 tata harrier safari red dark editions revealed design features and adas
Story first published: Friday, January 13, 2023, 8:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X