అనుకున్నట్లుగానే 2023 ఆటో ఎక్స్‌పోలో అలరించిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300: పూర్తి వివరాలు

ఇప్పటికే మనం మునుపటి కథనాల్లో చెప్పుకున్న విధముగా టయోటా కంపెనీ ఎట్టకేలకు తన 'ల్యాండ్ క్రూయిజర్ 300' 2023 ఆటో ఎక్స్‌పో వేదికగా ఆవిష్కరించింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ ల్యాండ్ క్రూయిజర్ 300 గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. రండి.

ఆటో ఎక్స్‌పో 2023 లో ప్రదర్శించబడిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 ధర రూ. 2.17 కోట్లు (ఎక్స్-షోరూమ్). కంపెనీ 2022 ఆగష్టు నెలలో రూ. 10 లక్షల టోకెన్ ధరతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే ఈ SUV మొత్తమ్ అమ్ముడైపోయింది. కావున కంపెనీ ప్రస్తుతం ఎటువంటి బుకింగ్‌లను అంగీకరించడం లేదని డీలర్ వర్గాలు చెబుతున్నాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో అలరించిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300

కంపెనీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ ల్యాండ్ క్రూయిజర్ 300 కోసం బుకింగ్స్ ప్రారభించే అవకాశం ఉంది. ఈ SUV డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే, ఇందులో సమాంతరంగా కనిపించే స్లాట్‌లతో కూడిన పెద్ద గ్రిల్, దానికి ఇరువైపులా సొగసైన LED హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫాగ్ ల్యాంప్‌ ఉంటాయి. సైడ్ ప్రొఫైల్ భారీగా కనిపించడమే కాకుండా ఫ్లెర్డ్ వీల్ ఆర్చ్‌లతో ఉంటుంది. వెనుక వైపున LED టెయిల్‌లైట్‌లతో నిటారుగా ఉండే టెయిల్‌గేట్‌ చూడవచ్చు.

ఇంకా ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో సెంట్రల్ కన్సోల్, డోర్ ప్యాడ్‌లు మరియు స్టీరింగ్ వీల్‌పై వుడ్ మరియు సిల్వర్ ఫినిషింగ్ తో బ్లాక్ మరియు బేజ్ కలర్ థీమ్ పొందుతుంది. క్యాబిన్ మొత్తం చాలా వరకు బ్లాక్ కలర్ థీమ్ పొందుతుంది, కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. క్యాబిన్ చాలా విశాలంగా ఉండటం వల్ల మంచి డ్రైవింగ్ అనుభూతిని వాహన వినియోగదారులు తప్పకుండా పొందవచ్చు.

2023 ఆటో ఎక్స్‌పోలో అలరించిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్, 14-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు మరియు సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. కావున ఈ ల్యాండ్ క్రూయిజర్‌ 300 తప్పకుండా వినియోగదారులను ఆకర్షిస్తుంది.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 భారతదేశంలో కేవలం ఒక పవర్‌ట్రెయిన్ ఎంపికతో అందుబాటులో ఉంటుంది. కావున ఇందులో 3.3-లీటర్, టర్బోచార్జ్డ్, V6 డీజిల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 309 పిఎస్ పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ప్రామాణికంగా 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో అలరించిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300

అంతర్జాతీయ మార్కెట్లలో, టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 SUV మరింత శక్తివంతమైన 3.5-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V6 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 415 పిఎస్ పవర్ మరియు 650 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి6 పెట్రోల్ ఇంజన్ కూడా కొన్ని ప్రాంతాలలో ఆఫర్‌లో ఉంది.

ఈ లేటెస్ట్ SUV యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ADAS టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది, కావున అడాప్టివ్ వేరియబుల్ సస్పెన్షన్, ఫోర్-జోన్ టెంపరేచర్ కంట్రోల్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, లెదర్ అపోల్స్ట్రే వంటి వాటితో పాటు రెండవ వరుసలో 11 ఇంచెస్ స్క్రీన్‌లు, మల్టీ-టెర్రైన్ మోడ్ సెలెక్టర్, 3D మల్టీ-టెర్రైన్ మానిటర్ మరియు 10 ఎయిర్‌బ్యాగ్‌లు వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

Most Read Articles

English summary
Auto expo 2023 toyota land cruiser 300 showcased specs features details in telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X