ఆటో ఎక్స్‌పో 2023: అందరిని ఒక్క చూపుతో ఆకట్టున్న 'టయోటా హైలక్స్ ఎక్స్‌ట్రీమ్' - వివరాలు

టయోటా కంపెనీ 2023 ఆటో ఎక్స్‌పోలో ఒక అద్భుతమైన ఆఫ్ రోడ్ కాన్సెప్ట్‌ ఆవిష్కరించింది. ఈ ఆఫ్ రోడ్ కాన్సెప్ట్‌ ఆఫ్ రోడ్ ప్రియలందరిని ఒక్క చూపుతోనే కట్టి పడేసింది. టయోటా కంపెనీ ప్రదర్శించిన ఈ ఆఫ్ రోడ్ కాన్సెప్ట్‌ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టయోటా కంపెనీ ఆవిష్కరించిన ఆఫ్ రోడ్ కాన్సెప్ట్‌ పేరు 'హైలక్స్ ఎక్స్‌ట్రీమ్'. ఈ కొత్త టయోటా హైలక్స్ ఎక్స్‌ట్రీమ్ చూడగానే కేవలం ఆఫ్ రోడ్ ప్రేమికులు మాత్రమే కాకుండా ఎవరైనా ముగ్దులవ్వాల్సిందే. అంత అద్భుతంగా రూపొందించబడింది ఈ మోడల్. ఈ ఆఫ్ రోడర్ రెడ్ కలర్ లో చాలా దృడంగా కనిపిస్తుంది. ఇందులో ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్ చంకీ ఆఫ్ రోడ్ టైర్‌లతో కలిసి ఉంటాయి.

అందరిని ఒక్క చూపుతో ఆకట్టున్న టయోటా హైలక్స్ ఎక్స్‌ట్రీమ్

ఈ కొత్త టయోటా హైలక్స్ ఎక్స్‌ట్రీమ్ కాన్సెప్ట్ పిక్ అప్ SUV అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ కూడా పొందుతుంది. కావున ఎలాంటి ఆఫ్ రోడింగ్ కైనా ఇది సిద్ధంగా ఉంటుంది. ఈ పిక్-అప్ SUV యొక్క నాలుగు మూలల్లో గ్యాస్ ఛార్జ్డ్ డంపర్‌లతో కూడిన మందమైన కాయిలోవర్ స్ప్రింగ్‌లు మరియు అదనపు కస్టమ్-మేడ్ అండర్‌బాడీ ప్రొటక్షన్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా వెనుక భాగంలో ఆఫ్-రోడ్ బంపర్‌లను కూడా ఉపయోగించింది.

టయోటా Hilux ఎక్స్‌ట్రీమ్ ఆఫ్ రోడ్ పిక్-అప్ SUV లో లైటింగ్ సెటప్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో రెండు LED స్పాట్ లైట్లు మరియు ముందు బంపర్‌పై LED ఫ్లడ్ లైట్, బానెట్‌పై మరో 2 LED ఆక్సిలరీ లైట్లు, రూఫ్ రాక్‌పై ఆరు LED ఆక్సిలరీ లైట్ల సెట్ ఉన్నాయి. ఇవన్నీ అద్భుతమైన దృశ్య మానతను అందిస్తాయి. అంతే కాకూండా ఇందులో కొంత పొడవుగా ఉండే ORVM వంటి వాటిని చూడవచ్చు.

అందరిని ఒక్క చూపుతో ఆకట్టున్న టయోటా హైలక్స్ ఎక్స్‌ట్రీమ్

టయోటా Hilux ఎక్స్‌ట్రీమ్ పరిమాణంలో కొంత పెద్దదిగా ఉంటుంది. కావున ఈ వాహనం లోపలి వెళ్ళడానికి మరియు బయటకు రావడానికి వీలుగా ఫుట్‌రెస్ట్ కూడా పొందుతుంది. Hilux ఎక్స్‌ట్రీమ్ ఆఫ్-రోడ్ కాన్సెప్ట్ 6 ఇంచెస్ లిఫ్ట్ కిట్‌తో స్టాండర్డ్ Hilux పిక్-అప్ ట్రక్ కంటే ఎత్తుగా ఉంది. దీని ముందు బంపర్‌లో బాష్ ప్లేట్, వించ్ మరియు టో హుక్స్ వంటివి కూడా గమనించవచ్చు.

కొత్త టయోటా Hilux ఎక్స్‌ట్రీమ్ బాహ్య మార్పులు మనకు స్ఫష్టంగా తెలుస్తున్నాయి. అయితే లోపల ఇంటీరియర్ లో ఏమైనా మార్పులు జరిగాయా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. దీని గురించి టయోటా కూడా ఎలాంటి సమాచారం అందివ్వలేదు. ఈ SUV టయోటా ఫార్చ్యూనర్ యొక్క అదే 2.8-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. ఈ ఇంజిన్ 201 bhp పవర్ మరియు 500 Nm గరిష్ట టార్క్‌ అందిస్తుంది.

అందరిని ఒక్క చూపుతో ఆకట్టున్న టయోటా హైలక్స్ ఎక్స్‌ట్రీమ్

ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఈ ఆఫ్ రోడ్ టయోటా Hilux ఎక్స్‌ట్రీమ్ చాలా దృఢమైన వాహనం అని చెప్పాలి. ఎందుకంటే ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా కంపెనీ దీనిని నిర్మించింది. ఇందులో పరికరాలన్నీ కూడా ఇతర వాహనాలకంటే కూడా చాలా దృడంగా ఉండటం చూడవచ్చు. కంపెనీ ఈ Hilux ఎక్స్‌ట్రీమ్ లాంచ్ గురించి మరియు ధరలను గురించి ఎటువంటి సమాచారం అందించలేదు. ఇవన్నీ కూడా కంపెనీ రానున్న రోజుల్లో వెల్లడించే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడ్డాయి మరియు విడుదలయ్యాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన/విడుదలైన వాహనాలను గురించి తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.

Most Read Articles

English summary
Auto show 2023 toyota hilux extreme off road concept showcased telugu details
Story first published: Friday, January 13, 2023, 11:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X