దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు

బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బెంట్లీ' భారతీయ మార్కెట్లో 'బెంటైగా ఈడబ్ల్యుబి' (Bentayga EWB) విడుదల చేసింది. ఈ కొత్త లగ్జరీ కార్ ధర అక్షరాలా రూ. 6 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ SUV డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఈ లగ్జరీ SUV రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి అజూర్ మరియు ఫస్ట్ ఎడిషన్. ఈ కొత్త బెంట్లీ బెంటైగా ఈడబ్ల్యుబి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ వీల్‌బేస్‌ కలిగి ఉంటుంది. ఈ లగ్జరీ కార్ వీల్‌బేస్‌ మునుపటి మోడల్స్ కంటే 180 మిమీ ఎక్కువగా ఉంది. కావున రియర్ సీట్ ప్యాసింజర్లు కూడా మంచి ప్రయాణ అనుభూతిని పొందవచ్చు.

బెంట్లీ నుంచి కొత్త బెంటైగా EWB

బెంట్లీ బెంటైగా ఈడబ్ల్యుబి అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ SUV ని కొనుగోలుదారులు 4 సీటర్ లేదా 5 సీటర్ ఆప్సన్స్ లో ఎంచుకోవచ్చు. 5 సీటర్ వేరియంట్ రెండు పెద్ద వెనుక సీట్ల మధ్య చిన్న జంప్ సీటు పొందుతుంది. అయితే కంపెనీ ఇందులో 7 సీటర్ ఆప్సన్ అందించలేదు. అయినప్పటికీ ఇది వాహన వినియోగదారులకు మంచి కంఫర్ట్ అందిస్తుంది.

బెంట్లీ బెంటైగా EWB యొక్క ఫీచర్స్ లో ప్రత్యేకంగా చెప్పుకోదగినది, ఎయిర్‌లైన్ సీట్. ఇది ప్యాసింజర్ యొక్క శరీర ఉష్ణోగ్రతను మరియు ఉపరితల తేమను గ్రహించి దానికి అనుకూలంగా ఉండాల్సిన ఉష్ణోగ్రత మరియు గాలి ప్రవాహాన్ని అందిస్తుంది. ఇది ప్రత్యేకమైన సీటింగ్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. ఈ సీటింగ్ ఆప్సన్ అన్ని విధాలా ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా రూపొందించబడి ఉంటాయి.

బెంట్లీ నుంచి కొత్త బెంటైగా EWB

ఇందులో ఉండే రియర్ సీట్లు కూడా 40 డిగ్రీల వరకు వంగి ఉంటాయి. అదనపు స్థలం కోసం ముందు ప్రయాణీకుల సీటును ముందుకు కదిలించవచ్చు. అంతే కాకుండా ఈ లగ్జరీ SUV లో డిప్లోయబుల్ ఫుట్‌రెస్ట్‌లు, హీటెడ్ మరియు కూల్డ్ రియర్ ఆర్మ్‌రెస్ట్‌లను పొందుతుంది. వెనుక వైపు ఉన్న ప్రయాణికులు హ్యాండ్‌హెల్డ్ టచ్‌స్క్రీన్ ద్వారా వెనుక సీటు ఫంక్షన్‌లను కంట్రోల్ చేయవచ్చు. ఇది కూడా ఇందులో ఉన్న ఆధునిక ఫీచర్.

కొత్త బెంట్లీ బెంటైగా EWB డిజైన్ పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులో వర్టికల్ స్లాటెడ్ గ్రిల్ చూడవచ్చు. ఇది ఈ లగ్జరీ SUV కి మరింత ఆకర్షణీయమైన లుక్ ఇస్తుంది. సైడ్ ప్రొఫైల్ లో 22 ఇంచెస్ 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది కూడా చూపరులను చూడగానే ఆకర్శించే విధంగా రూపొందించబడి ఉంటుంది. మొత్తమ్ మీద ఫీచర్స్ మాత్రమే కాకుండా డిజైన్ కూడా చాలా ఆధునికంగా ఉంటుంది.

బెంట్లీ నుంచి కొత్త బెంటైగా EWB

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త బెంట్లీ బెంటైగా EWB లో 4.0 లీటర్, ట్విన్ టర్బో, V8 పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 543 bhp పవర్ మరియు 770 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ లగ్జరీ SUV కేవలం 4.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ SUV గరిష్ట వేగం గంటకు 290 కిమీ వరకు ఉంటుంది. పనితీరు పరంగా కూడా ఈ SUV అద్భుతంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బెంట్లీ బెంటైగా EWB అనేది రోల్స్ రాయిస్ కల్లినన్ కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. మార్కెట్లో ఈ లగ్జరీ కారు ధర రూ. 6.95 కోట్లు. అయితే ఇది సింగిల్ వీల్‌బేస్‌తో మాత్రమే అందించబడుతుంది. కావున బెంట్లీ బెంటైగా EWB మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ GLS మరియు హై-స్పెక్ రేంజ్ రోవర్ LWB వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కానీ బెంట్లీ బెంటైగా EWB కంటే వీటి ధరలు చాలా తక్కువ.

Most Read Articles

English summary
Bentley bentayga ewb launched in india price features and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X