ఆటో ఎక్స్‌పో 2023: ఒక్క ఛార్జ్‌తో 700 కిమీ రేంజ్ అందించే BYD సీల్.. భారత్‌లో విడుదలకు సన్నద్ధం

భారతీయ మార్కెట్లో దినదినాభివృద్ధి పొందుతున్న BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) భారతదేశంలో జరుగుతున్న 2023 ఆటో ఎక్స్‌పోలో తన సరికొత్త ఎలక్ట్రిక్ సెడాన్ 'సీల్' ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ డిజైన్, ఫీచర్స్ మరియు రేంజ్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బివైడి కంపెనీ ప్రదర్శించిన ఈ కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెస్లా మోడల్ 3 కి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ సెడాన్ యొక్క డెలివరీలు 2023 నాల్గవ త్రైమాసికంలో లేదా 2023 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సెడాన్ ఓషన్ X కాన్సెప్ట్ ద్వారా ప్రేరణ పొందింది. ఇది 4800 మిమీ పొడవు, 1875 మిమీ వెడల్పు మరియు 1460 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది.

700 కిమీ రేంజ్ అందించే BYD సీల్

బివైడి సీల్‌ అనేది కూపే లాంటి ఆల్-గ్లాస్ రూఫ్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, బూమరాంగ్ ఆకారపు LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్ మరియు వెనుక వైపు వెడల్పు అంతటా వ్యాపించి ఉండే LED లైట్ బార్ వంటివి పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. మొత్తం మీద ఈ కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ మంచి ఆకర్షణీయమైన డిజైన్ పొందుతుంది.

ఇప్పటికే భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న బివైడి Atto 3 మరియు e6 మాదిరిగానే సీల్ సెడాన్ కూడా సెంటర్ కన్సోల్‌లో 15.6 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు హెడ్స్ అప్ డిస్‌ప్లే వంటివి కూడా ఇందులో ఉంటాయి. ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ చుట్టూ సెంట్రల్ AC వెంట్స్‌ ఉంటాయి. దాని కింద డ్రైవ్ మోడ్‌లను ఎంచుకోవడానికి డ్రైవ్ సెలెక్టర్ మరియు స్క్రోల్ వీల్ ఉంటుంది.

700 కిమీ రేంజ్ అందించే BYD సీల్

సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ ఆడియో సిస్టమ్ కోసం వాల్యూమ్ కంట్రోల్ అలాగే రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు వంటి ఫంక్షన్‌ల కోసం కంట్రోల్స్ కలిగి ఉంటుంది. గ్లోవ్ బ్లాక్ ఇన్‌సర్ట్‌లు, వైట్ కాంట్రాస్టింగ్ డ్యాష్‌బోర్డ్ ట్రిమ్ మరియు డోర్ హ్యాండిల్స్ స్పీకర్‌లలో కలిసిపోయాయి. మొత్తం మీద ఈ ఎలక్ట్రిక్ సెడాన్ యొక్క ఇంటీరియర్ దాని మునుపటి మోడల్స్ మాదిరిగా చాలా అద్భుతంగా ఉంటుంది.

BYD సీల్ కంపెనీ యొక్క ఇ-ప్లాట్‌ఫారమ్ 3.0 పై ఆధారపడి ఉంటుంది. కావున ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. అవి ఒకటి 61.4 కిలోవాట్ యూనిట్, మరొకటి 82.5 కిలోవాట్ యూనిట్. మొదటి బ్యాటరీ ప్యాక్ (61.4 కిలోవాట్ యూనిట్) ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 550 కిమీ పరిధిని అందిస్తుంది. అదే సమయంలో రెండవ బ్యాటరీ ప్యాక్ (82.5 కిలోవాట్ యూనిట్) ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 700 కిమీ పరిధిని అందిస్తుంది.

700 కిమీ రేంజ్ అందించే BYD సీల్

ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ సింగిల్-మోటార్ మరియు డ్యూయల్-మోటార్ పవర్‌ట్రైన్‌ల ఎంపికను కూడా పొందుతుంది. సింగిల్ మోటారును రెండు బ్యాటరీలకు జత చేయగలిగినప్పటికీ, రెండోది మాత్రం పెద్ద బ్యాటరీతో ఉంటుంది. భారతదేశంలో, ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌ను పొందే డ్యూయల్ మోటార్ పవర్‌ట్రెయిన్‌తో ఈ సెడాన్ అందించబడుతుంది. ఇది కేవలం 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

బివైడి కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ 'సీల్' కోసం బుకింగ్స్ 2023 సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంటుంది. దీని ధర ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, అయినప్పటికీ దేశీయ మార్కెట్లో సీల్ సెడాన్ ధర రూ. 70 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. 2023 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడే/విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' ఫై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Byd seal electric sedan in auto expo 2023 launch soon india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X