త్వరలో విడుదలకానున్న eC3 బుకింగ్స్ అప్పుడే అంటున్న సిట్రోయెన్ - వివరాలు

దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందుతున్న ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ ఇప్పటికే సిట్రోయెన్ సి3 మరియు సి5 ఎయిర్ క్రాస్ వంటి వాటిని విక్రయిస్తోంది. కాగా కంపెనీ ఇప్పుడు తన సి3 ని ఎలక్ట్రిక్ వెర్షన్ లో తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది.

సిట్రోయెన్ కంపెనీ తన సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ గురించి ఇప్పటికే వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌కోసం కంపెనీ ఈ నెల 22 నుంచి అంటే జనవరి 22 నుంచి బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించనుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్ మీద ఏకంగా 320 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

త్వరలో విడుదలకానున్న సిట్రోయెన్ eC3 బుకింగ్స్ అప్పుడే..

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న సరికొత్త Citroen eC3 అనేది C3 హ్యాచ్‌బ్యాక్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్. ఇది దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ కారు అవుతుంది. ఇది భారతీయ విఫణిలో ఇప్పటికే విక్రయించబడుతున్న Tata Tiago EV కి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది వచ్చే నెలకు షోరూమ్‌లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది, కావున బుక్ చేసుకున్న వారు త్వరలోనే డెలివరీలను పొందవచ్చు.

సిట్రోయెన్ కంపెనీ ఈ eC3 ఎలక్ట్రిక్ కారు యొక్క ధరలను గురించి ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీని ప్రారంభ ధరలు రూ. 9 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 29.2 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా బ్యాటరీ ప్యాక్ 56.2 bhp మరియు 143 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసి ఫ్రంట్ యాక్సిల్‌కు అమర్చబడిన ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది.

త్వరలో విడుదలకానున్న సిట్రోయెన్ eC3 బుకింగ్స్ అప్పుడే..

కొత్త సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ కారు కేవలం 6.8 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 107 కిమీ వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఎకో మరియు స్టాండర్డ్ అనే రెండు డ్రైవింగ్ మోడ్‌లను కూడా అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో రీజెన్ బ్రేకింగ్‌ సిస్టం కూడా అందుబాటులో ఉంటుంది, కావున ఇది కూడా వాహన వినియోగాదారులకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఇక సిట్రోయెన్ eC3 ఛార్జింగ్ ఆప్సన్స్ విషయానికి వస్తే, ఇది 15A ప్లగ్ పాయింట్‌లో ప్లగ్ చేయబడిన ఆన్‌బోర్డ్ 3.3kW AC సెటప్‌ని ఉపయోగించి బ్యాటరీ ప్యాక్‌ను 10 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 10.5 గంటలు పడుతుంది. ఇది 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 57 నిముషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. కావున ఛార్జింగ్ సమయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

త్వరలో విడుదలకానున్న సిట్రోయెన్ eC3 బుకింగ్స్ అప్పుడే..

కొత్త Citroen eC3 యొక్క బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ 7 సంవత్సరాలు లేదా 1,40,000 కిలోమీటర్ల వారంటీని అందించనుంది. అయితే ఎలక్ట్రిక్ మోటారు మీద కంపెనీ 5 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తుంది. అదే సమయంలో eC3 ఎలక్ట్రిక్ మీద 3 సంవత్సరాలు లేదా 1,25,000 కిమీ వారంటీ లభిస్తుంది. వారంటీ పరంగా కూడా ఈ ఆప్సన్స్ ఉత్తమమైనవనే చెప్పాలి.

త్వరలో రానున్న సిట్రోయెన్ eC3 డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో ఛార్జింగ్ కోసం ఒక ఛార్జింగ్ పోర్ట్ లభ్సిస్తుంది, మరియు డ్రైవర్ సైడ్ ఫ్రంట్ ఫెండర్‌లో కొన్ని మార్పులను చూడవచ్చు. రియర్ ప్రొఫైల్ మీద కంపెనీ బ్యాడ్జ్ వంటివి లభించే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ధరలు మరియు ఇతరత్రా వివరాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Citroen ec3 specs range features and expected price details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X