'ఆటో ఎక్స్‌పో 2023' లో అడుగెట్టిన టాప్ 5 కార్లు, ఇవే - పూర్తి వివరాలు

కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో అనేక ఆధునిక కార్లు విడుదలయ్యాయి. ఇందులో టాటా నుంచి హ్యుందాయ్ వరకు మరియు మారుతి సుజుకి నుంచి కియా వరకు చాలా కంపెనీలు ఉన్నాయి. అయితే 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన టాప్ 5 కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

మారుతి సుజుకి జిమ్నీ:

మారుతి సుజుకి 2023 ఆటో ఎక్స్‌పో వేదికగా ఎంతో మంది వాహన ప్రియులు వేచి చూస్తున్న ప్రముఖ ఆఫ్ రోడర్ 5 డోర్స్ మారుతి సుజుకి జిమ్నీ ప్రదర్శించింది. కంపెనీ ఈ SUV కోసం మొదటి రోజు నుంచే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభించిన రెండు రోజుల్లోనే 3,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. కావున కంపెనీ బుకింగ్ ప్రైస్ కూడా పెంచింది.

ఆటో ఎక్స్‌పో 2023 లో అడుగెట్టిన టాప్ 5 కార్లు, ఇవే

ఇప్పుడు మారుతీ సుజుకి జిమ్నీ బుక్ చేసుకోవాలనుకునేవారు రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ SUV మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని K15B పెట్రోల్ ఇంజన్‌ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పి పవర్ మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్:

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన ఆధునిక కార్లలో ఒకటి మారుతి సుజుకి ఫ్రాంక్. కంపెనీ ఈ SUV ని ఆవిష్కరించిన రోజు నుంచే బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఇది ఈ సంవత్సరం మార్చి నాటికి దేశీయ మార్కెట్లో మారుతి నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది. ఇది దేశీయ మార్కెట్లో సిట్రోయెన్ సి3, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కిగర్ వంటి కాంపాక్ట్ SUV లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

ఆటో ఎక్స్‌పో 2023 లో అడుగెట్టిన టాప్ 5 కార్లు, ఇవే

ఈ ఫ్రాంక్ SUV లేటెస్ట్ డిజైన్ కలిగి మరింత అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇంజిన్ కూడా అద్భుతమైన పనితీరుని అందించేలా రూపొందించబడింది. ఇక సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా ఉత్తమంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. మారుతి సుజుకి ఫ్రాంక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

హ్యుందాయ్ ఐయోనిక్ 5:

2023 ఆటో ఎక్స్‌పో వేదికగా విడుదలైన కార్లలో హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఒకటి. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని గతంలోనే ఆవిష్కరించినప్పటికీ ధరలను ఇటీవల వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధరలు రూ. 44.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు మొదటి 500 మంది కస్టమర్లలకు మాత్రమే వర్తిస్తాయి. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ కూడా ఇప్పటికే స్వీకరించడం ప్రారంభించింది. కావున ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 1 లక్ష చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఆటో ఎక్స్‌పో 2023 లో అడుగెట్టిన టాప్ 5 కార్లు, ఇవే

హ్యుందాయ్ ఐయోనిక్ 5 డిజైన్ పరంగా గానీ, ఫీచర్స్ పరంగా గానీ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారులో 72.6kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 214 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో 631 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. ఇది 350kw DC ఛార్జర్‌ ద్వారా 18 నిముషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

కియా KA4:

కియా కంపెనీ ప్రదర్శించిన కార్లలో KA4 ప్రీమియం MPV ఒకటి. ఇది మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ స్పేస్ పొందింది. ఇది ప్రస్తుతము మార్కెట్లో అందుబాటులో ఉన్న కియా కార్నివాల్ తో పోలిస్తే ఇది మరింత ఉత్తమంగా ఉంటుంది. ఈ MPV ముందు భాగంలో 'టైగర్ నోస్' గ్రిల్‌ను డైమండ్ నమూనాతో ఉంటుంది. కియా KA4 గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హ్యుందాయ్ ఐయోనిక్ 6:

ముందు చెప్పినట్లుగానే హ్యుందాయ్ కంపెనీ ఆటో ఎక్స్‌పో 2023 లో తన ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడమే కాకుండా ఐయోనిక్ 6 ఎలక్ట్రిక్ సెడాన్‌ను కూడా ప్రదర్శించింది. ఈ మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ సెడాన్ ఎంతో మంచి ప్రేక్షకుల మనసున ఆకర్శించింది. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక కాలంలో ఉపయోగపడే అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ మంచి పనితీరుని కూడా అందిస్తుంది.

Most Read Articles

English summary
Top five cars in 2023 auto expo jimny fronx and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X