డ్రైవింగ్ టెస్టులో 110 సార్లు ఫెయిల్ అయిన బ్రిటీష్ లేడి

By Ravi

బ్రిటన్‌లో ఓ 28 ఏళ్ల మహిళ డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయింది. అయితే ఇందులో వింతేముంది అంటారా? అసలు విషయం ఇక్కడే ఉంది. సదరు మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 110 సార్లు డ్రైవింగ్ టెస్టులో ఫెయిల్ అయిందట. అన్నిసార్లు డ్రైవింగ్ టెస్టులో పాల్గొన్నందుకు గాను ఆమె ఇప్పటి వరకు 3410 పౌండ్లు (మన కరెన్సీలో సుమారు రూ.3.50 లక్షలు) చెల్లించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ఆన్-లైన్ ద్వారా లెర్నర్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకోవటం ఎలా?

బ్రిటన్‌లో ముందుగా థియరీ టెస్ట్ పాస్ అయిన తర్వాత ప్రాక్టికల్ టెస్ట్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే, ఈవిడ కేవలం థియరీ టెస్ట్‌లోనే 110 సార్లు ఫెయిల్ అయితే ఇక ప్రాక్టికల్ టెస్టులో ఇంకెన్నిసార్లు ఫెయిల్ అవుతుందో ఊహించుకోవచ్చు. ఒక్కసారి వ్రాత పరీక్షకు హాజరు కావాలంటే 31 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ప్రతి ప్రశ్నకు మల్టిపుల్ చాయిస్‌తో కూడిన సమాధానాలు ఉంటాయి, వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

British Woman Tries 110 Times To Pass Driving Test

సదరు బ్రిటీష్ లేడి తన 17వ ఏటనే (బ్రిటన్‌లో డ్రైవింగ్ లైసెన్సుకు అర్హత వయస్సు) డ్రైవింగ్ టెస్టుకు తొలిసారిగా హాజరయ్యిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె మొత్తంగా 110 సార్లు టెస్టుకు హాజరు కావటం, ప్రతిసారి టెస్టులో ఫెయిల్ కావటం జరుగుతోందట. అంటే, మొత్తంగా 11 ఏళ్ల పాటు ఏడాది 10 సార్లు చొప్పున ఆమె ఈ థియరీ డ్రైవింగ్ టెస్టుకు హాజరయ్యిందన్నమాట.

యూకేలో దాదాపు 65.4 శాతం మంది మాత్రమే డ్రైవింగ్ పరీక్షలో పాస్ అవుతుంటారు. గతంలో ఓ బ్రిటీష్ వ్యక్తి కూడా ఏకంగా 90 సార్లు డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ వార్తల్లో ప్రధానంశంగా నిలిచిన సంగతి తెలిసినదే. అలాగే బ్రిస్టల్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ కూడా 57 సార్లు డ్రైవింగ్ టెస్టులో ఫెయిల్ అయ్యింది. థియరీ టెస్టులో పాస్ అయిన వారు ప్రాక్టిల్ టెస్టులో ఎక్కువగా ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

బ్రిటన్‌కు చెందిన ఓ మధ్య వయస్సు వ్యక్తి ఏకంగా 36 సార్లు ప్రాక్టికల్ టెస్టులో ఫెయిల్ అయ్యి, 37వ సారి చేసిన ప్రయత్నంలో పాస్ అయ్యాడు. ప్రాక్టికల్ టెస్టుకు బ్రిటన్‌లో పనిదినంలో అయితే 62 పౌండ్లు, సాయంత్రం లేదా సెలవు దినం లేదా వారాంతంలో అయితే 75 పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది.

Most Read Articles

English summary
A 28 year old woman from Southwark, south-east London has failed her driving test. You may think what's the big deal about it? Well, in total, including this last time, she has failed a total of 110 times!
Story first published: Saturday, July 19, 2014, 11:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X