Just In
Don't Miss
- Sports
India vs England: చెన్నై చేరుకున్న రోహిత్, రహానే, శార్దూల్
- News
ఆన్లైన్ ద్వారా నామినేషన్లు: జగన్ పుణ్యంతో జైలుకు: సుమోటో: అన్ని స్థానాల్లో పోటీ: సోము-నాదెండ్ల
- Finance
పరిహారం చెల్లించకపోతే ఆ ఆస్తులు జఫ్తు చేస్తాం: భారత్‌కు కెయిర్న్ తీవ్ర హెచ్చరిక
- Lifestyle
గోధుమ రవ్వ పాయసం
- Movies
డిజిటల్ రిలీజ్ కు సిద్దమైన మాస్టర్.. ఇక బాక్సాఫీస్ రికార్డులకు బ్రేక్ పడినట్లే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరోసారి వైరల్ అయిన మహేంద్ర సింగ్ ధోని వీడియో : అదేంటో తెలుసా !
ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి అందరికి తెలిసిందే, ధోని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మనందరికీ తెలిసినట్లుగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి క్రికెట్ అంటే మాత్రమే కాదు వాహనాల మీద కూడా ఎక్కువ వ్యామోహం ఉంది. ధోనికి ఉన్న వాహనాల అభిరుచి వల్ల అతడు ఏకంగా ఒక గ్యారేజ్ నిర్మించుకున్నాడు. ఇటీవల అతని గ్యారేజ్ గురించి తెలుసుకున్నాం. ధోని తన గ్యారేజ్ లో అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లు మరియు బైక్ లను కలిగి ఉన్నాడు.

మహేంద్ర సింగ్ ధోని కలిగి ఉన్న వెహికల్స్ లో యమహా ఆర్డీ 350, యమహా ఆర్ఎక్స్ 100, కవాసాకి నింజా జెడ్ 12 ఆర్, కవాసాకి హెచ్ 2 ఆర్ బైక్‌లు ఉన్నాయి. ధోనికి బైక్‌లు మాత్రమే కాకుండా ఆకర్షణీయమైన కార్లు కూడా ఉన్నాయి. ధోని రోడ్లపై వాహనాలను నడుపుతున్న అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో ధోని తన అభిమాన వాహనాలతో కనిపించాడు.

ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో దీని గురించి మాట్లాడుతూ, తన భార్య సాక్షి ధోని, తాను ఎక్కువ సమయం బైక్‌లతో గడుపుతున్నానని చెప్పారు. బైక్‌లను విడదీయడం మరియు వాటిని మళ్లీ కలపడం ధోనికి ఎక్కువ ఇష్టం.
MOST READ:గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే కార్లు నుజ్జు నుజ్జు చేసిన పోలీసులు ; వీడియో చూడండి

క్రికెట్‌తో పాటు ధోని వాహనాల వార్తల్లో తరచుగా కనిపిస్తూ ఉంటాడు. ధోని ఇటీవల స్వరాజ్ నుంచి 963 ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ధోని తన ఫామ్‌హౌస్‌లో సహజ వ్యవసాయం కోసం ట్రాక్టర్ కొన్నట్లు కూడా సమాచారం. దీనికి సంబంధించి వైరల్ అయిన ఒక వీడియోలో, ధోని స్వరాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడటం కనిపించింది. ఈ వీడియోలో ధోని డ్రైవ్ చేయడం మీరు చూడవచ్చు.

మహేంద్ర సింగ్ ధోని, ఖరీదైన స్వరాజ్ ట్రాక్టర్ కొన్నాడు. ఈ ట్రాక్టర్ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మోడల్ ట్రాక్టర్. ఈ ట్రాక్టర్ 963 ఎఫ్ఇ మోడల్లో 12 స్పీడ్ ఫార్వర్డ్, 2 స్పీడ్ రివర్స్ గేర్ కలిగి ఉంటుంది.
MOST READ:అందుబాటులోకి రానున్న టెస్లా స్మాల్ షార్ట్స్ ; చూసారా ?

ట్రాక్టర్ 4x4 సిస్టం తో అందించబడుతుంది. ఈ సిస్టం కారణంగా వ్యవసాయ భూమిపై దున్నుతున్నప్పుడు మట్టి ట్రాక్టర్లో చిక్కుకోదు. స్వరాజ్ 963 ఎఫ్ఇ ట్రాక్టర్లో 3.5 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ ఉంది.
ఈ ఇంజన్ 62 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. విమల్ అనే యూట్యూబ్ ఛానల్, ధోని వ్యవసాయ భూములను దున్నుతున్న వీడియోను మరియు కొత్త ట్రాక్టర్‌ను అప్లోడ్ చేసింది. మహేంద్ర సింగ్ ధోని చెన్నై, రాంచీలతో సహా భారతదేశంలోని వివిధ నగరాల రోడ్లపై పలు ఖరీదైన బైక్‌లపై తిరిగిన వీడియోలు ఎక్కువగా వైరల్ అయ్యాయి.
MOST READ:పొగమంచులో డ్రైవింగ్ చేయడానికి కొత్త టెక్నాలజీ, ఏంటో తెలుసా ?

మహేంద్ర సింగ్ ధోని ట్రాక్టర్ దున్నుతున్న వీడియో వైరల్ కావడం ఇదే మొదటిసారి. క్రికెట్లో కొత్త రికార్డులు సృష్టించిన ధోని వ్యవసాయం మీద ఉన్న అభిరుచి కారణంగా ధోని ట్రాక్టర్ వంటి వాటిని కొనుగోలు చేస్తుంటాడు.