అగ్ని మిస్సైల్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు...

By Anil

మన దేశపు అగ్ని మిస్సైల్ కు అత్యంత బరువున్న అణ్వాయుదాలను మోసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే యునైట్ స్టేట్స్ దీనిని నాశనం చేయాలని ఎన్నో పన్నాగాలు పన్నింది. మన మాజి రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలామ్ గారు తన రాసుకున్న పుస్తకంలోని చివరి మాటల్లో ఇలా అగ్ని మిస్సైల్ ఎదుర్కొన్న ఒడిదుడుకులు గురించి వివరించాడు.

అయితే అబ్దుల్ కలామ్ గారి అసాధారణ ధైర్యం మరియు స్పష్టమైన వ్యక్తిత్వంతో యునైడ్ స్టేట్స్ యొక్క దౌత్య ప్రయత్నాలను తిప్పికొట్టాడు. అగ్ని క్షిపణి విజయవంతమైన తరువాత అణు ప్రయోగాలు జరిపే జాబితాలో భారత్ స్థానం సంపాదించుకుంది. దీని వలన భారతీయ సైనిక బలం కూడా కొంచం పెరిగిందని చెప్పవచ్చు.

అగ్ని క్షిపణి గురించి మరిన్ని ఆశక్తికరమైన విశేషాలను క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి...

అగ్ని మిస్సైల్ పితామహుడు

అగ్ని మిస్సైల్ పితామహుడు

అగ్ని మిస్సైల్ క్షిపణి రూపకర్త మన మాజి రాష్ట్రతి అబ్దుల్ కలామ్ గారు. ఈ మొదలు పెట్టిన అగ్ని క్షిపణి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పేరుగాంచినది. ఎందుకంటే ఆ తరువాత అగ్ని క్షిపణుల పరంపర కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు అగ్ని-6 మిస్సైల్ రూపుదిద్దుకుంటోంది. అగ్ని యొక్క అన్ని క్షిపణుల గురించి పొందుపరిచాము.

కుట్ర ప్రపంచం చేత అభినందనలు.

కుట్ర ప్రపంచం చేత అభినందనలు.

అగ్ని క్షిపణి చివరిసారిగా మే 22, 1989 న పరీక్షించబడినది. అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ స్వయంగా కేబినేట్ నుండి దీని గురించి ఆరా తీశాడు. యునైటెడ్ స్టేట్స్ కోరిక మేరకు ఈ అగ్ని పరీక్షలను నిలిపివేయాలని రాజీవ్ గాంధీ కోరగా, కలామ్ చాకచక్యంగా దానికి సమాదానం ఇస్తూ తన ప్రయోగాలను కొనసాగించినట్లు కలాం తన పుస్తకంలో పేర్కొన్నాడు.

ప్రారంభపు అగ్ని క్షిపణి

ప్రారంభపు అగ్ని క్షిపణి

అగ్ని క్షిపణి ప్రారంభించిన తరువాత లక్ష్యం దిశగా దూసుకు పోయింది. అయితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఈ ప్రయోగంతో భారతదేశం అణు క్షిపణుల ప్రభావం గల దేశాల జాబితాలో చేరిపోయింది.

అగ్ని మిస్సైల్ -1

అగ్ని మిస్సైల్ -1

అగ్ని-1 మిస్సైల్ విజయవంతంగా పరీక్షించిన అనంతరం అగ్ని క్షిపణి యొక్క ప్రాముఖ్యత వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత వెనువెంటనే మిలిటరీ బడ్జెలో దీనికి నిధులు కేటాయించడం. తరువాత దీనిని ప్రత్యేకంగా అమలు పరచడం జరిగింది.

అగ్ని-2

అగ్ని-2

రెండవ అగ్ని మిస్సైల్ పరిధి కొంచెం తక్కువే. దీని పరిధి 2,000 నుండి 3,000 కిలోమీటర్లు వరకు ఉంది. మరియు ఇది దాదాపుగా 1,000 కిలోల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్ళగలదు. అయితే ఇంకా ఇప్పటి వరకు పని చేస్తూనే ఉంది.

అగ్ని-3

అగ్ని-3

ఇది మధ్య రకపు రేంజ్ గల మిస్సైల్. ఇది దాదాపుగా 3,500 నుండి 5,000 కిలో మీటర్లు దూరంలో ఉన్న లక్ష్యాలను చేరుకోగలదు. అయితే పొరుగు దేశాలకు ధీటుగా ఇది దాడులను ఎదుర్కొని మరి నాశనం చేయగలదు.

అగ్ని-4

అగ్ని-4

ఇది కూడా మద్య రకపు రేంజ్ గల మిస్సైల్. మరియు ఇది 3,000 నుండి 4,000 వరకు గల లక్ష్యాన్ని చేరుకోలగదు. ఇది 20 మీటర్ల పొడవు కలిగి ఉండి దాదాపుగా 17 టన్నుల బరువును తీసుకెళ్లగలదు మరియు ఇది 3000 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా పని చేస్తుంది.

అగ్ని-5

అగ్ని-5

ఇది ఖండాంతరాలను దాటి మరి తన లక్ష్యాలను చేరుకుంటుంది. చైనా గుండెల్లో ఇది గుబులు పుట్టించింది. మరియు ఇది 5,000 నుండి 8,000 వరకు ఉన్న లక్ష్యాన్ని చేరుకోగలదు. దీనిని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సురక్షితంగా తరలించవచ్చు. దీనిని సెప్టెంబర్ 15, 2013న విజయవంతంగా పరీక్షించారు. ఈ అగ్ని-5 క్షిపణి తయారు చేయడానికి దాదాపుగా 2,500 కోట్లు ఖర్చు చేశారు.

అగ్ని-6

అగ్ని-6

అగ్ని కుటుంబం లాగా ఒక్కొక్కటి కొత్త కొత్త పరిడజ్ఞానాన్ని జోడించుకుంటూ వస్తున్నాయి. ఈ అగ్ని-6 క్షిపణి 8,000 నుండి 10,000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని చేరుకోగలదు. మిరియు దీనినికి అందించిన లక్ష్యాలను నాశనం చేయగలదు. ఇది భుమి మీద నుండి మాత్రమే కాకుండా జలాంతర్గామి నుండి కూడా ప్రయోగించవచ్చు.

దేశం యొక్క సామర్థ్యం

దేశం యొక్క సామర్థ్యం

రష్యా, చైనా, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఉపయోగిస్తున్న అతి ప్రమాదకరమైన ఖండాతర బాలిస్టిక్ క్షిపణుల కు పోటీగా నిలవరలిగే సామర్థ్యం భారత దేశానికి ఉండటం మనందరికి ఎంతో గర్వకారణం.

అమెరికా కుట్రల మీద దాడి చేయగలదా ?

అమెరికా కుట్రల మీద దాడి చేయగలదా ?

అబ్దుల్ కలాం విద్యార్థులతో ఉన్నప్పుడు, అందులో ఒక విద్యార్థి కలామ్‌తో మన అగ్ని మిస్సైల్ అమెరికాను నాశనం చేయగలదా అని ప్రశ్నించాడు. అయితే కలామ్ జోక్యం చేసుకుని ప్రస్తుతానికి మనకు ఎవరూ శత్రువులు లేరు. అయితే ప్రపంచం మొత్తం ఏకమై నాలుగు దిక్కుల నుండి మనల్ని నాశనం చేయడానికి వచ్చినా వారిని నిలువరించే శక్తి మన దేశానికి ఉందని వివరించాడు. అతను కలగన్న అగ్ని-6 ప్రస్తుతం తయారి దశలో ఉంది.

మన దేశం గర్వించ దగ్గ విశేషాలు....

మన దేశం గర్వించ దగ్గ విశేషాలు....

Most Read Articles

English summary
Interesting Things About Agni Missiles
Story first published: Saturday, November 7, 2015, 17:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X