Just In
- 10 min ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 21 min ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
- 28 min ago
అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య; 77,954 కార్లు రీకాల్!
- 1 hr ago
రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు
Don't Miss
- Lifestyle
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
- News
తిరుపతికి భారీగా నకిలీ ఓటర్లు-పట్టుకున్న టీడీపీ, బీజేపీ నేతలు-ఈసీ వైఫల్యంపై
- Movies
మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన అగ్ర దర్శకుడు.. మరో సూపర్ ప్లాన్ వేసిన మెగా టీమ్
- Sports
IPL 2021: టఫ్ ఫైట్: ఎదురుగా ఉన్నది ఏనుగు..సన్‌రైజర్స్ పరిస్థితేంటీ? ప్రిడిక్షన్స్ ఇవీ
- Finance
LIC ఉద్యోగులకు బంపర్ బొనాంజా: 16 వేతన పెంపు, పని దినాలు 5 రోజులే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ట్రాఫిక్ ఫైన్ అడిగితే మంగళ సూత్రం ఇచ్చిన మహిళ.. ఇది ఎక్కడో కాదు, మన బెంగళూరులోనే
భారతదేశంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో భాగంగా రోడ్డుప్రమాదాలను తగ్గించడానికి దేశం మొత్తం కఠినమైన ట్రాఫిక్ నియమాలు అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు విరుచుకుపడుతున్నారు.

వాహనాలలో ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ కలిగి ఉండాలి. అప్పుడే ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ రూల్స్ అన్నింటిని వాహనదారులు పక్కనపెడుతున్నారు. ఈ కారణంగా పోలీసులు వీరికి భారీ జరిమానాలు విధిస్తున్నారు.

ఇటీవల కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో బైక్ పై వెళ్తున్న ఒక జంట హెల్మెట్ ధరించకపోవడంతో వారికి ట్రాఫిక్ పోలీస్ 500 జరిమానా విధించాడు. ట్రాఫిక్ పోలీస్ విధించిన జరిమానా చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో మహిళ తన మెడలోని మంగళసూత్రం తీసి ఇచ్చింది.

నివేదికల ప్రకారం కర్ణాటకలోని బెల్గావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హుక్కేరి పట్టణానికి చెందిన 30 సంవత్సరాల భారతి గత వారం తన భర్తతో కలిసి మోటార్ సైకిల్‌పై మార్కెట్‌కు వెళ్లారు. వారి వద్ద కేవలం 1800 రూపాయలు ఉండగా, అందులో 1700 రూపాయలకు ఒక మంచం కొన్నారు. మిగిలిన 100 రూపాయలతో టిఫిన్ చేశారు.

మార్కెట్ నుంచి తిరిగి మోటార్ సైకిల్‌పై ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో ట్రాఫిక్ పోలీస్ ఆపి, వారికి హెల్మెట్ లేకపోవడం వల్ల 500 రూపాయలు ఫైన్ వేసాడు. అయితే తమ వద్ద డబ్బులు లేవని, ఉన్న డబ్బు మొత్తం ఖర్చయిపోయిందని ఆ దంపతులు ట్రాఫిక్ పోలీసుకి చెప్పారు. కానీ ఆ పోలీస్ వీరి మాటలు పట్టించుకోలేదు.

చివరికి వారు వాదించి, వాదించి విసిగిపోయి ఆమె తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసి పోలీస్ కి ఇచ్చి, ఈ జరిమానా కింద దీన్ని తీసుకోవాలని చెప్పింది. ఆ దంపతులకు మరియు ట్రాఫిక్ పోలీసులకు మధ్య ఈ గొడవ సుమారు రెండు గంటలు కొనసాగింది. ఈ కారణంగా అక్కడ జనం నెమ్మదిగా గుమిగూడారు. ఈ వాగ్వాదం పెద్దది కావడంతో ఒక సీనియర్ అధికారి అక్కడకు వచ్చి కల్పించుకున్నారు. ఆ దంపతులను విడిచి పెట్టాలని ఆ ట్రాఫిక్ పోలీస్‌కు చెప్పడంతో ఈ వివాదం ముగిసింది.

సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలను నివారించడానికి ఇంత కఠినంగా ప్రవర్తిస్తారు. కానీ ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఆ వాహనదారులను వదిలివేయడం మంచిది. కానీ వాహనదారులు కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. ప్రమాదాలు నివారించడానికి వాహనదారుడు కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.