ప్రమాద బాధితులను కాపాడి మానవత్వాన్ని చాటుకున్న ఒడిస్సా ఎమ్మెల్యే!

ఇటీవల కాలంలో మనుసులు బాగా మారిపోయారు. ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. పక్కవాళ్ళు ఆపదలో ఉండే కాపాడాలి అనే కనీస జ్ఞానం కోల్పోయారు. రోజు రోజుకి అభివృద్ధి పెరుగుతూనే ఉంది. కానీ మానవత్వం పూర్తిగా నశిస్తోంది. కానీ ఆపదలో వున్న వారికి స్వయంగా ఒక ఎమ్మెల్యే సహాయం చేసిన ఉదంతం గురించి తెలుసుకుందాం!

ప్రమాద బాధితులను కాపాడి మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యేకి దేశవ్యాప్తంగా ప్రశంసలవెల్లువ, ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?

ఈ విధంగా ప్రమాదాలు జరిగినప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు, కానీ స్పందించరు. సహాయం చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే ఒకవేళ సాహాయం చేస్తే అనుకోని కారణాల వల్ల చట్టబద్దమైన నేరాలలో చిక్కుకుంటామేమో అని కొంత బెరుకు. ఈ సమస్యలన్నీ తట్టుకుని సహాయం చేయడానికి ముందుకువచ్చే వారు చాలా తక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ ఒక రోడ్డు ప్రమాదంలో ప్రమాద బాధితులను ఆసుపత్రిలో చేర్పించడానికి స్వయంగా ఒక రాజకీయ నాయకుడు తన వాహనాన్ని ఆపి సహాయంచేశారు.

ప్రమాద బాధితులను కాపాడి మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యేకి దేశవ్యాప్తంగా ప్రశంసలవెల్లువ, ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?

ఈ సంఘటన ఒడిశాలోని మల్కన్‌గిరిలోని నాయక్‌గుడ సమీపంలో జరిగింది. చిత్రకొండ ఎమ్మెల్యే, పూర్ణ చంద్ర బాకా జిల్లా గుండా వెళుతుండగా, ముగ్గురు ప్రమాదవశాత్తు బాధితులు బైక్ మీద ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు. బాకా వెంటనే కాన్వాయ్‌ను ఆపమని ప్రమాద బాధితులకు సహాయం చేయమని కోరాడు. అతను వాహనం నుండి దిగి బాధితులకు సహాయం చేయడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఆ ఎమ్మెల్యే ముగ్గురు ప్రమాద బాధితులకు చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాధితులు కోలుకోవడంపై మరింత సమాచారాన్ని డాక్టర్స్ ని అడిగి తెలుసుకున్నారు. ప్రమధ బారిన పడిన ముగ్గురు క్షేమంగా ఉన్నారని డాక్టర్స్ చెప్పారు.

ప్రమాద బాధితులను కాపాడి మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యేకి దేశవ్యాప్తంగా ప్రశంసలవెల్లువ, ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?

ప్రమాదం జరిగిన బాధితులలో ఇద్దరు స్త్రీలు,ఒక వ్యక్తి ఉన్నారు. వీరు ముగ్గురు వాహనంలో ప్రయాణిస్తూ అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో మనకు స్పష్టంగా తెలియదు. కానీ రోడ్డు పక్కన ఈ ముగ్గురు పడి ఉండటాన్ని ఎమ్మెల్యే గుర్తించారు. ప్రయాణ సమయంలో ముగ్గురు వాహనంపై ప్రయాణించడమే కాకుండా, హెల్మెట్లు ధరించలేదని తెలుస్తుంది. హెల్మెట్ ధరించకపోవడం చట్టరీత్యా నేరం, ఈ విధంగా ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్త్రమాదం వల్ల ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని మనకు వీడియో ద్వారా తెలుస్తుంది.

ప్రమాద బాధితులను కాపాడి మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యేకి దేశవ్యాప్తంగా ప్రశంసలవెల్లువ, ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?

హెల్మెట్ ధరించకపోవడం, ఒకే వాహనంలో ముగ్గురు ప్రయాణించడం అనేది మోటార్ వెహికల చట్టం ప్రకారం నేరం. చట్టరీత్య అమలు చేసిన ప్రయాణికులు పాటించినట్లయితే కొంతవరకు ప్రమాదాల భారీ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఏదేమైనా ఎమ్మెల్యే చేసిన సహాయం ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. అతన్నీ దేశవ్యాప్తంగా చాలా మంది ప్రశంసించారు.

ప్రమాద బాధితులను కాపాడి మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యేకి దేశవ్యాప్తంగా ప్రశంసలవెల్లువ, ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?

ఎవరైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బాధితుడికి సహాయం చేయదానికి ప్రాధాన్యతనివ్వాలి. ప్రమాద బాధితుల ప్రథమ చికిత్స మరియు ప్రథమ చికిత్స చాలా కీలకం కాబట్టి, ప్రతి వాహనదారుడు ప్రమాదాల గురించి జాగ్రత్తగా చూసుకోవాలి మరియు బాధితులు సకాలంలో ఆసుపత్రికి చేరుకునేలా చూడాలి.

ప్రమాద బాధితులను కాపాడి మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యేకి దేశవ్యాప్తంగా ప్రశంసలవెల్లువ, ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?

ఇప్పుడున్న కాలంకంటే పాతకాలంలో ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి చాలామంది వచ్చేవారు. చాలా సులభంగా కూడా ఉండేది. ఎందుకంటే సహాయం చేసే బాధితులకు ఎలాంటి చట్ట బద్దమైన చర్యలు లేవు కాబట్టి సహాయం చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.

Read More:డీలర్‌షిప్‌లను చేరుకుంటున్న అప్రిలియా ఎస్ఆర్ 160, త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు!

ఈ కాలంలో కూడా ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి అందరూ ముందుకు రావాలి. సహాయం చేసిన వారికి ప్రభుత్వాలు పారితోషికాలు, బహుమతులు ఇచ్చి మరింత సహాయం చేయడానికి ప్రోత్సహించాలి. అత్యవసర సమయంలో ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సరైన నిత్యావసరాలు ఉన్నాయి. అత్యవసర అంబులెన్సు 108 సేవలు భారతదేశం మొత్తం వ్యాపించి ఉన్నాయి. కాబట్టి ప్రామాదాలలో ఉన్నవారికి మానవత్వంతో సహాయం చేయాలనే సంకల్పాన్ని అందరూ కలిగి ఉండాలి.

Image Courtesy: OTV

Most Read Articles

English summary
MLA stops convoy to personally help crash victims: Wins praise [Video]-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X