బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ 'బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 ఎక్స్‌డ్రైవ్ 30డి' రివ్యూ.. పూర్తి వివరాలు

ప్రముఖ లగ్జరీ కార్ తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ తన ఎక్స్4 ఎస్‌యూవీని చాలా రోజుల క్రితమే భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ కూపే లాంటి డిజైన్ కలిగి ఉంది, అంతే కాకుండా ఇందులో ఫ్లోయింగ్ లైన్స్, క్రోమ్ కిడ్నీ గ్రిల్ వంటి వాటితో చాలా ఆకర్షణీయంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా బిఎండబ్ల్యు యొక్క ఎక్స్6 మరియు ఎక్స్4 లు దాదాపు హాఫ్ (అర) మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి చూస్తే వీటిని మార్కెట్లో ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నారో అర్థమవుతుంది.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

మేము ఇటీవల కొన్ని రోజులపాటు బిఎండబ్ల్యు యొక్క ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్4 ని, నగరంలో మరియు హైవేలో డ్రైవ్ చేసాము. ఇది నిజంగా చాలా అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించింది. ఈ ఎక్స్4 మన దేశం ఉన్న విభిన్న రహదారులపై డ్రైవ్ చేయడానికి ఎలా ఉంటుంది, మరియు ఇతర విషయాలను గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూలో తెలుసుకుందాం.. రండి.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

ఎక్స్టీరియర్ మరియు డిజైన్:

బిఎండబ్ల్యు యొక్క ఎక్స్ 4 ను చూడగానే, ఎక్స్6 గుర్తుకొస్తుంది. ఎందుకంటే చూడటానికి రెండూ కూడా చాలా దగ్గర పోలికలను కలిగి ఉంటాయి. అయితే ఎక్స్6 పరిమాణంలో కొంత చిన్నదిగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ యొక్క ముందు భాగంలో, ఎల్‌ఇడి అడాప్టివ్ హెడ్‌లైట్ యూనిట్లు లభిస్తాయి, ఇవి చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. ఇందులో ఇతర మోడళ్లలో కనిపించే ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు కూడా ఉంటాయి. ఎస్‌యూవీకి చాలా ప్రకాశవంతంగా ఉండే ఫాగ్ లైట్ యూనిట్ కూడా లభిస్తుంది.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

వాహనం యొక్క గ్రిల్ భారీగా ఉంది, ఇందులో యాక్టివ్ వెంట్స్ ఉన్నాయి, ఇవి ఎక్కువ గాలి అవసరమైనప్పుడు ఓపెన్ అవుతాయి. అవి మూసివేయబడిన తర్వాత మంచి ఏరోడైనమిక్ ని అందిస్తాయి. ఇది చాలా మంచి ఫీచర్. ఈ ఎస్‌యూవీ యొక్క ముందు భాగంలో ఉన్న బంపర్ చాలా దూకుడుగా ఉంటుంది. అది సైడ్ వెంట్స్ కలిగి ఉండటం వల్ల చాలా మరింత అద్భుతంగా కనిపిస్తుంది.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

ఇక ఈ బీఎండబ్ల్యూ ఎక్స్ 4 ఎస్‌యూవీ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ మీ దృష్టిని ఆకర్షించే మొదటి విషయం ఫెండర్‌లోని చిన్న M బ్యాడ్జ్. ఇందులో ఉన్న 19 ఇంచెస్ మల్టీస్పోక్ అల్లాయ్ వీల్స్ M డివిజన్ నుండి వచ్చినవి, ఇవి సింగిల్ టోన్ కలర్‌లో పూర్తవుతాయి.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

ఈ ఎస్‌యూవీ చుట్టూ సిల్వర్ క్లాడింగ్ కూడా ఉంటుంది. దీని వల్ల ఇది మరింత దూకుడుగా కనిపిస్తుంది. దీని సైడ్ ప్రొఫైల్ లో క్రోమ్ లేదు, దీనికి బదులుగా, విండో చుట్టూ గార్నిషింగ్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిషింగ్ ఉంటుంది. ఈ కారు యొక్క పైకప్పుపై పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ మరియు షార్క్-ఫిన్ యాంటెన్నా కూడా పొందుతారు.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

ఈ ఎస్‌యూవీ వెనుక వైపు ఒక జత సొగసైన ఎల్‌ఈడీ టైల్ లైట్ యూనిట్ ఉంటుంది. వెనుక నుండి, ఎక్స్‌డ్రైవ్ బ్యాడ్జ్ మరియు ట్విన్ ఎగ్జాస్ట్ సెటప్ కారణంగా ఇది పవర్‌హౌస్ అని మీరు ఊహించగలరు. ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఉంటుంది. దీని వల్ల గట్టి ప్రదేశాలలో కూడా సులభంగా పార్కింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కెమెరా క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

బూట్ ఓపెన్ చేయడానికి ప్రత్యేకమైన బటన్ లేదు, దీనికి బదులుగా, వెనుక ఉన్న BMW లోగోను ప్రెష్ చేయాలి. అలా చేస్తే X4 ఎలక్ట్రానిక్ బూట్ ఆటోమాటిక్ గా ఓపెన్ అవుతుంది. ఇందులో 525 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఇంకా ఎక్కువ స్థలం అవసరమైతే, రెండవ వరుసలో 60:40 స్ప్లిట్‌ పొందుతారు, అది ఎక్కువ లగేజ్ ఉంచడానికి సహాయపడుతుంది.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

ఇంటీరియర్ మరియు ఫీచర్స్:

బిఎండబ్ల్యు ఎక్స్ 4 యొక్క క్యాబిన్ డ్యూయల్-టోన్ లో పూర్తయింది. డోర్ ప్యానెల్స్‌ మరియు డాష్‌బోర్డ్‌ సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ కలిగి ఉంటాయి. డాష్ బోర్డ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేలను కలిగి ఉన్న 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా సెంటర్ స్టేజ్ తీసుకోబడింది. టచ్ చాలా సెన్సిటీవ్ గా ఉంటుంది, కావున రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో కంట్రోల్ బటన్లు కూడా ఉంటాయి, దీని ద్వారా వాల్యూమ్‌ను పెంచవచ్చు, తగ్గించవచ్చు మరియు సాంగ్స్ ప్లే చేయవచ్చు.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇప్పుడు పూర్తిగా డిజిటల్ మరియు 12.3 ఇంచెస్ స్క్రీన్ కలిగి ఉంటుంది. కారు యొక్క మోడ్‌లను మారిస్తే స్క్రీన్‌పై డిస్ప్లేలు మారుతాయి. డ్రైవర్ అవసరాలకు అనుగుణంగా క్లస్టర్‌ను కూడా కాన్ఫిగర్ చేయవచ్చు. అయితే ఇందులో హెడ్స్-అప్ డిస్ప్లే లభించదు.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

స్టీరింగ్ వీల్ కూడా M బ్యాడ్జిని పొందుతుంది. ఇది లెదర్ తో చుట్టబడి ఉండటం వల్ల అద్భుతమైన పట్టు ఉంది. ఈ ఎస్‌యూవీకి ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ లభించదు, కానీ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ చక్కగా ఉంచబడతాయి, కావున రోడ్డుపై దృష్టి సారించేటప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా టోగుల్ చేయవచ్చు.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

ఈ ఎస్‌యూవీ యొక్క సీట్ల విషయానికి వస్తే, లెదర్ తో చుట్టబడిన ఈ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. వాటిని ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయవచ్చు, కాని డ్రైవర్ వైపు మాత్రమే సీట్ మెమరీ ఫంక్షన్‌ను పొందుతుంది. ఇందులో సైడ్ బోల్స్టర్స్ కోసం అడ్జస్టబుల్ బటన్‌ను కూడా పొందుతారు.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

వెనుక సీట్లు, మంచి అండర్ థాయ్ సపోర్ట్ అందిస్తూ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇక్కడ రెండు కప్ హోల్డర్లతో సెంటర్ ఆర్మ్‌రెస్ట్ కూడా పొందుతారు. వెనుక భాగంలో క్లైమేట్ కంట్రోల్ మరియు రెండు సి-టైప్ ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. అయితే వెనుక భాగంలో ముగ్గురు ప్రయాణీకులకు సరిపోయే స్థలం ఉంది, అయితే మధ్యలో కూర్చున్న వ్యక్తికి ట్రాన్స్మిషన్ టన్నెల్ కొంత ఇబ్బందిగా ఉంటుంది.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

ఇంజిన్ & హ్యాండ్లింగ్:

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 4 ఎస్‌యూవీకి 3-లీటర్, 6 సిలిండర్, డీజిల్ ఇంజన్ లభిస్తుంది. మేము బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌ 4 ఎక్స్‌డ్రైవ్ 30 డి వేరియంట్ డ్రైవ్ చేసాము. ఇది 2,000 - 2,500 ఆర్‌పిఎమ్ వద్ద 261 బిహెచ్‌పి పవర్ మరియు గరిష్టంగా 620 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ కారు కేవలం 6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ వేగవంతం అవుతుంది.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

ఇందులో ఎకో ప్రో, కంఫర్ట్, స్పోర్ట్ మరియు అడాప్టివ్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో ప్రో మోడ్‌లో, స్టీరింగ్ తేలికగా మారుతుంది మరియు త్రాటల్ రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంటుంది, కాని ఇంధనాన్ని ఆదా చేస్తుంది. కంఫర్ట్ మోడ్‌లో, స్టీరింగ్ మరియు త్రాటల్ రెస్పాన్స్ కొద్దిగా మెరుగుపడుతుంది. వాహనదారులకు ఈ మోడ్ లో డ్రైవింగ్ చాలా అనుకూలంగా ఉంటుంది. స్పోర్ట్ మోడ్‌లో, త్రాటల్ రెస్పాన్స్ చాలా షార్ప్ గా ఉంటుంది. ఈ మోడ్ లో స్టీరింగ్ గట్టిపడుతుంది, కావున కారు యొక్క గరిష్ట సామర్థ్యాన్ని ఉపయోగించవచ్చు.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 4 లో సస్పెన్షన్ సెటప్ కొంచెం మృదువుగా ఉంటుంది. దీనికి కారణం కంపెనీ వాహనదారునికి సౌకర్యవంతమైన రైడ్‌ను అందించాలనుకుంది. ఇది ఎటువంటి కఠినమైన రహదారిలో అయినా డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో NVH మరియు ఇన్సులేషన్ లెవెల్ కూడా అద్భుతమైనది కావున బయట శబ్దం లోపలి రానీయకుండా చేస్తుంది. కారులో ఆల్-వీల్-డ్రైవ్ సెటప్ ఉన్నందున, మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

ఈ కార్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, అటెన్టివ్‌నెస్ అసిస్టెన్స్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (సిబిసి) తో సహా డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డిఎస్‌సి), ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్ మరియు క్రాష్ సెన్సార్లు మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు వున్నాయి.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 4 యొక్క మైలేజ్ విషయానికొస్తే, ఇది నగరంలో, నగర ట్రాఫిక్ పరిస్థితిని బట్టి ఒక లీటరుకు 7 నుండి 10 కిమీ మైలేజ్ అందించింది. హైవేపై ఒక లీటరుకు 11 నుండి 14 కి.మీ మైలేజ్ అందించింది. ఇది వాహనదారుడు వెళ్లే వేగాన్ని బట్టి ఉంటుంది.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

ఈ కారు ఆటోమేటిక్ స్టార్ట్ / స్టాప్ బటన్‌ను కూడా పొందుతుంది. కావున ఇది కారు ఆగిపోయినప్పుడు ఇంజిన్‌ను నిలిపివేస్తుంది మరియు యాక్సిలరేటర్‌ను తాకినప్పుడు తిరిగి ప్రారంభమవుతుంది. దీని వల్ల 15 నుండి 20 శాతం ఇంధనం ఆదా అవుతుందని కంపెనీ తెలిపింది.

బెస్ట్ ప్రాక్టికల్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌ 4 ఎక్స్‌డ్రైవ్ 30 డి ధర దేశీయ మార్కెట్లో రూ. 68.88 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). ఈ కారు సొగసైన మరియు లగ్జరీ ఫీచర్స్ కల్గి ఉంటుంది. ఇందులో ఉన్న ఇంటీరియర్స్ మరియు ఎక్స్టీరియర్ చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా మంచి డ్రైవింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. భారతీయ మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 4 కి ప్రస్తుతం ప్రత్యక్ష పోటీదారుడు లేడు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌ 4 లో హెడ్స్-అప్-డిస్ప్లే, కొంచెం సౌకర్యవంతమైన ముందు సీట్లు మరియు మల్టిపుల్ కలర్ అపోల్స్ట్రే వుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. మిగిలిన అన్ని ఫీచర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి.

Most Read Articles

English summary
BMW X4 xDrive30d Road Test Review. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X