2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

By Ravi

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'మహీంద్రా స్కార్పియో'లో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా అండ్ మహీంద్రా ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మహీంద్రా స్కార్పియోను ఆవిష్కరించనున్నట్లు సమాచారం.

మహీంద్రా ఇటీవల వెల్లడించినట్లుగా, తాము పరిచయం చేయనున్న 4 కొత్త ప్లాట్‌ఫామ్‌లలో ఓ ప్లాట్‌ఫామ్‌పై ఈ ఫేస్‌లిఫ్టెడ్ మహీంద్రా స్కార్పియోను తయారు చేయనున్నారు. ఇది ఇప్పటివరకు ఏ వాహనంలో పరిచయం చేయని ఉత్తమ ప్లాట్‌ఫామ్‌ అని సమాచారం. ఇప్పటికే అప్‌డేటెట్ మహీంద్రా స్కార్పియోను భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తున్నారు. మరింత స్పోర్టీయర్ ఫీల్‌ను ఇచ్చేలా కొత్త 2014 స్కార్పియో ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

Mahindra Scorpio

కొత్త హెడ్‌ల్యాంప్స్, రివైజ్డ్ బంపర్స్, రీస్టయిల్డ్ ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ టెయిల్ ల్యాంప్స్, కొత్త రియర్ బంపర్ అండ్ టెయిల్ గేట్ వంటి మార్పులను మనం 2014 స్కార్పియోలో చూడొచ్చు. క్యాబిన్ లోపల కూడా రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, అప్‌మార్కెట్ ఫీల్‌నిచ్చే ఇంటీరియర్స్, కొత్త సెంటర్ కన్సోల్, కొత్త స్టీరింగ్ వీల్ వంటి మార్పులు ఇందులో ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా పాపులర్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500 నుంచి స్ఫూర్తి పొంది దీని ఇంటీరియర్స్‌ను డిజైన్ చేసే అవకాశం ఉంది. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ప్రస్తుతం కంపెనీ ఉపయోగిస్తున్న పవర్‌ఫుల్ 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్‌నే ఇందులోను అమర్చనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
If reports are to be believed, India's largest utility vehicle company Mahindra and Mahindra will unveil the facelifted Scorpio SUV at the 2014 Indian Auto Expo, which is said to be the best platform to introduce any vehicle.
Story first published: Monday, December 30, 2013, 15:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X