అమెరికాలో టాటా నుంచి జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంట్

By Ravi

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్), యూకే మార్కెట్లోనే కాకుండా యూఎస్ మార్కెట్లో కూడా తన సత్తాం ఏంటో చూపించాలనుకుంటోంది. ఇందులో భాగంగానే, యూఎస్‌లో ఓ కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనే ప్రతిష్టాత్మక ప్రణాళికపై పనిచేస్తున్నట్లు సమాచారం.

ప్రపంచపు రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన యూఎస్‌లో ప్లాంట్‌ను నిర్మించేందుకు గాను పలు దక్షిణాధి అమెరికా రాష్ట్రాలు, ఉత్తర కాలిఫోర్నియాతో కలిపి పలు ఇతర రాష్ట్రాలతో జాగ్వార్ ల్యాండ్ రోవర్ చర్చలు జరుపుతున్నట్లు ది సండే టైమ్స్ ప్రచురించింది.


దాదాపు దివాలాతీసే స్థితిలో ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థను టాటా మోటార్స్ స్వాధీనం చేసుకొని, తమ పెట్టుబడులతో ఈ సంస్థను తిరిగి వృద్ధి బాటలోకి తీసుకువచ్చారు. దాదాపు 1.3 బిలియన్ పౌండ్లు వెచ్చించి, 2008లో జేఎల్ఆర్‌ను టాటా మోటార్స్ కొనుగోలు చేసింది.

జేఎల్ఆర్ నేడు చైనాలో ఓ ఫ్యాక్టరీని ప్రారంభించనుంది, ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 1,30,000. ఇదే నెలలోనే వోల్వెర్‌హాంప్టన్‌లో ఐ54 ఇంజన్ ప్లాంట్‌ను ప్రారంభించనుంది. బ్రెజిల్‌లో కూడా ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు జేఎల్ఆర్ ఓ ఒప్పందంపై సంతకం చేసింది.

JLR Plant

జాగ్వార్ ల్యాండ్ రోవర్ యూఎస్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయగలిగినట్లయితే, అక్కడి లగ్జరీ కార్ మేకర్లకు గట్టి పోటీనిచ్చేలా, సరసమైన ధరలకే జేఎల్ఆర్ తమ ఉత్పత్తులను అక్కడి మార్కెట్లో ఆఫర్ చేయగలిగే ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం, విదేశాల్లో తయారు చేసిన జేఎల్ఆర్ కార్లను అమెరికాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తుండటం వలన ఆయా కార్లపై అధిక దిగుమతి సుంకాలు పడుతున్నాయి. ఫలితంగా వాటి ధరలు కూడా అధికంగానే ఉంటున్నాయి.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ గడచిన సంవత్సరంలో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 4,25,000 వాహనాలను విక్రయిస్తే, అందులో 55,000 నార్త్ అమెరికాలోనే విక్రయించింది. అంటే, కంపెనీ మొత్తం అమ్మకాలలో దాదాపు 8 శాతం అమ్మకాలు అమెరికా మార్కెట్ నుంచే వస్తున్నాయన్నమాట. ఈ దశాబ్ధం ముగిసే నాటికి 1 మిలియన్ కార్ల అమ్మకాలను చేరుకోవాలనేది జేఎల్ఆర్ లక్ష్యం.

Most Read Articles

English summary
Tata Motors' owned Jaguar Land Rover (JLR) is working on an ambitious plan to set up a factory in the US, in a first for a British carmaker in the world's second-biggest automobile market.
Story first published: Tuesday, October 21, 2014, 10:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X