భారత్‌లో 10-సీటర్ వెహికల్ 'టొయోటా హైఏస్' విడుదల ఖరారు

By Ravi

టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా భారత్‌లో ఓ కొత్త కమ్యూటర్ వాహనాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. న్యూఢిల్లీలో జరుగుతున్న నాల్గవ ఎడిషన్ 'బస్ అండ్ స్పెషల్ వెహికల్ షో 2015'లో టొయోటా తమ 10-సీటర్ వెహికల్ ప్లాన్స్ గురించి వెల్లడి చేసింది.

'టొయోటా హైఏస్' (Toyota HiAce) పేరుతో వచ్చే ఏడాది ద్వితీయార్థంలో 10-సీటర్ కమ్యూటర్ వాహనాన్ని విడుదల చేస్తామని టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, తమ హైఏస్ వాహనాన్ని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న బస్ అండ్ స్పెషల్ వెహికల్ షో 2015'లో ప్రదర్శనకు ఉంచింది.

టొయోటా హైఏస్ వాహనానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

టొయోటా హైఏస్

టొయోటా హైఏస్ వాహనంలో 10 మంది ప్రయాణీకులు (డ్రైవరుతో కలిపి) ప్రయాణించవచ్చు. ఇందులో నాలుగు వరుసులలో సీట్లు ఉంటాయి.

టొయోటా హైఏస్

టొయోటా హైఏస్ వాహనాన్ని 140 దేశాలలో విక్రయిస్తున్నామని, ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించామని కంపెనీ పేర్కొంది.

టొయోటా హైఏస్

టొయోటా హైఏస్ 10-సీటర్ కమ్యూటర్ వాహనంలో కంపెనీ అత్యంత పాపులర్ అయిన డి-4డి ఇంజన్‌ను ఉపయోగించారు.

టొయోటా హైఏస్

ఇందులోని 2982సీసీ ఇంజన్ గరిష్టంగా 3400 ఆర్‌పిఎమ్ వద్ద 136 పిఎస్‌ల శక్తిని, 1200-2400 ఆర్‌పిఎమ్ వద్ద 300 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

టొయోటా హైఏస్

ఈ ఇంజన్ 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది. దీని సాయంతో దూర ప్రయాణాల్లో సైతం ఎలాంటి గేర్లు మార్చే చికాకు లేకుండా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

టొయోటా హైఏస్

టొయోటా హైఏస్ 5380 మి.మీ. పొడవును, 1880 మి.మీ. వెడల్పును, 2285 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌‌బేస్ 3110 మి.మీ.

టొయోటా హైఏస్

ఇంటీరియర్ ఫీచర్స్:

* వెనుక ప్యాసింజర్లకు సైతం ఎయిర్ కండిషనింగ్ వచ్చేలా ఏర్పాటు చేసిన రియర్ ఏసి వెంట్స్

* ప్రతి సీటుకు రిక్లైన్ సౌకర్యం

* వెనుక భాగంలో లగేజ్ కోసం కార్గో స్పేస్.

టొయోటా హైఏస్

కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్:

* ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్

* ఈజీ క్లోజర్ అండ్ పవర్ స్లైడ్ డోర్

* రియర్ వ్యూ కెమెరా

* ఇన్నర్ రియర్ వ్యూ మిర్రర్‌పై రివర్సింగ్ కెమెరా డిస్‌ప్లే

టొయోటా హైఏస్

సేఫ్టీ:

* డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్

* ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)

* ఇంజన్ ఇమ్మొబిలైజర్

టొయోటా హైఏస్

భారత్‌లో వినియోగదారుల అవసరాలను తాము నిరంతరాయంగా అధ్యయనం చేస్తున్నామని, వినియోగదారుల అవసరం మేరకే ప్రీమియం ఫీచర్లతో కూడిన ఈ టొయోటా హైఏస్‌ను ప్రదర్శిస్తున్నామని టికెఎమ్ డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) ఎన్ రాజా తెలిపారు.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motor today showcased commuter vehicle 'Hiace', which its plans to launch in the country in the second half of the year. The Hiace comes with a seating capacity for ten passengers, including driver, in a configuration of four rows.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X