అమరావతికి టయోటా ఎలక్ట్రిక్ బస్సులు: పరస్పర ఒప్పందం కుదుర్చుకున్న ఏపి-టయోటా

Written By:

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో విద్యుత్ వాహన రవాణాను అందించే దిశగా ఎలక్ట్రిక్ బస్సుల కోసం జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్స్‌తో పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
అమరావతికి టయోటా ఎలక్ట్రిక్ బస్సులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ రాజధాని నగరం అమరావతిలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ మరియు టయోటా కిర్లోస్కర్ మోటార్ డైరక్టర్ "అకితో తచిబనా" సమక్షంలో పరస్పర అవగాహన ఒప్పందం జరిగింది.

Recommended Video
[Telugu] Toyota Etios Safety Experiential Drive in Bengaluru - DriveSpark
అమరావతికి టయోటా ఎలక్ట్రిక్ బస్సులు

ఈ భాగస్వామ్యంలో టయోటా ప్రపంచ స్థాయి విద్యుత్ వాహనాలను అమరావతిలో పరిచయం చేయనుంది. మే మరియు డిసెంబర్ 2018 మధ్య కాలంలో టయోటా డెలివరీ ఇవ్వనున్న పది విద్యుత్ బస్సులను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు లోకేష్ వెల్లడించారు.

అమరావతికి టయోటా ఎలక్ట్రిక్ బస్సులు

పర్యావరణానుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ హబ్ ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఉంది. సమగ్రమైన ఎలక్ట్రిక్ వెహికల్ విధానాల ఏర్పాటు మరియు ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణానికి ఏపి కృషి చేస్తోందని లోకేష్ చెప్పుకొచ్చారు.

అమరావతికి టయోటా ఎలక్ట్రిక్ బస్సులు

ఏపి ఒప్పందంతో ఎమ్‌ఓయూ ముగిసిన అనంతరం, టయోటా కిర్లోస్కర్ మోటార్ డైరక్టర్ అకితో తచిబనా పత్రికా ప్రతినుధులతో మాట్లాడుతూ," ఆంధ్ర ప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విడుదల మరియు ఏపి ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరియు మద్దతుతో పాటు అనుకూల మరియు ప్రతికూల అంశాల గురించి అధ్యయనం చేయనున్నట్లు తెలిపాడు."

అమరావతికి టయోటా ఎలక్ట్రిక్ బస్సులు

కాలుష్య రహిత రవాణాకు శ్రీకారం చుట్టడానికి ఆంధ్ర ప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలు మరియు ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి ఏపి ప్రభుత్వ తీసుకుంటున్న చొరవను అభినందించాడు.

అమరావతికి టయోటా ఎలక్ట్రిక్ బస్సులు

ఈ ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార శాఖ విభాగపు ముఖ్య కార్యనిర్వహణ అధికారి తిరుమల రావు చామళ్ల గారు కూడా పాల్గొన్నారు. తిరుమల మరియు అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో పరిశుభ్రమైన రవాణా కోసం టయోటా ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు తిరుమల రావు తెలిపారు.

English summary
Read In Telugu: Andhra Pradesh State, Toyota sign MoU for feasibility study on e-vehicles
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark