హోండా సిటి లోని ఈ వేరియంట్‌కు భారీ డిమాండ్

Written By:

జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ సెడాన్ కారులో స్వల్ప మార్పులు చేర్పులు చేసి, నూతన ఫీచర్లను జోడించి 2017 సిటి సెడాన్‌ 2017 ఫిబ్రవరిలో విడుదల చేసింది. 2017 సిటి ప్రారంభ వేరియంట్ ధర రూ. 8.49 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా నిర్ణయించింది.

2017 హోండా సిటి సెడాన్

ఆటోకార్ ఇండియా తెలిపిన కథనం మేరకు 2017 సిటి సెడాన్ లోని టాప్ ఎండ్ వేరియంట్ జడ్ఎక్స్ కు డిమాండ్ భారీగా పెరుగుతోందని తెలిసింది.

2017 హోండా సిటి సెడాన్

దేశ వ్యాప్తంగా ఉన్న అనేక డీలర్‌షిప్‌ల వద్ద ఈ సిటి జడ్ఎక్స్ వేరియంట్ మీద వెయిటింగ్ పీరియడ్ సుమారుగా మూడు నెలలకు పైగా ఉన్నట్లు తెలిసింది.

2017 హోండా సిటి సెడాన్

2017 హోండా సిటి ధర రూ. 13.57 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. ఆన్ రోడ్ ధర అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ధర ఎక్కువ అయినప్పటికీ కస్టమర్ల వెనక్కిపోకుండా దీనినే కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపుతున్నారు.

2017 హోండా సిటి సెడాన్

2017 సిటి సెడాన్ లోని జడ్ఎక్స్ వేరియంట్లో ప్రధానంగా గుర్తించదగిన ఫీచర్లలో పూర్థి స్థాయి ఎల్ఇడి ప్యాకేజ్ గల ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ కలదు. ఫాగ్ లైట్లు, పగటి పూట వెలిగే లైట్లు మరియు ఎల్ఇడి టెయిల్ లైట్లు ఇందులో ఉన్నాయి.

2017 హోండా సిటి సెడాన్

2017 సిటి సెడాన్ లోని జడ్ఎక్స్ వేరియంట్లో రెయిన్ సెన్సింగ్ వైపర్లు, బూట్ లిడ్ స్పాయిలర్ మరియు పెద్ద పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

2017 హోండా సిటి సెడాన్

భద్రత పరంగా జడ్ఎక్స్ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగులు ఉండగా, ఇతర వేరియంట్లు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులను కలిగి ఉన్నాయి.

2017 హోండా సిటి సెడాన్

సిటి లోని జడ్ఎక్స్ కాకుండా తక్కువ మరియు మధ్య స్థాయి వేరియంట్ల మీద వివిధ డీలర్లను బట్టి వెయిటింగ్ పీరియడ్ మూడు నెలల మరియు అంతకన్నా తక్కువగా ఉంది.

2017 హోండా సిటి సెడాన్

మధ్య వేరియంట్ అయిన సిటి విఎక్స్ లో కూడా ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ సన్-రూఫ్, పెద్ద పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ వేరియంట్లకు ఎలాంటి కాలపరిమితి లేదు.

2017 హోండా సిటి సెడాన్

సాంకేతికంగా సరికొత్త 2017 సిటి సెడాన్ 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది.

2017 హోండా సిటి సెడాన్

ఇందులోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల ఇంజన్ గరిష్టంగా 117బిహెచ్‌పి పవర్ మరియు 145ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 హోండా సిటి సెడాన్

మరియు సరికొత్త 2017 సిటి సెడాన్ లోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ గరిష్టంగా 99బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ఉత్పత్తి చేయును.

2017 హోండా సిటి సెడాన్

సిటి సెడాన్‌ను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ లతో ఎంచుకోవచ్చు. అయితే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కేవలం పెట్రోల్‌ వేరియంట్‌కు మాత్రమే పరిమితం చేసారు.

మైలేజ్ వివరాలు...

మైలేజ్ వివరాలు...

  • పెట్రోల్ సిటి (మ్యాన్యువల్) మైలేజ్ లీటర్‌కు 17.4కిమీలు
  • పెట్రోల్ సిటి (ఆటోమేటిక్) మైలేజ్ లీటర్‌కు 18కిమీలు
  • డీజల్ సిటి వేరియంట్ మైలేజ్ లీటర్‌‌కు 25.6కిమీలు
2017 హోండా సిటి సెడాన్

  • 2017 సిటి పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 9,96,595 లు
  • 2017 సిటి పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 13,80,904 లు
  • 2017 సిటి డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 12,92,772 లు
  • 2017 సిటి డీజల్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 16,25,914 లు

ఎక్స్-రూమ్ ధర, ఆర్‌టిఒ మరియు ఇన్సూరెన్స్ కలుపుకుని ఆన్ రోడ్ ధరగా ఇవ్వడం జరిగింది.

2017 హోండా సిటి సెడాన్

సరికొత్త 2017 సిటి సెడాన్ ప్రస్తుతం విపణిలో ఉన్న మారుతి సుజుకి సియాజ్, వోక్స్‌వ్యాగన్ వెంటో, స్కోడా ర్యాపిడ్ వంటి వాటికి మరియు త్వరలో రానున్న నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నాలకు గట్టి పోటీనివ్వనుంది.

 
English summary
Read In Telugu about honda city zx variant in high demand. Get more details about 2017 honda city price, engine features, specifications and more in telugu.

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark