ధరల పెంపు బాటలో వరుసగా మరో కంపెనీ

Written By:

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తమ ప్రీమియమ్ కార్ల ధరలు పెంచింది. మంచి పాపులర్ అయిన సిటి సెడాన్, బిఆర్-వి మరియు సిఆర్-వి ఎస్‌యూవీల మీద ధరలను పెంచినట్లు హోండా ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

హోండా కార్ల ధరలు

జిఎస్‌టి కౌన్సిల్ మునుపటి వస్తు మరియు సేవల పన్నులో సవరణలు చేయాలని తీసుకున్న నిర్ణయం మేరకు, జిఎస్‌టిలో మార్పులు చేర్పులు చేసి ప్యాసింజర్ వాహనాల మీద ఉన్న సెస్‌ను పెంచింది.

హోండా కార్ల ధరలు

జిఎస్‌టి మండలి నిర్వహించిన ట్యాక్స్ సవరణలో ఇండియన్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో ఉన్న మిడ్ సైజ్ సెడాన్, లగ్జరీ కార్లు మరియు ఎస్‌యూవీల మీద 2 నుండి 7 శాతం వరకు జిసిఎస్ సెస్ పెంచింది.

హోండా కార్ల ధరలు

సవరించబడిన జిఎస్‌టి సెస్ మేరకు హోండా కార్ల మీద రూ. 7,003 ల నుండి రూ. 89,069 ల వరకు ధరలు పెరిగాయి. ధరల పెంపు అనంతరం కొత్త ధరలు సెప్టెంబర్ 11, 2017 నుండి అమల్లోకి వచ్చినట్లు హోండా వివరించింది.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
హోండా కార్ల ధరలు

జిఎస్‌టి సవరణ తరువాత హోండా చేసిన ధరల సవరణలో హోండా సిటి లోని వివిధ వేరియంట్ల ఆధారంగా రూ. 7,003 ల నుండి 18,791 ల వరకు ధరలు పెరిగాయి.

హోండా కార్ల ధరలు

అదే విధంగా హోండా బిఆర్-వి మీద 12,490 రుపాయల నుండి రూ. 18,242 ల వరకు మరియు హోండా సిఆర్-వి మీద రూ. 75,034 ల నుండి 89,069 ల వరకు ధరలు పెరిగాయి.

హోండా కార్ల ధరలు

పాత పన్ను పద్దతిని పూర్తిగా మార్చేస్తూ, జూలై 1, 2017 నుండి కొత్త పన్ను విధానం జిఎస్‌టి అమల్లోకి వచ్చింది. జిఎస్‌టి మేరకు, అత్యంత ఖరీదైన హై ఎండ్ కార్లు, లగ్జరీ మరియు ఎస్‌యూవీ వెహికల్స్ మీద ట్యాక్స్ తగ్గడంతో వాటి ధరలు భారీగా దిగివచ్చాయి.

హోండా కార్ల ధరలు

అయితే చిన్న మరియు పెద్ద వాహనాల మధ్య ట్యాక్స్ అసమానతలు ఎక్కువగా ఉండటంతో సెప్టెంబర్ 11, 2017 జిఎస్‌టి సవరణ బిల్లుతో ట్యాక్స్‌లో మళ్లీ మార్పులు చేసారు. ఈ సవరణకు అనుగుణంగా మిడ్ సైజ్, లగ్జరీ మరియు ఎస్‌యూవీ వాహనాల మీద ధరలు పెరిగాయి.

హోండా కార్ల ధరలు

జిఎస్‌టి సవరణ అనంతరం వివిధ కేటగిరీలలో జిఎస్‌టి ట్యాక్స్ మరియు సెస్ కలుపుకొని మొత్తం ట్యాక్స్‌లు ఇలా ఉన్నాయి....

  • మిడ్ సైజ్ కార్ల మీద - 45 శాతం
  • లగ్జరీ కార్ల మీద - 48 శాతం
  • ఎస్‌యూవీ వాహనాల మీద - 50 శాతం.
హోండా కార్ల ధరలు

చిన్న పెట్రోల్ మీద డీజల్ కార్ల మీద అదే విధంగా హైబ్రిడ్ కార్ల మీద ఉన్న మునుపుటి ట్యాక్స్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇది వరకే టయోటా కిర్లోస్కర్ ఇండియా మరియు ఇసుజు మోటార్స్ ఇండియా తమ కార్ల మీద ధరలు పెంచాయి.

English summary
Read In Telugu: Honda Increases Prices Of Its Cars In India After GST Revision
Story first published: Friday, September 15, 2017, 12:38 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark