హోండా డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్యూవీ విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్లు కోసం...
హోండా మోటార్స్ నేడు(16,04,2017) మార్కెట్లోకి తమ క్రాసోవర్ ఎస్యూవీ డబ్ల్యూఆర్-వి ని విడుదల చేసింది. ధర, ఫీచర్లు, ఇంజన్ స్పెసిఫికేషన్లు మరియు పూర్తి వివరాలు నేటి కథనంలో....
జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ విపణిలోకి మొట్టమొదటి క్రాసోవర్ ఎస్‌యూవీని సంచలనాత్మక ధరకు విడుదల చేసింది. జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో డెవలప్ చేసిన డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ గురించి....

హోండా డబ్ల్యూఆర్-వి వేరియంట్లు మరియు ధర వివరాలు
- డబ్ల్యూఆర్-వి ఎస్ ధర రూ. 7.75 లక్షలు
- డబ్ల్యూఆర్-వి ఎస్(డీజల్) ధర రూ. 8.79 లక్షలు
- డబ్ల్యూఆర్-వి విఎక్స్ ధర రూ. 8.99 లక్షలు
- డబ్ల్యూఆర్-వి విఎక్స్(డీజల్) ధర రూ. 9.99 లక్షలు గమనిక: అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
- ఇంజన్ సామర్థ్యం - 1.2-లీటర్
- పవర్ - 89బిహెచ్పి
- టార్క్ - 110ఎన్ఎమ్
- మైలేజ్ - 17.5కిలోమీటర్లు/లీటర్
- ట్రాన్స్మిషన్ - 5-స్పీడ్ మ్యాన్యువల్
- ఇంజన్ సామర్థ్యం - 1.5-లీటర్
- పవర్ - 99బిహెచ్పి
- టార్క్ - 200ఎన్ఎమ్
- మైలేజ్ - 25.5కిలోమీటర్లు/లీటర్
- ట్రాన్స్మిషన్ - 6-స్పీడ్ మ్యాన్యువల్

హోండా మోటార్స్ డబ్ల్యూఆర్-వి క్రాసోవర్‌ను పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు.

డబ్ల్యూఆర్-వి పెట్రోల్ వేరియంట్ స్పెసిఫికేషన్లు

హోండా డబ్ల్యూఆర్-వి డీజల్ స్పెసిఫికేషన్లు

డబ్ల్యూఆర్-వి డిజైన్
డబ్ల్యూఆర్-వి దాదాపు జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను పోలి ఉంటుంది. వాలుగా, చిన్న పరిమాణంలో ఉన్న హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు పెద్ద పరిమాణంలో హోండా చిహ్నాన్ని కలిగి ఉన్న క్రోమ్ పట్టీ కలదు.

సిల్వర్ స్కిడ్ ప్లేట్ గల ఫ్రంట్ బంపర్ క్లాడింగ్ కలదు, ఇందులో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలవు. జాజ్ ఫ్రంట్ డిజైన్ పదునుగా ఉంటే, డబ్ల్యూఆర్-వి ముందు బాగం ఉబ్బెత్తుగా ఉంది.

రియర్ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో ఆంగ్లపు ఎల్-ఆకారంలో ఉన్న టెయిల్ ల్యాంప్స్ కలదు. నెంబర్ ప్లేట్ కోసం చతురస్రాకారంలో రియర్ డోర్‌కు మధ్యలో స్థానం కల్పించారు.

ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, డబ్ల్యూఆర్-విలో 7-అంగుళాల తాకే తెర గల ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ కలదు. ఇది న్యావిగేషన్, వై-ఫై, 1.5-జిబి ఇంటర్నల్ మెమొరీ, రెండు యుఎస్బి స్లాట్లు, మిర్రర్ లింక్ మరియు స్మార్మ్ ఫోన్ కనెక్టివిటి కలదు.

డబ్ల్యూఆర్-వి టాప్ ఎండ్ వేరియంట్లో సన్ రూఫ్ కూడా కలదు. డీజల్ స్పోర్టింగ్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్, స్మార్ట్ కీ ఎంట్రీ మరియు క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు కలవు.

హోండా మోటార్స్ విడుదల చేసిన డబ్ల్యూఆర్-వి లోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందివ్వడం జరిగింది.
ఎక్కువ మంది చతువుతున్నవి:



Click it and Unblock the Notifications














