డబ్ల్యూఆర్-వి ప్రొడక్షన్ ప్రారంభించిన హోండా ఇండియా
హోండా వారి అప్‌కమింగ్ కారు డబ్ల్యూఆర్-వి ఉత్పత్తిని దేశీయంగా ప్రారంభించింది. కాంపాక్ట్ క్రాసోవర్ సెగ్మెంట్లోకి మార్చి 2017 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.
హోండా మోటార్స్ గత ఏడాది బ్రెజిల్‌లో తమ కాంపాక్ట్ క్రాసోవర్ కారు డబ్ల్యూఆర్-వి ని ప్రదర్శించింది. ఇప్పుడు జపాన్ దిగ్గజానికి ఇండియన్ మార్కెట్లో ఇదొక ప్రముఖ విడుదల కానుంది. హోండా ఈ కాంపాక్ట్ క్రాసోవర్ డబ్ల్యూఆర్-వి ని వచ్చే మార్చి 2017 నాటికి విడుదల చేయనుందని సమాచారం.

అయితే హోండా మోటార్స్ తమ రాజస్థాన్ తపుకరా ప్లాంటులో డబ్ల్యూఆర్-వి కాంపాక్ట్ క్రాసోవర్ యొక్క ఉత్పత్తి ప్రారంభించిందని ప్రముఖ వాహన వార్తా వేదిక గాడివాడి పేర్కొంది.

హోండా మోటార్స్ డబ్ల్యూఆర్-వి తో కొత్త ప్రయోగాన్ని చేస్తోందని స్పష్టంగా చెప్పవచ్చు. నిజగానికి ఇది జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో పూర్తి స్థాయిలో హ్యాచ్‌బ్యాక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించబడింది. విభిన్న డిజైన్ లక్షణాలతో రూపాంతరం చెందిన దీనిని కాంపాక్ట్ క్రాసోవర్‌గా హోండా అభివర్ణించింది.

డబ్ల్యూఆర్-వి కాంపాక్ట్ క్రాసోవర్ ముందు వైపు డిజైన్‌లో విశాలమైన ఫ్రంట్ గ్రిల్, క్రోమ్ బార్ మరియు ఫ్రంట్ సైడ్ రెండు వైపులా ఉన్న హెడ్ ల్యాంప్స్ వరకు విస్తరించి ఉన్న గ్రిల్ కలదు.

దీనిని కాంపాక్ట్ క్రాసోవర్ అని తెలిపేందుకు గాను, నల్లటి రంగులో ఉన్న బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, పెద్ద పరిమాణంలో ఉన్న వీల్స్, స్కిడ్ ప్లేట్లతో పాటు ముందు మరియు వెనుక వైపున బంపర్లు కలవు.

హోండా డబ్ల్యూఆర్-వి ని జాజ్ హ్యాచ్‌బ్యాక్ తో పోల్చుకుంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. డబ్ల్యూఆర్-వి వెనుక వైపున న్యూ డిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్ పొడవాటి టెయిల్ గేట్, రిజిస్ట్రేషన్ ప్లేటుకు కాస్త పై భాగంలో క్రోమ్ బార్ వంటి వాటిని ఇందులో గుర్తించవచ్చు.

ఇంటీరియర్‌కు సంభందించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు, అయితే సీట్లు, డ్యాష్ బోర్డ్ లను జాజ్ నుండి సేకరించనున్నట్లు సమాచారం. ఇది జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా అందిస్తున్న అత్యంత సరసమైన ఉత్పత్తిగా నిలిచే అవకాశం ఉంది.

దేశీయంగా విడుదల కానున్న డబ్ల్యూఆర్-వి లో సాంకేతికంగా 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్, 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‌లతో వచ్చే అవకాశం ఉంది.

ట్రాన్స్‌మిషన్ పరంగా 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదంటే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల సివిటి గేర్‌బాక్స్‌లతో వచ్చే అవకాశం ఉంది.

హోండా మోటార్స్ తమ కాంపాక్ట్ క్రాసోవర్ వాహనం డబ్ల్యూఆర్-వి ని రూ. 6.5 లక్షల నుండి రూ. 9.5 లక్షల మధ్య ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

ఒకసారి విపణిలోకి విడుదలయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్ మరియు హ్యందాయ్ ఐ20 ఆక్టివ్ వంటి ఉత్పత్తులకు గట్టి పోటీనివ్వగలదు.

యమహా ఎఫ్‌జడ్ 25 Vs బెనెల్లీ టిఎన్‌టి 25 - మీ ఎంపిక ఏది...!!
మార్చి 5 న టాటా విడుదల చేయనున్న సబ్ కాంపాక్ట్ సెడాన్: పూర్తి వివరాలు


Click it and Unblock the Notifications








