వెహికల్ సెఫ్టీలో కేంద్రం మరో ముందడగు: మరింత సురక్షితమవుతున్న ఇండియన్ కార్లు

Written By:

చాలా కార్లలో ఉండాల్సిన సేఫ్టీ ఫీచర్లు అస్సలు ఉండవు. ఇందుకు కారణం ప్రభుత్వం ఆయా కార్ల తయారీ సంస్థలను ప్రశ్నింటచకపోవడం. అయితే కాలం మారింది, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత్ ప్రభుత్వం కార్ల తయారీ సంస్థలకు కొన్ని సూచనలు మరియు నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
తప్పనిసరి భద్రత ఫీచర్లు

ఇక మీదట ప్రతి ఇండియన్ ప్యాసింజర్ కారులో ఐదు అతి ముఖ్యమైన భద్రత ఫీచర్లు తప్పనిసరిగా అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రూల్ ఎప్పటి నుండి అమలువుతుంది ఏయే ఫీచర్లు ఉండనున్నాయో చూద్దాం రండి.

Recommended Video
[Telugu] Toyota Etios Safety Experiential Drive in Bengaluru - DriveSpark
తప్పనిసరి భద్రత ఫీచర్లు

భారత్‌లో జరుగుతున్న ప్రమాదాలు మరియు రోడ్లకు అనుగుణంగా ప్రతి ప్యాసింజర్ కారులో ఉండాల్సిన తప్పనిసరి భద్రతా ఫీచర్లను కేంద్రం ప్రకటించింది. జూలై 1, 2019 నుండి మార్కెట్లోకి విడుదలయ్యే ప్రతి కారులో ఈ ఫీచర్లు ఉండాల్సిందే.

తప్పనిసరి భద్రత ఫీచర్లు

2019 జూలై 1 నుండి ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ రిమైండర్, 80కిమీ వేగం దాటితో అప్రమత్తం చేసే సిస్టమ్, రివర్స్ పార్కింగ్ అలర్ట్స్ మరియు అత్యవసర సందర్భాలలో మ్యాన్యువల్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వంటి అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లను కార్లలో తప్పనిసరి చేసింది.

తప్పనిసరి భద్రత ఫీచర్లు

అదనపు సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేయాలనే అంశం ఎప్పటి నుండో చర్చల్లో ఉంది. అయితే తాజాగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అధికారికంగా దీనిని ఆమోదించారు. ఈ కొత్త నియమం జూలై 1, 2019 నుండి అమలు కానుంది.

తప్పనిసరి భద్రత ఫీచర్లు

కేంద్రం ప్రకటించిన సమయానికి ప్రతి కార్ల తయారీ సంస్థ కూడా ఈ నిర్ణయానికి అనుగుణంగా కార్లను విపణిలోకి విడుదల చేయాలి. ఈ ఫీచర్లు చాలా వరకు కార్లలోని టాప్ ఎండ్ వేరియంట్లు మరియు లగ్జరీ కార్లలో మాత్రమే లభించేవి.

తప్పనిసరి భద్రత ఫీచర్లు

ప్రయాణికులు మరియు పాదచారుల భద్రత దృష్ట్యా కేంద్ర రహదారులు మరియు రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నో ప్రమాదకరమైన రహదారులు ఉన్నాయి.

Trending On DriveSpark Telugu:

మోటార్ వెహికల్ సవరణ బిల్ అంటే ఏమిటి?

మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు!

ఎయిర్‌బ్యాగ్స్ ఎలా పనిచేస్తాయి?

తప్పనిసరి భద్రత ఫీచర్లు

గణాంకాల ప్రకారం, ఇండియాలో ఏడాదికి 74,000 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి మరియు సుమారుగా 1.51 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. వివిధ కారణాల రీత్యా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నుప్పటికీ, వాహనాల్లో ఉండాల్సిన కనీస భద్రత ఫీచర్లు ఉంటే ఈ సంఖ్యలు తగ్గేవి.

తప్పని చేసిన భద్రత ఫీచర్లు మరియు వాటి ప్రయోజనాలు...

తప్పనిసరి భద్రత ఫీచర్లు

స్పీడ్ లిమిట్ అలర్ట్

కొత్త కార్లలో అమర్చే స్పీడ్ లిమిట్ ఆడియో సిస్టమ్‌లో ఆడియో అలర్ట్స్ ఉంటాయి. వెహికల్ 80కిమీల వేగాన్ని అందుకుంటే ఆడియో అలర్ట్స్ చిన్నగా మొదలవుతాయి. అదే వేగం 100కిమీలను చేరితే ఆడియో గట్టిగా మ్రోగుతుంది. ఇక 120కిమీల స్పీడ్ అందుకుంటే ఆడియో అలర్ట్ నాన్-స్టాప్‌గా మ్రోగుతుంది.

తప్పనిసరి భద్రత ఫీచర్లు

మ్యాన్యువల్ ఓవర్ రైడ్ సిస్టమ్

యాక్సిడెంట్‌లో కారు ఎలక్ట్రిక్ సిస్టమ్ ఫెయిల్ అయితే, మ్యాన్యువల్ ఓవర్ రైడ్ ద్వారా లోపలి నుండి డోర్లను అన్ లాక్ చేసుకుని బయటపడవచ్చు. ప్రమాదానంతరం ప్రయాణికులు కారులో నుండి బయటకు రాలేక ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలాంటి వాటిని నివారించేందుకు ఈ ఫీచర్ తప్పని చేశారు.

తప్పనిసరి భద్రత ఫీచర్లు

రివర్స్ పార్కింగ్ అలర్ట్స్

రివర్స్ గేర్‌లో పార్కింగ్ చేస్తున్నపుడు కారుకు మరియు పాదచారులకు జరిగే ప్రమాదాలను అరికట్టడానికి రివర్స్ పార్కింగ్ అలర్ట్స్‌ను తప్పనిసరి చేయడం జరిగింది. దీని ద్వారా కారును ఎంత వరకు వెనుక్కు డ్రైవ్ చేయవచ్చు మరియు ఏవైనా అవరోధాలు ఉంటే డ్రైవర్‌కు సూచిస్తాయి.

తప్పనిసరి భద్రత ఫీచర్లు

కొత్త రూల్ ద్వారా కారుకు ముందు మరియు సైడ్ క్రాష్ టెస్ట్ నిర్వహించి దాని భద్రతను అంచనా వేయనున్నారు. అందుకోసం భారత్ న్యూ వెహికల్ అస్సెస్‌మెంట్ ప్రోగ్రామ్(BNVSAP) ను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఉన్న క్రాష్ పరీక్షలకంటే మరింత కఠినంగా ఇక్కడ సేఫ్టీ టెస్ట్ నిర్వహించనున్నారు.

తప్పనిసరి భద్రత ఫీచర్లు

ప్యాసింజర్ కార్లతో పాటు పట్టణ ప్రాంతాల్లో నడిచే చిన్న స్థాయి వాణిజ్య వాహనాలలో రివర్స్ సెన్సార్లు మరియు ఎయిర్ బ్యాగులను తప్పనిసరిగా చేసినట్లు కేంద్రం ప్రకటించింది.

English summary
Read In Telugu: Indian cars to become safer from July 1, 2019
Please Wait while comments are loading...

Latest Photos