సునామీ సృష్టిస్తున్న జీప్ కంపాస్ బుకింగ్స్

Written By:

అమెరికాకు చెందిన దిగ్గజ లగ్జరీ ఎస్‌యూవీ తయరీ సంస్థ జీప్ ఇండియన్ మార్కెట్లో రోజురోజుకీ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ఏడాది దేశీయంగా ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఎంతో ఉత్కంఠాన్ని రేపుతూ కంపాస్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇప్పటికే టెస్ట్ డ్రైవ్ నిర్వహించిన కంపాస్ మీద బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

మార్కెట్ మొత్తం విస్తుపోయే విధంగా జీప్ కంపాస్ మీద బుకింగ్స్ నమోదవుతున్నాయి. ఒక్క నెలలో 4,000 యూనిట్ల వరకు బుక్ అయినట్లు రిపోర్ట్స్ తెలిపాయి.

జీప్ కంపాస్ బుకింగ్స్

జీప్ ఇండియా అందుబాటులోకి తెచ్చిన కంపాస్ లోని డీజల్ టాప్ ఎండ్ వేరియంట్ మీద 60 శాతం బుకింగ్స్ నమోదైనట్లు తెలిసింది. సుమారుగా 20 లక్షల అంచనా ధరతో విడుదలయ్యే అవకాశం ఉన్న కంపాస్‌కు మంచి స్పందన లభిస్తోంది.

Recommended Video - Watch Now!
2017 Mercedes-AMG GLC 43 Coupe Launched In India | In Telugu - DriveSpark తెలుగు
జీప్ కంపాస్ బుకింగ్స్

జీప్ ఇండియాలో గత ఏడాది సెప్టెంబర్‌లో అహ్మదాబాద్‌లో తొలి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 50 జీప్ విక్రయ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ప్రస్తుతం ఉన్న ఫియట్ షోరూమ్‌లే ఉన్నాయి.

జీప్ కంపాస్ బుకింగ్స్

జీప్ కంపాస్ ఎస్‌యూవీ సాంకేతికంగా పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. కంపాస్ ఎస్‌యూవీలోని 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ 160బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు.

జీప్ కంపాస్ బుకింగ్స్

కంపాస్‌లోని 2.0-లీటర్ డీజల్ ఇంజన్ 171బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. జీప్ కంపాస్‌ డీజల్‌ వేరియంట్లో జీప్ ఆక్టివ్ ఆల్ వీల్ డ్రైవ్‌ సిస్టమ్‌తో లభించనుంది.

జీప్ కంపాస్ బుకింగ్స్

జీప్ కంపాస్ ఎస్‌యూవీని 31 జూలై, 2017 మార్కెట్లోకి విడుదల చేయనుంది. జీప్ కంపాస్ ఎస్‌యూవీ ఇంజన్, ఫీచర్లతో దాదాపు అన్ని వివరాలు విడుదలయ్యాయి కాబట్టి, ధరలు మరియు వేరియంట్ల విడుదల రోజున తెలియనున్నాయి.

జీప్ కంపాస్ బుకింగ్స్

జీప్ కంపాస్ ప్రస్తుతం విపణిలో ఉన్న హ్యుందాయ్ టుసాన్ మరియు వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీలకు గట్టిపోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Jeep Compass Gets 4000 Bookings In India
Story first published: Saturday, July 29, 2017, 15:08 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark