ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపనున్న జీప్ కంపాస్ ధరలు

Written By:

జీప్ ఇండియా దేశీయ మార్కెట్లోకి కంపాస్ ఎస్‌యూవీని రూ. 14.95 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. మరియు ఆల్ వీల్ డ్రైవ్ టాప్ ఎండ్ వేరియంట్ డీజల్ ఎస్‌యూవీ ధర రూ. 20.65 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

జీప్ కంపాస్ మార్కెట్లో ఉన్న అన్ని లెజండరీ ఎస్‌యూవీలకు ముగింపు పలుకుతుందని జీప్ కమర్షియల్ ప్రతినిధులు పేర్కొన్నారు. బ్రాండ్ విలువకు ఏ మాత్రం తీసిపోని కంపాస్ రూ. 20 లక్షల ధరలలోపు అందుబాటులోకి రావడంతో, ఇదే శ్రేణిలో ఉన్న ఇతర ఎస్‌యూవీలకు దినదిన గండంగా మారింది. జీప్ కంపాస్ బాధిత ఎస్‌యూవీలు మరియు వాటి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
జీప్ కంపాస్ ధరలు

ప్రతి ఆటోమొబైల్ మార్కెట్లోకి ఏ వాహనం విడుదలైనా మొదట ఆరా తీసే అంశం ధర. ప్రత్యేకించి అభివృద్ది చెందుతున్న భారత్ లాంటి పరిశ్రమలలో ధరకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, జీప్ తమ కంపాస్ ఎస్‌యూవీని రూ. 14.95 నుండి 20.65 లక్షల ధరల శ్రేణిలో ప్రవేశపెట్టనుంది. డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు భద్రత పరంగా ఈ సెగ్మెంట్లో కంపాస్‌ను ఢీకొట్టే మరో పోటీలేనేలేదని చెప్పవచ్చు.

జీప్ కంపాస్ ధరలు

ధరల పరంగా ఇండియన్స్‌ను ఆకట్టుకునే విషయంలోనే కాదు, దేశీయంగా ఉన్న మిడ్ రేంజ్ ఎస్‌యూవీల నుండి టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీలర్ లాంటి ప్రీమియమ్ ఎస్‌యూవీలను ఎంచుకునే కస్టమర్లను సైతం తన వైపుకు తిప్పుకునేలా కంపాస్‌ను ఆవిష్కరించింది. అందుకు అనుగుణంగానే పెద్ద పరిమాణంలో బాక్సీ ఆకారంలో ఉన్న బాడీ స్టైల్‌లో కంపాస్‌ను రూపొందించడం జరిగింది.

జీప్ కంపాస్ ధరలు

జీప్ కంపాస్ విషయంలో ఫోర్డ్ ఎండీవర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ వంటి ఎస్‌యూవీలు ఎందుకు భయపడాలో ఇక్కడ చూద్దాం రండి.

 • ఫార్చ్యూనర్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 29.18 లక్షలు
 • ఫోర్డ్ ఎండీవర్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 29.78 లక్షలు
 • మిత్సుబిషి పజేరో స్పోర్ట్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 28.33 లక్షలు.
వీటన్నింటితో పోల్చితే జీప్ కంపాస్ టాప్ ఎండ్ వేరియంట్ రూ. 7.68 లక్షలు తక్కువగా ఉంది.
జీప్ కంపాస్ ధరలు

ఫార్చ్యూనర్, ఎండీవర్ మరియు పజేరో స్పోర్ట్ ఎస్‌యూవీలు చూడటానికి చాలా పెద్దగా ఉంటాయి. అయితే జీప్ కంపాస్ పరిమాణం పరంగా వీటితో పోటీపడటం కాస్త కష్టమే, అయితే డీసెంట్ కంపాస్ సొంతం. కాబట్టి భారీ పరిమాణంలో ఉన్న ఎస్‌యూవీలను కోరుకునే కస్టమర్లు కంపాస్‌ను పెద్దగా ఇష్టపడకపోవచ్చు.

జీప్ కంపాస్ ధరలు

జీప్ కంపాస్ డీజల్ వేరియంట్ల ధరలు

 • స్పోర్ట్ రూ. 15,45,000 లు
 • లాంగిట్యూడ్ రూ. 16,45,000 లు
 • లాంగిట్యూడ్ ఆప్షన్ రూ. 17,25,000 లు
 • లిమిటెడ్ 18,05,000 లు
 • లిమిటెడ్ ఆప్షన్ రూ. 18,75,000 లు
 • లిమిటెడ్ 4x4 రూ. 19,95,000 లు
 • లిమిటెడ్ ఆప్షన్ 4x4 రూ. 20,65,000 లు
జీప్ కంపాస్ ధరలు

జీప్ కంపాస్ పెట్రోల్ వేరియంట్ల ధరలు

 • స్పోర్ట్ రూ. 14,95,000 లు
 • లిమిటెడ్ రూ. 18,70,000 లు
 • లిమిటెడ్ ఆప్షన్ రూ. 19,40,000 లు

జీప్ కంపాస్ ధరలు

జీప్ కంపాస్ ప్రీమియమ్ ఎస్‌యూవీలకు మాత్రమే కాకుండా కాంపాక్ట్ ఎస్‌యూవీలకు మరియు ప్రీమియమ్ సెడాన్ కార్లకు ధర పరంగా గట్టి పోటీనిస్తోంది. అత్యుత్తమ ఆఫ్ రోడ్ మరియు ఆన్ రోడ్ సామర్థ్యాలతో పాటు సెడాన్ కార్లలో ధరలోనే కంపాస్ లభ్యమవుతోంది. అలాంటప్పుడు కంపాస్ ఎస్‌యూవీకే ఎక్కువ మంది మొగ్గుచూపే అవకాశం ఉంది.

జీప్ కంపాస్ ధరలు

దేశీయంగా ఉన్న డి-సెగ్మెంట్ కార్లను పరిశీలిస్తే, స్కోడా ఆక్టావియా ప్రారంభ వేరియంట్ ధర రూ. 15.5 లక్షలు మరియు హ్యుందాయ్ ఎలంట్రా ప్రారంభ వేరియంట్ ధర రూ. 12.99 లక్షలు‌గా ఉంది. జీప్ కంపాస్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 14.95 లక్షలుగా ఉంది. ఎలంట్రా మరియు ఆక్టావియా సెడాన్‌లతో పోల్చుకుంటే కంపాస్ అత్యంత శక్తివంతమైనది మరియు అత్యుత్తమ ఫీచర్లను కలిగి ఉంది.

జీప్ కంపాస్ ధరలు

జీప్ కంపాస్ విడుదలయ్యాక, ఇండియన్ మార్కెట్లో ఈ వాహనాల మీద ప్రభావం అధికంగా ఉంటుందని చూస్తే, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, టాటా హెక్సా, హ్యుందాయ్ క్రెటా, టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు హ్యుదాయ్ టుసాన్ లకు గట్టి పోటీనిస్తోంది. ఇవన్నీ కంపాస్ ధరల శ్రేణిలోనే ఉన్నాయి, అయితే కంపాస్‌తో పోల్చుకుంటే వీటిలో ఇంజన్ సామర్థ్యం, ఫీచర్లు, భద్రత వంటివి తక్కువగానే ఉన్నాయి.

జీప్ కంపాస్ ధరలు

జీప్ కంపాస్, మెర్సిడెస్ బెంజ్ తాజాగా దేశీయ విపణిలోకి విడుదల చేసిన జిఎల్ఎ క్లాస్ లగ్జరీ ఎస్‌యూవీకి కూడా పోటీనిస్తుంది. మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ క్లాస్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 30.65 లక్షలుగా ఉంది. కంపాస్‌ ప్రారంభ వేరియంట్‌తో పోల్చుకుంటే దీని ధర 10 లక్షల వరకు అధికంగా ఉంది. విలువ పరంగా కంపాస్‌ను పోలినప్పటికీ, బెంజ్ లోగో కోసం మరో పది లక్షలు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది.

జీప్ కంపాస్ ధరలు

ఆటోమొబైల్స్ ప్రేమించే ఔత్సాహికుల దృష్టి కోణం నుండి చూస్తే, జీప్ కంపాస్‌ను ఇతర వానాలతో పోల్చడం దాదాపు కష్టమే. ఎందుకంటే ఆటోమొబైల్ పరిశ్రమంలో ఇదే సెగ్మెంట్లో ఉన్న వెహికల్స్‌తో మాత్రమే పోల్చగలరు. కాని కస్టమర్ దృష్టితో చూస్తే డబ్బుకు తగ్గ విలువైన వాహనం ఏది అని మార్కెట్లో ఉన్న అన్ని వాహనాలతో పోల్చగలం.

జీప్ కంపాస్ ధరలు

ఏదేమయినప్పటికీ, 12 నుండి 30 లక్షల బడ్జెట్లో వెహికల్‌ కొనాలనుకునే ప్రతి కస్టమర్ జీప్ కంపాస్‌ను చూస్తే బాగుంటుంది. జీప్ కంపాస్ ఇంజన్, ఫీచర్లు, పనీతీరు, పర్ఫామెన్స్, సామర్థ్యం మరియు ధరలు వంటి ఎన్నో వివరాలు తెలిపే రివ్యూ మరియు లాంచ్ స్టోరీల మీద ఓ లుక్కేసుకోండి...

జీప్ కంపాస్ ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కంపాస్ విడుదలకు ముందు, ధరల విషయంలో ఎన్నో ఆధారంలేని అంచనా ధరలు నెట్టింట్లో తీవ్ర సందడి చేసాయి. అయితే ఆధారం లేని ధరలు అలజడికి పులిస్టాప్ పెడితే, మార్కెట్ వర్గాలను షాకింగ్‌కు గురిచేస్తూ, అద్భుతమైన ధరల శ్రేణిలో కంపాస్‌ను విడుదల చేసింది.

జీప్ కంపాస్ ధరలు

జీప్ ఇండియా తమ కార్యకలాపాలాను వ్యూహాత్మకంగా విస్తరించుకుంటూపోతే, విపణిలో ఉన్న ఎన్నో ఎస్‌యూవీలను ఎంచుకునే కస్టమర్లను కంపాస్ ద్వారా తన వైపుకు మళ్లించుకోవచ్చు. విడుదలకు ముందే కంపాస్ మీద 5,000 లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. ధరలు అన్నీ తక్కువగా ఉండటంతో కంపాస్ సేల్స్ విపరీతంగా పెరగనున్నాయి.

English summary
Read In Telugu: Jeep Compass Price In India — How It Affects Competition Across Segments
Story first published: Tuesday, August 1, 2017, 13:18 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark