మహీంద్రా టియువి300 ప్లస్ వెర్షన్ ధర మరియు టెక్నికల్ వివరాలు లీక్

Written By:

భారతదేశపు అతి పెద్ద ఎస్‌యూవీ వాహన తయారీ దిగ్గజంగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా తమ టియువి300 కాంపాక్ట్ ఎస్‌యూవీ పొడవు పెంచి, మూడు వరుసల సీటింగ్ కెపాసిటీతో రూపొందించి టియువి300 ప్లస్ పేరుతో పూర్తి స్థాయిలో సిద్దం చేసింది.

మహీంద్రా టియువి300 ప్లస్

అయితే, మహీంద్రా దీనిని అధికారికంగా విడుదల చేయడానికి ముందే ధర మరియు ఇతర వివరాలు లీక్ అయ్యాయి. పలుదఫాలుగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ వచ్చిన మోడల్ ఇప్పుడు పూర్తి స్థాయిలో విడుదలకు సిద్దమైంది.

Recommended Video - Watch Now!
Indian Government Bans Bull Bars & Crash Guards - DriveSpark
మహీంద్రా టియువి300 ప్లస్

మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ విపణిలో దీని విడుదలను ఇంకా ఖరారు చేయలేదు. కనీసం, ఆవిష్కరించలేదు కూడా. అయితే తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు రహస్యంగా విడుదలైన ఫోటోల ద్వారా టియువి300 ప్లస్ 9-సీటర్ పి4 వేరియంట్ ధర వివరాలు రివీల్ అయ్యాయి.

మహీంద్రా టియువి300 ప్లస్

తమిళనాడులోని మహీంద్రా డీలర్ ప్రకారం, 118బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ వేరియంట్ మహీంద్రా టియువి300 పి4 ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.46 లక్షలుగా ఉంది.

మహీంద్రా టియువి300 ప్లస్

పొడవాటి వెర్షన్ మహీంద్రా టియువి300 ప్లస్ రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చితే ట్యాంకు రూపంలో చాలా పొడవుగా ఉంటుంది. విశాలమైన ఇంటీరియర్ క్యాబిన్ మరియు ఎక్కువ సీటింగ్ కెపాసిటి ఈ యుటిలిటి వెహికల్(UV) సొంతం.

మహీంద్రా టియువి300 ప్లస్

ఫ్రంట్ డిజై‌న్ మరియు ఓవరాల్ బాడీ చూడటానికి రెగ్యులర్ వెర్షన్ టియువి300నే పోలి ఉంటుంది. అయితే, రియర్ సెక్షన్‌లో టెయిల్ ల్యాంప్స్ బాడీ ప్రక్కవైపులకు కూడా విస్తరించి ఉండటాన్నిగమనించవచ్చు. ఇంటీరియర్ కూడా అచ్చం సాధారణ టియువి300 రూపంలోనే ఉంటుంది.

మహీంద్రా టియువి300 ప్లస్

అంతే కాకుండా మహీంద్రా టియువి300 యుటిలిటి వెహికల్ పలు రకాల సీటింగ్ కెపాసిటి గల వేరియంట్లలో లభించనుంది. న్యూ వెర్షన్ టియువి300 ప్లస్ ప్రస్తుతం మహీంద్రా లైనప్‌లో వయసైపోతున్న జైలో స్థానాన్ని భర్తీ చేయనుంది.

మహీంద్రా టియువి300 ప్లస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ యుటిలిటి వెహికల్ సామ్రాజ్యంలో తన హవాను కొనసాగించనుంది. కస్టమర్లకు ఎన్నో రకాల ఎంచుకోదగిన ఆప్షన్స్ కల్పిస్తూ ఎస్‍‌యూవీ మార్కెట్లో ఆధిపత్యం కోసం పోరాడుతోంది. పెద్ద పరిమాణంలో ఉన్న బాడీ, విశాలమైన ఇంటీరియర్ మరియు అత్యుత్తమ సీటింగ్ కెపాసిటి వంటివి అంశాలు టియువి300 ప్లస్ వెర్షన్‌కు ఎలాంటి సక్సెస్ తీసుకురానున్నాయో చూడాలి మరి!

మహీంద్రా టియువి300 ప్లస్ వెహికల్ గురించి మీ అభిప్రాయం మాతో పంచుకోండి...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Mahindra TUV300 Plus (Extended Wheelbase) P4 Variant Price Revealed
Story first published: Saturday, December 23, 2017, 10:59 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark