మహీంద్రా నుండి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎక్స్‌యూవీ500

దేశీయ దిగ్గజ ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి పూర్తి స్థాయిలో అప్‌డేట్స్ నిర్వహించిన ఎక్స్‌యూవీని విడుదలకు సిద్దం చేస్తోంది.

By Anil

దేశీయ దిగ్గజ ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి పూర్తి స్థాయిలో అప్‌డేట్స్ నిర్వహించిన ఎక్స్‌యూవీని విడుదలకు సిద్దం చేస్తోంది. భారీ మార్పులతో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో 2018 నాటికి మార్కెట్లో విడుదలవ్వనుంది.

మహీంద్రా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌యూవీ500

మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఎక్స్‌యూవీ500 ఫే‌స్‌లిఫ్ట్‌తో పాటు టియువి300 ఆధారిత ఎస్‌యూవీ మరియు శాంగ్‌యాంగ్ టివోలి ఆధారిత ఎస్201 ఎస్‌యూవీని ఒకేసారి పరీక్షిస్తూ మీడియాకు చిక్కింది. వాటి ఫోటోలు మరియు పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

Recommended Video

[Telugu] Mahindra KUV100 NXT Launched In India - DriveSpark
మహీంద్రా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌యూవీ500

ఎక్ట్సీరియర్ మీద ఎలాంటి మార్పులు మరియు అప్‌డేట్స్ గుర్తించడానికి వీల్లేకుండా నలుపు మరియు తెలుగు రంగు చారలున్న పేపర్‌తో బాడీ మొత్తాన్ని కప్పేసి ఎక్స్‌యూవీ500 కు రహదారి పరీక్షలు నిర్వహించారు.

మహీంద్రా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌యూవీ500

2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద మహీంద్రా ఆవిష్కరించిన ఎక్స్‌యూవీ ఏరో నుండి సేకరించిన 10-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఇందులో గుర్తించవచ్చు. అయితే, ఎక్స్‌యూవీ500 మొత్తం డిజైన్ అచ్చం మునుపటి మోడల్‌నే పోలి ఉంది.

మహీంద్రా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌యూవీ500

2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద మహీంద్రా ఆవిష్కరించిన ఎక్స్‌యూవీ ఏరో నుండి సేకరించిన 10-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఇందులో గుర్తించవచ్చు. అయితే, ఎక్స్‌యూవీ500 మొత్తం డిజైన్ అచ్చం మునుపటి మోడల్‌నే పోలి ఉంది.

మహీంద్రా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌యూవీ500

ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్‌లో వస్తున్న మరో ప్రధాన మార్పు, శక్తివంతమైన ఇంజన్. అత్యుత్తమ పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేసే 2.2-లీటర్ కెపాసిటి గల ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ ఇందులో రానుంది. ఇది గరిష్టంగా 170బిహెచ్‌పి పవర్ మరియు 350-360ఎన్ఎమ్ మధ్య టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌యూవీ500

ప్రస్తుతం అమ్ముడుపోతున్న ఎక్స్‌యూవీ500 140బిహెచ్‌పి పవర్ మరియు 330ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా తమ స్కార్పియో ఫేస్‌లిఫ్ట్‌లో కూడా శక్తివంతమైన ఇంజన్ అందివ్వడానికి ప్రయత్నిస్తోంది.

మహీంద్రా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500 లో ఇది వరకే ఉన్న ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్‌తో పాటు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వంటివి యథావిధిగా అప్ కమింగ్ ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్‌లో రానున్నాయి.

మహీంద్రా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌యూవీ500

ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న పోటీ మొత్తాన్ని ఎదుర్కొని రాణించడానికి తమ అన్ని ప్రధాన మోడళ్లలో శక్తివంతమైన ఇంజన్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. దీనికి తోడు పలు ముఖ్యమైన ఇంటీరియర్ ఫీచర్లను అందించి ప్రీమియమ్ ఫీల్ కలిగించడానికి ప్రయత్నిస్తోంది.

మహీంద్రా ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌యూవీ500

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రస్తుతం పరీక్షిస్తున్న మోడళ్లను పరిశీలిస్తే, ఎక్స్‌యూవీ500లో పెద్ద పెద్ద మార్పులేవీ చోటు చేసుకోలేదని తెలుస్తోంది. కానీ శక్తివంతమైన ఇంజన్‌లను అందివ్వడంతో పవర్ అవుట్‌పుట్ అధికంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra XUV500 Facelift Spotted Testing In India
Story first published: Monday, November 13, 2017, 18:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X