కార్ వాష్ చేసి, సర్వీస్ మొత్తం చేసినట్లు మోసగించిన మారుతి డీలర్

బెంగళూరులోని పేరుగాంచిన మారుతి సుజుకి అధీకృత డీలర్ మండోవి మోటార్స్ సర్వీసింగ్ నిర్వాకం బయటపడింది. బాలెనో కారును సర్వీసింగ్‌కు ఇచ్చివెళితే కారును మాత్రమే కడిగి, మొత్తం సర్వీసింగ్ చేసినట్లు పంపించేశారు.

By Anil

బెంగళూరులోని పేరుగాంచిన మారుతి సుజుకి అధీకృత డీలర్ మండోవి మోటార్స్ సర్వీసింగ్ నిర్వాకం బయటపడింది. బాలెనో కారును సర్వీసింగ్‌కు ఇచ్చివెళితే కారును మాత్రమే కడిగి, మొత్తం సర్వీసింగ్ చేసినట్లు పంపించేశారు.

అయితే, వీరి మోసం ఎలా బయటపడింది? తర్వాత కస్టమర్ మరియు డీలర్ వాదనేంటో చూద్దాం రండి...

 సర్వీస్ మొత్తం చేసినట్లు మోసగించిన మారుతి డీలర్

మారుతి బాలెనో ఆర్ఎస్ కస్టమర్ తన కారు రెండవ ఉచిత సర్వీసింగ్ కోసం బెంగళూరులోని మండోవి మోటార్స్‌కు ఇచ్చాడు. ఎప్పటిలాగే కారును సర్వీసింగ్ సెంటర్లో వదిలాడు. అదే రోజు సాయంత్రానికి కస్టమర్ ఇచ్చిన అడ్రస్ వద్ద కారును డెలివరీ ఇచ్చారు.

 సర్వీస్ మొత్తం చేసినట్లు మోసగించిన మారుతి డీలర్

కారును సర్వీసింగ్‌కు ఇచ్చేటప్పుడు కారులో ఎలాంటి సమస్యలేదు. అయితే, ఉదయం కార్ స్టార్ట్ చేస్తున్నపుడు పెట్రోల్ వాసన వస్తున్నట్లు తెలిపాడు. సర్వీసింగ్ చేసే సమయంలో ఈ సమస్య ఒకసారి చూడమని కస్టమర్ సర్వీస్ మేనేజర్‌ను కోరాడు.

Recommended Video

Tata Nexon Review: Specs
 సర్వీస్ మొత్తం చేసినట్లు మోసగించిన మారుతి డీలర్

సర్వీస్ తరువాత అనుకున్న సమయానికే కారు కస్టమర్ ఇంటికి డెలివరీ అయ్యింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. సర్వీసింగ్‌ ఎలా చేసారో... ఏమేం చేశారో తెలుసుకోవడానికి రహస్యంగా కారులో ఒక కెమెరాను బిగించాడు. ఇంకేముంది, మారుతి సర్వీసింగ్ సెంటర్ వ్యక్తుల నిర్వాకం మొత్తం రికార్డ్ చేసుకొచ్చింది.

 సర్వీస్ మొత్తం చేసినట్లు మోసగించిన మారుతి డీలర్

కారులోని కెమెరా తీసి మొత్తం ప్లే చేసిన కస్టమర్ కంగుతిన్నాడు, కారులో ఎలాంటి సర్వీసింగ్ చేయకపోవడం కెమెరా ద్వారా స్పష్టంగా బట్టబయలైంది. మారుతి చేసిన సర్వీసింగ్ వాటర్ సర్వీస్ మాత్రమే. కారు వాటర్ క్లీనింగ్ మినహాయిస్తే, ఎలాంటి సర్వీసింగ్ చేయకుండానే ఇంటికి డెలివరీ ఇచ్చారు.

  • ఒక్కసారి ఛార్జింగ్‌తో 85కిమీలు మైలేజ్‌నిచ్చే ఆటో విడుదల
  •  సర్వీస్ మొత్తం చేసినట్లు మోసగించిన మారుతి డీలర్

    సెకండ్ సర్వీసింగ్‌లో వివిధ రకాల ఆయిల్ లెవల్స్, వాటి స్థితి మరియు భౌతిక అంశాలను పరీక్షించాల్సి ఉంటుంది. కనీసం ఏ ఆయిల్ ట్యాంక్ మూత కూడా తీయకుండానే అన్ని చెక్ చేసినట్లు పేపర్లో టిక్కులు వేసి సర్వీసింగ్ ముగించేశారు.

     సర్వీస్ మొత్తం చేసినట్లు మోసగించిన మారుతి డీలర్

    తరువాత కస్టమర్‌ తన కారును డీలర్ వద్దకు తీసుకెళ్లి వీడియో మొత్తాన్ని చూపించి కాస్త గట్టిగానే అడిగాడు. దీని సర్వీసింగ్ మేనేజర్ స్పందిస్తూ, ఇది ముమ్మాటికీ మా తప్పే, ఇలా ఎప్పుడు జరగలేదు, ఇక మీదట ఇలా జరగకుండా చూస్తామని వివరణ ఇచ్చుకున్నాడు.

     సర్వీస్ మొత్తం చేసినట్లు మోసగించిన మారుతి డీలర్

    అయితే, కస్టమర్ మాట్లాడుతూ, వచ్చే వారంలో లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను. అందుకోసమని కారును సర్వీసింగ్‌కు ఇచ్చాను. మీరు ఏం చేయకుండా డెలివరీ ఇచ్చారు. ఒక వేళ అందులో లోపం ఉండి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లింటే మా పరిస్థితి ఏమిటని గట్టిగా నిలదీశాడు.

     సర్వీస్ మొత్తం చేసినట్లు మోసగించిన మారుతి డీలర్

    సర్వీసింగ్ మేనేజర్ వ్యక్తిగతంగా కస్టమర్‌కు క్షమాపణలు కోరుతూ, కస్టమర్ల పర్యవేక్షణలో కారు మొత్తానికి మళ్లీ సర్వీసింగ్ చేయించి డెలివరీ ఇచ్చారు. చాలా మంది మారుతి అంటే సర్వీసింగ్ మరియు డీలర్‌షిప్ నెట్‌వర్క్‌కు మారుపేరు అనుకుంటారు. అయితే, ఇలాంటివి జరుగుతుండటంతో కస్టమర్లలో మారుతి మీద వ్యతిరేకత రావడం ఖాయం.

    కాబట్టి ఇక మీదట మీ కారు లేదా బైకు సర్వీసింగ్‌కు ఇచ్చినపుడు, మీరు కూడా అక్కడే ఉంటే బాగుటుంది. లక్షల వెచ్చించి కొనుగోలు చేసిన కార్లను ఇలా ఇచ్చి వదిలేస్తే, మళ్లీ ఇలాంటి సంఘటనే జరిగింది కస్టమర్లే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి కారు/బైకు సర్వీసింగ్ దగ్గరుండి చేయించుకోవడం మంచిది.

    సర్వీసింగ్‌కు ఇస్తే, కార్ వాష్ చేసి పంపించేశారు

    ఈ కథనం గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి....

    Trending On DriveSpark Telugu:

Most Read Articles

English summary
Read In Telugu: Maruti baleno service center fraud
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X