ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ గురించి ఊహించిన ప్రకటన చేసిన మారుతి సుజుకి

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది.

By Anil

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది.

తాజాగా అందిన సమాచారం మేరకు, మారుతి సుజుకి సెప్టెంబర్ 28, 2017 ఎస్-క్రాస్ క్రాసోవర్ ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయనున్నట్లు తెలిసింది. పండుగ సీజన్ నేపథ్యంలో వస్తోన్న ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చుకుంటే ఎక్ట్సీరియర్‌లో భారీ మార్పులు జరిగాయి.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ డిజైన్‌లో పొడవాటి క్రోమ్ స్లాట్లున్న ఫ్రంట్ గ్రిల్ కలదు. కండలు తిరిగిన రూపంలో దర్శనమిస్తున్న ఇందులో ఫ్రంట్ బంపర్ మొత్తాన్ని రీ డిజైన్ చేశారు. సరికొత్త ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

ఈ ఎస్‌యూవీ వైనుక వైపు డిజైన్‌లో కొద్దిగా మార్పులు జరిగాయి. ప్రదానంగా టెయిల్ ల్యాంప్ డిజైన్‌ స్వల్పంగా మారింది. ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్ చూడటానికి రెగ్యులర్ ఎస్-క్రాస్‌నే పోలి ఉంటుంది.

Recommended Video

Tata Nexon Review: Specs
మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్‍‌లో కూడా ముఖ్యమైన మార్పులు సంతరించుకున్నాయి. ప్రత్యేకించి ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేయగల సరికొత్త అప్‌డేటెడ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో వచ్చింది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

మారుతి ఎస్-క్రాస్ ఫేస్‍‌లిఫ్ట్ ఎస్‌యూవీలో ఇది వరకే ఉన్న 1.3-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ వేరియంట్లో రానుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానున్న ఇది గరిష్టంగా 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఎస్‌యూవీని 2015లో తొలిసారి విడుదల చేసినప్పుడు 1.3-లీటర్ మరియు 1.6-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లను ప్రవేశపెట్టింది. అయితే, 1.6-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లకు ఆశించిన ఆదరణ లభించకపోవడంతో, కేవలం 1.3-లీటర్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంచింది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రస్తుతం మారుతి లైనప్‌లో ఉన్న ఎస్-క్రాస్ తో పోల్చుకుంటే ఫేస్‌లిఫ్ట్ ఎస్-క్రాస్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. అయితే, రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చినపుడు ఎన్నో మార్పులు కనిపించే విధంగా ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ భారీ అప్‌డేట్స్‌కు గురయ్యింది.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki S-Cross Facelift India Launch Date Revealed
Story first published: Wednesday, September 20, 2017, 18:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X