మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు టాటా హెక్సా లకు మారుతి సుజుకి దిమ్మతిరిగే షాక్

చిన్న కార్ల పరిశ్రమలో తిరుగులేని సక్సెస్ అందుకున్న మారుతి సుజుకి ఇప్పుడు ఖరీదైన వాహన సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది.

By Anil

చిన్న కార్ల పరిశ్రమలో తిరుగులేని సక్సెస్ అందుకున్న మారుతి సుజుకి ఇప్పుడు ఖరీదైన వాహన సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది. యుటిలిటి వెహికల్ శ్రేణిలో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా మరియు టాటా మోటార్స్‌కు మారుతి గట్టి షాకివ్వనుంది.

మారుతి గ్రాండ్ వితారా

ఎస్‌యూవీ సేల్స్‌లో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా మారుతి సుజుకి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీ మొదటి స్థానంలో నిలిచింది. చిన్న కార్లతో పాటు ఎస్‌యూవీ సెగ్మెంట్లో కూడా మంచి సక్సెస్ అందుకున్న ఇండో-జపనీస్ సంస్థ మారుతి సుజుకి అతి త్వరలో ఖరీదైన ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనుంది.

Recommended Video

Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మారుతి గ్రాండ్ వితారా

మారుతి సుజుకి ఛైర్మన్ ఓ దిగ్గజ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతి 2019 నాటికి ఖరీదైన ప్రీమియమ్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్లు తెలిపాడు.

మారుతి గ్రాండ్ వితారా

మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్ సి భార్గవ మాట్లాడుతూ, " పెద్ద ఎస్‌యూవీ సెగ్మెంట్ మినహాయిస్తే, దాదాపు అన్ని రకాల కార్లను మారుతి ఉత్పత్తి చేస్తోంది. అతి త్వరలో మారుతి ఈ శ్రేణిలోకి కూడా ప్రవేశిస్తోంది. ఖచ్చితమైన తేదీ చెప్పలేను కానీ 2019 చివరి నాటికి తొలి ప్రీమియమ్ ఎస్‌యూవీ విడుదల ఖచ్చితమని చెప్పుకొచ్చాడు."

Trending On DriveSpark Telugu:

2018లో మరో సంచలనానికి తెర దించుతున్న మారుతి

హోండా నుండి దూసుకొస్తున్న గ్రాజియా 125 స్కూటర్: ఫీచర్లు, ఫోటోలు, విడుదల, బుకింగ్స్ మరియు డెలివరీ వివరాలు

మారుతి గ్రాండ్ వితారా

ప్రీమియమ్ ఎస్‌యూవీతో పాటు, ఎర్టిగా ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా వైహెచ్‌బి అనే కోడ్ పేరుతో క్రాసోవర్ యుటిలిటి వెహికల్స్‌ను అభివృద్ది చేసే ప్రణాళికల్లో ఉంది. అయితే, క్రాసోవర్ మరియు ప్రీమియమ్ ఎస్‌యూవీలను విడుదల చేసేలోపు మూడు వరుసల సీటింగ్ సామర్థ్యంతో వ్యాగన్ఆర్ ఎమ్‌పీవీ విడుదల చేయనుంది.

మారుతి గ్రాండ్ వితారా

మారుతి సుజుకి నుండి రానున్న ప్రీమియమ్ ఎస్‌యూవీ ధరల శ్రేణి రూ. 12 నుండి 18 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. గతంలో ఈ ప్రైజ్ రేంజ్‌లో విడుదల చేసిన గ్రాండ్ వితారా కు ఆశించిన స్పందన లభించలేదు.

మారుతి గ్రాండ్ వితారా

అయితే, మారుతి ప్రవేశపెట్టిన వితారా బ్రిజా సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిరూపించుకుంది. ఇదే వ్యాపార ప్రణాళికను కంపెనీ తమ అప్‌కమింగ్ ప్రీమియమ్ ఎస్‌యూవీ మీద కూడా ప్రయోగించనుంది.

మారుతి గ్రాండ్ వితారా

మారుతి నుండి రానున్న ఖరీదైన ప్రీమియమ్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు టాటా హెక్సా ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

మారుతి గ్రాండ్ వితారా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బాలెనో, సియాజ్ వంటి ఖరీదైన మోడళ్ల సక్సెస్ రుచి చూసిన మారుతి సుజుకి ఇప్పుడు ప్రీమియమ్ ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి ఉవ్విళ్లూరుతోంది. మారుతి ప్రీమియమ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తే, వ్యూహాత్మక వ్యాపార ప్రణాళికలతో ఖచ్చితంగా ఇండియన్ కొనుగోలుదారులను ఆకట్టుకునే మోడళ్లను విడుదల చేయడం ఖాయం.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki To Launch Premium SUV In India — Will Rival Mahindra XUV500 & Tata Hexa
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X