కొత్త గుర్ఖాలను ఆవిష్కరించిన ఫోర్స్ మోటార్స్: ధర మరియు పూర్తి వివరాలు...

Written By:

ఇండియాకు చెందిన వాహన తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ గుర్ఖా మోడల్స్ లోని నూతన శ్రేణి వేరియంట్లను ఆవిష్కరించింది. నూతన సొబగులతో పాటు బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ ఆప్షన్ల‌తో అందుబాటులోకి తెచ్చింది.

కొత్త గుర్ఖాలను ఆవిష్కరించిన ఫోర్స్

ఫోర్స్ మోటార్స్ అధికారిక వెబ్‌సైట్ మీద తమ ఎక్స్‌ప్లోర్ మరియు ఎక్స్‌పెడిషన్ మోడళ్లను ఆవిష్కరించినట్లు తెలిపింది. వీటిలో ఎక్స్‌ప్లోర్ ఎడిషన్ గుర్ఖా ధర రూ. 9.35 లక్షలు మరియు ఎక్స్‌పెడిషన్ గుర్ఖా మోడల్ ధర రూ. 8.38 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

కొత్త గుర్ఖాలను ఆవిష్కరించిన ఫోర్స్

ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌ప్లోర్ 3-డోర్ల మోడల్. దీనిని హార్డ్ టాప్ మరియు సాఫ్ట్ టాప్(తొలగించడానికి వీలయ్యేది) ఆప్షన్లలో ఎంచుకోవచ్చు. ఈ కొత్త మోడల్‍‌ను ఎక్కువ నాణ్యమైన సి-ఇన్-సి ఛాసిస్‌తో నిర్మించడం జరిగింది.

కొత్త గుర్ఖాలను ఆవిష్కరించిన ఫోర్స్

ఫోర్స్ గుర్ఖా ఎక్స్‌పెడిషన్ మోడల్ 3-డోర్లను కలిగి ఉంటుంది. అయితే దీనిని కేవలం హార్డ్‌టాప్‌తో మాత్రమే ఎంచుకోవచ్చు. ఈ నూతన మోడల్‌లో ఆధునిక సస్పెన్షన్ సిస్టమ్, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గల ఇందులోని ఫ్రంట్ మరియు రియర్ డిఫరెన్షియల్ కోసం మ్యాన్యువల్ లాక్ సిస్టమ్ కలదు. మరియు ఫాగ్ ల్యాంప్స్ గల స్టీల్ బంపర్ కలదు.

కొత్త గుర్ఖాలను ఆవిష్కరించిన ఫోర్స్

ఫోర్స్ గుర్ఖా లోని ఎక్స్‌ప్లోర్ మరియు ఎక్స్‌పెడిషన్ రెండు మోడళ్లలో 2.6-లీటర్ సామర్థ్యం గల టిసిఐసి కామన్ రెయిల్ డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 85బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

కొత్త గుర్ఖాలను ఆవిష్కరించిన ఫోర్స్

ట్రాన్స్‌మిషన్ పరంగా ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలదు. మనుపటి గేర్‌బాక్స్‌ కన్నా ఇది మరింత మృదువుగా ఉటుంది.

కొత్త గుర్ఖాలను ఆవిష్కరించిన ఫోర్స్

ఫోర్స్ మోటార్స్ లోని గుర్ఖా వేరియంట్లలోని ఇంటీరియర్‌లో సలుభంగా స్టీర్ చేయగల స్టీరింగ్ వీల్, అధునాతన సెంటర్ కన్సోల్ కలదు.

మారుతి సుజుకి ఇగ్నిస్ క్రాసోవర్ ఫోటోలను వీక్షించండి...

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫోటోలను వీక్షించండి....

టాటా టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ ఫోటోలను వీక్షించండి....

టాటా హెక్సా ఎస్‌యూవీ ఫోటోలను వీక్షించండి.....

 
English summary
New Range Of Force Gurkha Models Revealed — Refreshed!
Please Wait while comments are loading...

Latest Photos