స్విఫ్ట్ కారుకు పోటీని తీసుకొస్తున్న ఫ్రెంచ్ దిగ్గజం పిఎస్ఏ గ్రూపు

Written By:

ప్యూజో, సిట్రియోన్ మరియు డిఎస్ బ్రాండ్ లను సొంతం చేసుకున్న ఫ్రెంచ్‌ దిగ్గజం పిఎస్ఏ గ్రూప్, దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లోకి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ సెడాన్ మరియు ప్రీమిమయ్ సెడాన్‌లను విడుదల చేయడానికి సిద్దమైంది.

ఫ్రెంచ్ దిగ్గజ పిఎస్ఏ గ్రూపు

దేశీయంగా మంచి అమ్మకాల్లో ఉన్న అన్ని ప్రధానమైన ఉత్పత్తుల మీద దృష్టిపెట్టి స్మార్ట్ కార్ల తయారీకి పిఎస్ఏ గ్రూపు సిద్దం అవుతోంది. పిఎస్ఏ గ్రూపు యొక్క మొదటి ఉత్పత్తి ఎస్‌యూవీ ఆధారిత హ్యాచ్‌బ్యాక్. ఇది స్విఫ్ట్‌కు బలమైనపోటీనివ్వనుంది.

ఫ్రెంచ్ దిగ్గజ పిఎస్ఏ గ్రూపు

స్విఫ్ట్‌కు పోటీగా ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ తో పాటు కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు మీడియం సైజులో ఉన్న సెడాన్ కార్లను విపణిలోకి ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు వేస్తోంది.

ఫ్రెంచ్ దిగ్గజ పిఎస్ఏ గ్రూపు

దేశీయంగా సాంకేతిక అభివృద్ది మరియు సోర్సింగ్ మద్ధుతు కోసం పిఎస్ఏ గ్రూపు దేశీయ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ మరియు టాటా టెక్నాలజీస్‌తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ఫ్రెంచ్ దిగ్గజ పిఎస్ఏ గ్రూపు

ప్రస్తుతం పిఎస్ఓ గ్రూప్ అంతర్గతంగా స్మార్ట్ కార్ 1, స్మార్ట్ 2 మరియు స్మార్ట్ కార్ 3 తమ పోర్ట్‌ఫోలియోలో భాగంగా అభివృద్ది చేస్తోంది.

ఫ్రెంచ్ దిగ్గజ పిఎస్ఏ గ్రూపు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్కెట్లకు అనుగుణంగా ఉత్పత్తులను అభివృద్ది చేస్తోంది. మరియు వీటిని పిఎస్ఏ గ్రూప్ యొక్క సిఎమ్‌పి ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా దాదాపు అన్ని ఉత్పత్తుల్లో కామన్‌గా వినియోగించుకునే విడి భాగాల తయారీ మీద దృష్టిసారిస్తోంది.

ఫ్రెంచ్ దిగ్గజ పిఎస్ఏ గ్రూపు

విపణిలోకి ముందు హ్యాచ్‍‌బ్యాక్ విడుదల చేసి, ఏడాది అనంతరం కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆ తరువాత మూడవ ఉత్పత్తిని విడుదల చేసే విధంగా ప్రణాళికలు రచిస్తోంది.

ఫ్రెంచ్ దిగ్గజ పిఎస్ఏ గ్రూపు

పిఎస్ఏ గ్రూప్ పూర్తిగా రెనో ఇండియా వ్యూహాలను పాటించనుంది. ఇండియన్స్‌కు అవసరమైన ఉత్పత్తులను వారి అభిరుచికి అనుగుణంగా, ధరకు తగ్గ విలువలతో కార్లను అభివృద్ది చేసి అందుబాటులోకి తేవడానికి పిఎస్ఏ గ్రూప్ ప్లాన్ చేస్తోంది.

ఫ్రెంచ్ దిగ్గజ పిఎస్ఏ గ్రూపు

2020 నుండి దేశీయంగా మరిన్ని భద్రత ప్రమాణాలను భారత ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. సేఫ్టీ ఫీచర్లను కల్పిస్తూనే, ప్రస్తుతం మార్కెట్ లీడర్స్ అయిన మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్ వంటి వాటికి అనుగుణంగా పిఎస్ఏ గ్రూప్ ధరలను నిర్ణయించనుంది.

ఇతరులు ఎక్కువగా చదువుతున్న కథనాలు:

ఫ్రెంచ్ దిగ్గజ పిఎస్ఏ గ్రూపు

డ్రైవ్‌స్పార్క్ ఫోటో గ్యాలరీ కోసం....

  • టాటా హెక్సా ఎస్‌యూవీ ఫోటోలను వీక్షించండి...
  • టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీ ఫోటోలను వీక్షించండి...

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫోటోలను వీక్షించండి...

 
English summary
Also Read In Telugu: PSA Group To Launch Cars In India At Competitive Prices — Swift Rival To Arrive First
Story first published: Monday, March 20, 2017, 17:49 [IST]
Please Wait while comments are loading...

Latest Photos