రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:

రేంజ్ రోవర్ విపణిలోకి సరికొత్త వెలార్ లగ్జరీ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. రేంజ్ రోవర్ వెలార్ ప్రారంభ ధర రూ. 78.83 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. దేశవ్యాప్తంగా రేంజ్ రోవర్ మరియు ల్యాండ్ రోవర్ విక్రయ కేంద్రాలలో వెలార్ ఎస్‌యూవీ మీద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 2018 జనవరి చివరి నుండి డెలివరీ చేయనుంది.

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ

రేంజ్ రోవర్ ఫ్యామిలీలో వెలార్ నాలుగవ మోడల్. ఈ సరికొత్త మోడల్ రేంజ్ రోవర్ ఎవోక్ మరియు స్పోర్ట్ మోడళ్ల మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది. సరికొత్త రేంజ్ రోవర్ వెలార్ మూడు రకాల ఇంజన్ ఆప్షన్‌లలో లభించనుంది.

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ

రేంజ్ రోవర్ వెలార్‌లో కూపే తరహా రూఫ్ లైన్, విశాలమైన బాడీ డిజైన్‌లతో రేంజ్ రోవర్ డిజైన్‌ లాంగ్వేజ్‌ను యథావిధిగా ఇందులో కొనసాగించారు. సాంకేతికంగా రేంజ్ రోవర్ వెలార్‌లో ఉన్న 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ 177బిహెచ్‌పి పవర్, 3.0-లీటర్ వి6 డీజల్ ఇంజన్ 296బిహెచ్‌పి పవర్ మరియు 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 247బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ

రేంజ్ రోవర్ వెలార్ డి-డైనమిక్ మరియు ఫస్ట్ ఎడిషన్ వెర్షన్‌లతో పాటు, మూడు ఇంజన్ ఆప్షన్‌లు కూడా ఎస్, ఎస్ఇ మరియు హెచ్ఎస్ఇ వేరియంట్లలో లభించనున్నాయి.

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ

వెలార్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో నూతన డిజైన్ ఫిలాసఫీలో నిర్మించిన అత్యాధునిక ఇంటీరియర్ కలదు. డ్యాష్ బోర్డు మధ్యలో పెద్ద ఆకారంలో ఉన్న తాకే తెరలున్నాయి, వీటిలో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరొకటి ఎస్‌యూవీకి సంభందించిన వివిధ పంక్షనాలిటీ కోసం(ఉదా: క్లైమేట్ కంట్రోల్ ).

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ

అంతే కాకుండా, రేంజ్ రోవర్ వెలార్‌ ఎస్‌యూవీని స్టాండర్డ్ లెథర్ ఇంటీరియర్ లేదా మైక్రో ఫైబర్ ఇంటీరియర్ ప్యాకేజీతో ఎంచుకోవచ్చు. ఇది విపణిలో ఉన్న ఆడి క్యూ7, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ మరియు వోల్వో ఎక్స్‌సి90 వంటి లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తుంది. వీటితో పాటు వెలార్ రాక ల్యాండ్ రోవర్ డిస్కవరీ, జాగ్వార్ ఎఫ్-పేస్ మరియు పోర్సే కయీన్ కార్లకు గండంగా మారింది.

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రేంజ్ రోవర్ ఇండియా లైనప్‌లో ఎవోక్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకునేవారికి వెలార్ ఎంపిక బెటర్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఉన్న రేంజ్ రోవర్ ఉత్పత్తుల్లో వెలార్ ఎస్‌యూవీ మాత్రమే ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంది.

English summary
Read In Telugu: Range Rover Velar Launched In India; Prices Start At Rs 78.83 Lakh
Story first published: Thursday, December 7, 2017, 15:24 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark