మీ వద్ద రెనో కారు ఉందా...? అయితే ఈ యాప్ తప్పనిసరిగా ఉండాల్సిందే

Written By:

రెనో ఇండియా మై రెనో యాప్ (MY Renault App)ను ప్రారంభించింది. కస్టమర్ల కోసం యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ అప్లికేషన్‌ను రెనో అందుబాటులోకి తీసుకొచ్చింది.

మై రెనో యాప్ రెనో లైనప్‌లోని అన్ని రకాల కార్లలలో అందుబాటులో ఉంది. మరియు ఇందులో 60 కి పైగా ఫీచర్లు ఉన్నాయి.

మై రెనో యాప్

మై రెనో యాప్‌లో ఉన్న అతి ప్రధానమైన ఫీచర్లలో

  • వెహికల్ హిస్టరీ యాక్సెస్,
  • పర్సనల్ రిమైండర్,
  • ఆన్‌లైన్ సర్వీస్ అపాయింట్‌మెంట్లు,
  • వెహికల్ కోసం కారు ఇంటరాక్టివ్ యూజర్ మ్యాన్యువల్,
  • డీలర్లు మరియు కస్టమర్ కేర్‌కు సులభమైన యాక్సెస్,
  • డాక్యుమెంట్ల భద్రత కోసం డిజిటల్ వాలెట్ స్టోరేజ్ మరియు
  • పేమెంట్ల సౌకర్యం కలదు.
మై రెనో యాప్

మై రెనో అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ గ్యాడ్జెట్లలో లభిస్తోంది. ప్రతి ఒక్కరు సులంభంగా వినియోగించేందుకు యూజర్ ఫ్రెండ్లీగా యాప్ అభివృద్ద చేశారు. ప్రత్యేకించి ఇండియన్ కస్టమర్ల కోసం ఈ అప్లికేషన్‌ను ఇండియాలోనే డిజైన్ చేసి, అభివృద్ది చేసినట్లు రెనో వెల్లడించింది.

మై రెనో యాప్

ప్యాసింజర్ కార్ల పరిశ్రమలోనే తొలిసారిగా ఇ-కామర్స్ ఫెసిలిటీని రెనో తమ అప్లికేషన్లో పరిచయం చేసింది. రెనో కస్టమర్లు తమ కార్ల కోసం ప్రత్యేకంగా ఉన్న మోడఫికేషన్స్ మరియు ప్రత్యేక డిజైన్ ఫీచర్లు మరియు ఆఫర్లను రెనో యాప్ నుండే చెక్ చేసుకోవచ్చు.

మై రెనో యాప్

రెనో కనెక్ట్ మరియు రెనో డీలర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(DMS) ఇంటిగ్రేటెడ్‌గా యాప్ డెవలప్ చేశారు. కస్టమర్లు నిరంతరం డీలర్లతో అనుసంధానంలో ఉండానికి ఇది ఉపయోగపడుతుంది. అంతే కాకుండా, రోడ్ సైడ్ అసిస్టెన్స్, కస్టమర్ కేర్, పేమెంట్ గేట్ వే, ఎస్ఎమ్ఎస్ మరియు ఇ-మెయిల్స్ యాక్సెస్ కలదు.

మై రెనో యాప్

"మా వ్యాపార వృద్దిలో కస్టమర్లే కేంద్ర బిందువు, ఇందుకోసం కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు" రెనో ఇండియా సిఇఒ మరియు మేనేజింగ్ డైరక్టర్ సుమిత్ సాహ్నే వెల్లడించాడు.

మై రెనో యాప్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కార్ల విక్రయించడంలో చూపే శ్రద్ద ఆ తరువాత కస్టమర్లను పట్టించుకోవడంలో చూపించవు కార్ల కంపెనీలు. అయితే, కస్టమర్లతో దీర్ఘకాలిక బందం కొనసాగేలా రెనో ఇండియా మై రెనో అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Read more on: #రెనో #renault
English summary
Read In Telugu: Renault India Launches My Renault App
Story first published: Saturday, September 9, 2017, 16:29 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark