ఎలక్ట్రిక్ క్విడ్ కారును సిద్దం చేస్తున్న రెనో

Written By:

ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ది చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రెనో తమ పాపులర్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్‌ కారు క్విడ్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అభివృద్ది చేస్తోంది. తమ తొలి ఎక్ట్రిక్ క్విడ్ కారును చైనా విపణిలోకి ప్రవేశపెట్టనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఎలక్ట్రిక్ వెర్షన్ రెనో క్విడ్

తాజాగా అందుతున్న సమాచారం మేరకు, రెనో ఏ-సెగ్మెంట్ ఆధారంగా ఎలక్ట్రిక్ కారును విడుదల చేసే ప్రణాళికల్లో ఉంది. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో నిస్సాన్ వద్ద ఉన్న ఓ మోడల్ ఆధారంగా క్విడ్ ను రూపొందించే పనిలో ఉన్నట్లు తెలిసింది.

ఎలక్ట్రిక్ వెర్షన్ రెనో క్విడ్

చిన్న ఎలక్ట్రిక్ కారు అభివృద్ది చేయడం ఖచ్చితం అని, నిస్సాన్ సిఇఒ హిరోతో సైకావా తెలిపారు. చైనాలోని బీజింగ్ మరియు షాంఘై తరహా నగరాల కోసం 2018 నాటికి చిన్న స్థాయి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించే పనిలో ఉన్నట్లు చైనాలోని రెనో మరియు నిస్సాన్ భాగస్వామ్యం డాంగ్‌ఫెగ్ మోటార్ స్పష్టం చేసింది.

ఎలక్ట్రిక్ వెర్షన్ రెనో క్విడ్

జపాన్ దిగ్గజం మిత్సుబిషి ఇదే ప్లాట్‌ఫామ్ ఆధారంగా చిన్న ఎలక్ట్రిక్ కారును రూపొందించడానికి సిద్దం అవుతోంది. ప్రస్తుతం చైనాలో ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది మరియు తయారీకి అధిక ప్రాధాన్యతనిస్తోంది చైనా ప్రభుత్వం. ఇందుకోసం ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థలకు అనేక ఇన్సెంటి‌వ్‌లను అందిస్తోంది.

ఎలక్ట్రిక్ వెర్షన్ రెనో క్విడ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అని దేశాలు కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీ మరియు అభివృద్ది సంస్థలకు అనేక ప్రోత్సాహకాలను ఇస్తోంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ కార్ల ప్రోత్సాహాన్ని చేపడితే బాగుంటుంది. 2030 నాటికి కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇప్పటి నుండే కార్ల తయారీ సంస్థలను ప్రోత్సహించాల్సి ఉంటుంది.

English summary
Read In Telugu: Renault To Launch Electric Kwid In China - Report
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark