డౌన్‍టౌన్ అర్బన్ ఎడిషన్‌లో టాటా హెక్సా

Written By:

టాటా మోటార్స్ తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ హెక్సా క్రాసోవర్ ఎస్‌యూవీని సరికొత్త స్పెషల్ ఎడిషన్‌లో విడుదలకు సిద్దం చేసింది. నూతన ఫీచర్లు, ఎక్ట్సీరియర్ మీద కాస్మొటిక్ అప్‌డేట్స్‌తో పాటు విభిన్న ఇంటీరియర్ సొబగులను జోడించి హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్‌లో హెక్సా ఎస్‌యూవీని స్పెషల్ ఎడిషన్‌గా రూపొందించింది.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

రెగ్యులర్ హెక్సా వెర్షన్‌తో పోల్చుకుంటే డౌన్‌టౌన్ అర్భన్ ఎడిషన్‌లో అధునాతన ఫీచర్ల గల కిట్ అందించింది. సరికొత్త అర్బన్ బ్రాంజ్ కలర్ ఆప్షన్‌లో లభించే ఈ లిమిటెడ్ ఎడిషన్ హెక్సాలో రెండు విభిన్న ప్యాకేజీలు ఉన్నాయి. అవి, అబ్సల్యూట్ మరియు ఇండల్జ్.

Recommended Video - Watch Now!
[Telugu] Skoda kodiaq Launched In India - DriveSpark
టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

రెండు ప్యాకేజిల్లో కూడా క్రోమ్ తొడుగులు ఉన్న హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ మరియు అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ ఉన్నాయి. అంతే కాకుండా వీటిలో, డౌన్‌టౌన్ బ్యాడ్జిలు, సైడ్ స్టెప్స్, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్, కార్పెట్ సెట్ మరియు కార్ కేర్ కిట్ వంటివి ఉన్నాయి.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

టాటా హెక్సా ఎస్‌యూవీ ఎక్స్ఇ, ఎక్స్ఎమ్, ఎక్స్‌ఎమ్ఎ, ఎక్స్‌టి మరియ ఎక్స్‌టిఎ వంటి వేరియంట్లలో లభ్యమవుతోంది. అబ్సల్యూట్ ప్యాకేజ్‌తో వచ్చిన ఎక్స్ఇ, ఎక్స్‌ఎమ్ మరియు ఎక్స్‌ఎమ్ వేరియంట్లలో సరికొత్త ట్యాన్ సీట్లు ఉన్నాయి. అయితే, ఇండల్జ్ ప్యాకేజ్ గల వేరియంట్లలో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

ఎక్స్‌టి మరియు ఎక్స్‌టి టాప్ ఎండ్ వేరియంట్లను ఇండల్జ్ ప్యాకేజీలో ఎంచుకోవచ్చు. ఇందులో రెండు Blaupunkt 10.1-అంగుళాల పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పేలను రియర్ ప్యాసింజర్ల కోసం అందివ్వడం జరిగింది.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

డ్యాష్ బోర్డ్ మీద నిర్మించిన హెడ్స్ అప్ డిస్ల్పే, స్పీడ్ లిమిటర్స్, బ్యాటరీ వోల్టేజ్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ వ్యవస్థ వంటివి ఉన్నాయి. టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్‌ అదే మునుపటి డీజల్ ఇంజన్‌లో లభిస్తోంది.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

హెక్సా డౌన్‌టౌన్‌లోని శక్తివంతమైన 2.2-లీటర్ నాలుగు సిలిండర్ల, టుర్బో డీజల్ ఇంజన్ ఎక్స్ఇ వేరియంట్లో 149బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా ఇతర వేరియంట్లలోని ఇదే ఇంజన్ 155బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

టాటా హెక్సా ఎక్స్ఇ వేరియంట్లో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉండగా, ఎక్స్ఎమ్ మరియు ఎక్స్‌టి వేరియంట్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించును. హెక్సా లోని టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌టిలో పవర్ మరయు టార్క్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

టాటా హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హెక్సా డౌన్‌టౌన్ అర్బన్ ఎడిషన్ ద్వారా ఎస్‌యూవీ సెగ్మెంట్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది. విభిన్న అంశాలతో వస్తున్న టాటా హెక్స్ డౌన్‌టౌన్ ఎడిషన్ విపణిలో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500, జీప్ కంపాస్ లోని ప్రారంభ వేరియంట్లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Tata Hexa Downtown Urban Edition Revealed Ahead Of India Launch
Story first published: Friday, October 27, 2017, 11:29 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark