నాలుగు కార్లను విపణి నుండి తొలగించే ఆలోచనలో టాటా మోటార్స్

Written By:

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న టాటా విక్రయ కేంద్రాల్లో ఉండే కార్ల జాబితాలో నాలుగు ఉత్పత్తులను మార్కెట్ నుండి తొలగించేందుకు టాటా మోటార్స్ సిద్దమైంది. వచ్చే మూడు నుండి నాలుగేళ్ల వరకు ఈ మోడళ్లు కొనుగోలు చేయడం దాదాపు కష్టమే. ప్రస్తుతం కొత్త కార్లను అభివృద్ది చేసేందుకు ఉన్న ఆరు ఫ్లాట్‌ఫామ్‌లను 2020-21 నాటికి రెండుకు కుదించాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలిసింది.

నాలుగు కార్లను విపణి నుండి తొలగించే ఆలోచనలో టాటా మోటార్స్

టాటా మోటార్స్ తమ పాపులర్ మోడల్స్ నానో, సుమో, ఇండికా మరియు ఇండిగో సిఎస్ కార్లను తమ వద్ద లభించే వాహనాల జాబితా నుండి తొలగించనుంది. అయితే దీనికి సంభందించి ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

నాలుగు కార్లను విపణి నుండి తొలగించే ఆలోచనలో టాటా మోటార్స్

అంతే కాకుండా నూతన ఉత్పత్తులను అభివృద్ది చేసేందుకు ప్రస్తుతం టాటా ఉపయోగిస్తున్న ఆరు ప్లాట్‌ఫామ్‌లను రెండుకు తగ్గించాలనే నిర్ణయం కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది.

నాలుగు కార్లను విపణి నుండి తొలగించే ఆలోచనలో టాటా మోటార్స్

ఇటి ఆటో ప్రకారం టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం టాటా వద్ద లభించే ప్యాసింజర్ కార్ల జాబితాలో 10 వాహనాలు ఉన్న తెలిపాడు. పది కార్లకు మించకుండా త్వరలో మరో నాలుగు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడతామని పేర్కొన్నాడు. అంటే, ఇప్పుడు అందుబాటులో ఉన్న పాత కార్లను తొలగించి వీటి స్థానంలోకి నూతన వాహనాలను విడుదల చేసే అవకాశం ఉంది.

నాలుగు కార్లను విపణి నుండి తొలగించే ఆలోచనలో టాటా మోటార్స్

టాటా నానో అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. ఈ మధ్య టాటా తొలగించిన టాటా సన్స్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ పదవిలో ఉన్నపుడు తెలిపిన ఓ ప్రకటన మేరకు, సంస్థ నష్టాలను పూడ్చేందుకు నానో ప్రొడక్షన్‌ను నిలిపివేయడం తప్పనిసరని తెలిపాడు.

నాలుగు కార్లను విపణి నుండి తొలగించే ఆలోచనలో టాటా మోటార్స్

విపణి నుండి తొలగించడానికి ఆశించిన స్థాయిలో విక్రయాలు నమోదు కాలేదనే కారణం మాత్రమే కాదు, 2018 నుండి తప్పనిసరి కానున్న నూతన క్రాష్ పరీక్షలను ఎదుర్కోవడం మరియు బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ అప్‌గ్రేడ్ చేయడం వంటి సవాళ్లు కూడా ఇందుకు కారణమయ్యాయి

నాలుగు కార్లను విపణి నుండి తొలగించే ఆలోచనలో టాటా మోటార్స్

సంస్థకు ఇండికా మరియు ఇండిగో సిఎస్ కార్లు స్థిరమైన ఆదాయాన్ని సాధించిపెడుతున్నాయి . కాబట్టి వీటిని లైనప్‌ నుండి తొలగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

నాలుగు కార్లను విపణి నుండి తొలగించే ఆలోచనలో టాటా మోటార్స్

అయితే తప్పనిసరి పరిస్థితుల్లో తొలగింపు అనివార్యమైతే, వాటి స్థానంలో బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ మరియు జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ లను ఎంచుకోవచ్చు.

నాలుగు కార్లను విపణి నుండి తొలగించే ఆలోచనలో టాటా మోటార్స్

దేశీయంగా మూడవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల సంస్థగా ఎదిగేందుకు టాటా ముందున్న అతి పెద్ద సవాళు, ప్రస్తుతం లైనప్‌లోని నాలుగింటిని తొలగించి వాటి స్థానంలో తిరిగి నాలుగు నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టడం.

నాలుగు కార్లను విపణి నుండి తొలగించే ఆలోచనలో టాటా మోటార్స్

భవిష్యత్తులో రానున్న నాలుగు కార్ల మీద దృష్టిసారిస్తే, రెండు కార్లు సిద్దంగా ఉన్న విషయం అవగతం అవుతుంది. అవి 2017 మరియు 2018 లో విడుదల కానున్న నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు టామో రేస్‌మో కారు.

నాలుగు కార్లను విపణి నుండి తొలగించే ఆలోచనలో టాటా మోటార్స్

టాటా మోటార్స్ టామో రేస్‌మో కారును 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద మరియు నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శన వేదిక మీద తొలిసారిగా ప్రదర్శించింది.

English summary
Also Read In Telugu: Tata Nano And Sumo To Be Phased Out. list of tata passenger vehicles which are phasing out from market.

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark