టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు మరియు ఇతర విడుదల వివరాలు

Written By:

జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్స్ ఇండియన్ ప్రీమియమ్‌ ఎమ్‌పీవీ సెగ్మెంట్లో భారీ ఇన్నోవా ను ఇన్నోవా క్రిస్టా రీలాంచ్‌తో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ విజయానికి కొనసాగింపుగా టూరింగ్ స్పోర్ట్ పేరుతో ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 17.79 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లతో ఎంచుకోవచ్చు.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

సాధారణ ఇన్నోవా క్రిస్టా లోని విఎక్స్ ట్రిమ్ ఆధారంతో మ్యాన్యువల్ వేరియంట్‌ను మరియు జడ్ఎక్స్ ట్రిమ్ ఆధారంతో టూరింగ్ స్పోర్ట్ ఆటోమేటిక్ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చారు.

ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ వేరియంట్ల వారీగా ధరలు

ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ వేరియంట్ల వారీగా ధరలు

  • టూరింగ్ స్పోర్ట్ పెట్రోల్ మ్యాన్యువల్ (2.7-లీటర్) ధర రూ. 17,79,000లు
  • టూరింగ్ స్పోర్ట్ పెట్రోల్ ఆటోమేటిక్ (2.7-లీటర్) ధర రూ. 20,84,500 లు
  • టూరింగ్ స్పోర్ట్ డీజల్ మ్యాన్యువల్ (2.4-లీటర్) ధర రూ. 18,91,000 లు
  • టూరింగ్ స్పోర్ట్ డీజల్ ఆటోమేటిక్ (2.8-లీటర్) ధర రూ. 22,15,500 లు
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

టయోటా తమ రెగ్యులర్ ఇన్నోవా క్రిస్టాలోని 2.7-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌ను టూరింగ్ స్పోర్ట్‌లో అందించింది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 164బిహెచ్‌పి పవర్ మరియు 248ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

డీజల్ వేరియంట్ టూరింగ్ స్పోర్ట్ రెండు ఇంజన్ మరియు రెండు రకాల ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తోంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల 2.4-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్ గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 343ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ గల వేరియంట్లో 2.8-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు, ఇది 172బిహెచ్‌పి పవర్ మరియు 360ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ డిజైన్ విషయానికి వస్తే, రెగ్యులర్ మోడల్‌తో పోల్చితే సులభంగా గుర్తుపట్టే రీతిలో ఇందులో మార్పులు చోటుచేసుకున్నాయి. బ్లాక్ కలర్‌లో ఉన్న ఫ్రంట్ గ్రిల్, ముందు మరియు వెనుక వైపున్న బంపర్లలో క్రోమ్ సొబగులు అందించారు.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

రియర్ డిజైన్‌కు ప్రాముఖ్యత్యను ఇస్తూ, రెండు టెయిల్ లైట్లకు మధ్యలో అనుసంధానంగా నలుపు రంగులో ఓ పట్టీని అందించారు. దానికి మధ్యలో టయోటా లోగోను కూర్చోబెట్టారు. అన్ని టూరింగ్ స్పోర్ట్ వేరియంట్లలో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ లోని అన్ని వేరియంట్లలో 7-సీటింగ్ సామర్థ్యం కలదు. ఇప్పుడు డ్యాష్ బోర్డులో ఎరుపు రంగు లైటింగ్ అందివ్వడం జరిగింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ లోని టాప్ పై భాగపు లోపలివైపున బ్లాక్ లెథర్ మరియు ఎర్రటి దారంలో కుట్టబడిన అప్‌హోల్‌స్ట్రే, సీట్లు, గేర్ మరియు స్టీరింగ్ తొడుగులు, సెంటర్ కన్సోల్ మరియు డ్యాష్ బోర్డు మీద ఎరుపు రంగులో ఉన్న వుడ్ కలదు.

టయోటా ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్

ఇన్నోవా క్రిస్టా టూరింగ్ స్పోర్ట్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అవి, సరికొత్త వైల్డ్ లైఫ్ రెడ్ మరియు వైట్ పర్ల్ క్రిస్టల్ షైన్.

 

English summary
Read In Telugu Toyota Innova Crysta Touring Sport Launched In India; Prices Start At Rs 17.79 Lakh
Story first published: Friday, May 5, 2017, 10:53 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark