టిగువాన్ ఎస్‌యూవీని ఇండియా విడుదలకు ఖాయం చేసిన వోక్స్‌వ్యాగన్

Written By:

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ తమ భారతదేశపు విభాగంలోకి సరికొత్త టిగువాన్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేస్తోంది. వోక్స్‌వ్యాగన్ ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తున్న మొదటి కారు కూడా ఇదే.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీ

వోక్స్‌వ్యాగన్ ఈ టిగువాన్ ఎస్‌యూవీని మే 2017 న పూర్తి స్థాయిలో విడుదల చేయనుంది. మరియు విడుదలకు ముందే అంటే ఏప్రిల్ 2017 నుండి దీని మీద బుకింగ్స్ ప్రారంభించనున్నారు.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీ

అంతర్జాతీయ విపణిలో ఉన్న టిగువార్ బ్రాండ్ పేరుతో ఉన్న ఎస్‌యూవీ తొలిసారిగా దేశీయ ఎస్‌యూవీ విపణిలోకి పరిచయం కాబోతోంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీ

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీ సంస్థ యొక్క పాపులర్ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించబడింది. మునుపటి టిగువాన్‌తో పోల్చుకుంటే దేశీయంగా పరిచయం అయ్యే టిగువార్ ఎస్‌యూవీ వీల్ బేస్ స్వల్పంగా పెరిగింది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీ

వీల్ బేస్ పెరగడం ద్వారా క్యాబిన్ స్పేస్ పెరగడంతో పాటు బరువు కూడా 50 కిలోలు ఎక్కువయ్యింది. అయితే తొలుత ఈ టిగువాన్ డీజల్ ఇంజన్‌తో పరిచయం కానుంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీ

దేశీయంగా విడుదల కానున్న టిగువాన్ ఎస్‌యూవీలో 2-లీటర్ సామర్థ్యం గల టిడిఐ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 147బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీ

ఇండియన్ స్పెక్ టిగువాన్‌లో 5-అంగుళాల పరిమాణం ఉన్న తెర లేదా 8-అంగుళాల పరిమాణం గల డిస్ల్పే‌తో రానుంది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మిర్రర్ లింక్ మరియు న్యావిగేషన్ సపోర్ట్‌తో పాటు కొన్ని ఇతర ఫీచర్లు కూడా రానున్నాయి.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీ

వోక్స్‌వ్యాగన్ ప్రారంభంలో దీనిని పూర్తిగా ఉత్పత్తి చేసి, దిగుమతి చేసుకుని విపణిలోకి ప్రవేశపెట్టనుంది. వోక్స్‌వ్యాగన్ ప్రీమియమ్ ఎస్‌యూ సెగ్మెంట్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని దీని ధరలను నిర్ణయించనుంది.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీ

వోక్స్‌వ్యాగన్ తమ టిగువాన్ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదల చేస్తే, ప్రస్తుతం విపణిలో ఉన్న ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్ మరియు షెవర్లే ట్రయల్‌బ్లేజర్ వంటి వాటికి బలమైన పోటీనివ్వనుంది.

టిగువాన్ ఎస్‌యూవీ ఫోటోలను వీక్షించండి.....

 
English summary
Also Read In Telugu: Volkswagen Tiguan India Launch Details Revealed
Please Wait while comments are loading...

Latest Photos