2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద డస్టర్ మరియు క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కార్లను ఆవిష్కరిస్తున్న రెనో

Written By:
Recommended Video - Watch Now!
Under-Aged Rider Begs The Policewomen To Spare Him - DriveSpark

భారత్‌లో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఇండియన్ ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శన ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ కేంద్రంగా అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడానికి సిద్దమవుతోంది.

రెనో నుండి క్విడ్ మరియు డస్టర్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

తాజాగా అందిన సమాచారం మేరకు, రెనో ఇండియా విభాగం ఈ ఆటో ఎక్స్‌పో మీద నూతన ఉత్పత్తులతో పాటు సరికొత్త డస్టర్ ఫేస్‌లిఫ్ట్ మరియు క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కార్లను ప్రదర్శించనున్నట్లు తెలిసింది.

రెనో నుండి క్విడ్ మరియు డస్టర్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

2018 తరానికి చెందిన సరికొత్త డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని నూతన ఎక్ట్సీరియర్ డిజైన్ ఎలిమెంట్స్, ఇంటీరియర్ అప్‌డేట్స్ జోడింపుతో మునుపటి మోడల్‌తో పోల్చితే అడ్వాన్స్‌డ్ మరియు ఫ్యూచరిస్టిక్ డిజైన్ శైలిలో ఒక ఫ్రెష్ లుక్‌లో తీర్చిదిద్దనుంది.

రెనో నుండి క్విడ్ మరియు డస్టర్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

2018 డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌లో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు మరియు ఫాగ్ ల్యాంప్స్ జోడింపుతో ఉన్న నూతన ఫ్రంట్ బంపర్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు స్పోర్టివ్ ఫీల్ కలిగించే వీల్ ఆర్చెస్ వంటివి ఇందులో ప్రత్యేకంగా వస్తున్నాయి.

రెనో నుండి క్విడ్ మరియు డస్టర్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

ఫేస్‌లిఫ్ట్ డస్టర్ రియర్ డిజైన్‍‌లో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా రూపొందించిన టెయిల్ ల్యాంప్ క్లస్టర్, రీడిజైన్ చేయబడిన టెయిల్ గేట్ మరియు బంపర్‍కు ఇరువైపులా రిఫ్లెక్టర్లు, స్కిడ్ ప్లేట్లు గల బంపర్ ఉన్నాయి. కండలు తిరిగిన బాడీ రెనో డస్టర్ సొంతం.

రెనో నుండి క్విడ్ మరియు డస్టర్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో సరికొత్త టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍‌మెంట్, ఐదు భుజాలున్న ఆకారంలో గల ఏసి వెంట్స్, స్టీరింగ్ వీల్ మీద క్రోమ్ సొబగులు, బయటి నుండి వచ్చే శబ్దాలు లోపలికి చేరకుండా అద్భుతమైన క్యాబిన్ ఇన్సులేషన్ వంటివి ఉన్నాయి.

Trending On DriveSpark Telugu:

గాల్లోకి ఎగిరి రెండు అంతస్థుల మేడ మీదకు దూసుకెళ్లిన కారు

ప్రతి కారులో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలు!

మారుతి, హ్యుందాయ్ కంపెనీలకు చుక్కలు చూపించనున్న టాటా మోటార్స్

రెనో నుండి క్విడ్ మరియు డస్టర్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

సాంకేతికంగా 2018 రెనో డస్టర్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యం కానున్నాయి.

రెనో నుండి క్విడ్ మరియు డస్టర్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

విపణిలో ఉన్న రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ క్రింది స్థానాన్ని భర్తీ చేయనున్న 2018 ఫేస్‌లిఫ్ట్ డస్టర్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లోకి లాంచ్ అవకాశం ఉంది.

రెనో నుండి క్విడ్ మరియు డస్టర్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

రెనో డస్టర్‌ ఫేస్‌లిఫ్ట్‌తో పాటు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ కారును కూడా 2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద ప్రదర్శించడానికి రెనో కసరత్తులు చేస్తోంది. కొత్త తరం క్విడ్ అవే 0.8-లీటర్ మరియు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో వచ్చే అవకాశం ఉంది.

రెనో నుండి క్విడ్ మరియు డస్టర్ ఫేస్‌లిఫ్ట్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఈ ఏడాది జరగనున్న అతి ముఖ్యమైన విడుదళ్లలో 2018 రెనో డస్టర్ ఒకటిగా నిలవనుంది. డిజైన్, ఫీచర్లు మరియు సేఫ్టీ పరంగా ఎన్నో అప్‌డేట్స్‌కు గురైన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ డస్టర్ లాంచ్ రెనో ఇండియాకు కీలకంగా మారనుంది.

డస్టర్‌తో పాటు రెనో సంస్థకు మంచి సేల్స్ సాధించిపెడుతున్న మోడల్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్. క్విడ్‌ను కూడా ఆటో ఎక్స్‌పో మీద 2018 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ప్రదర్శించడానికి సన్నద్దమవుతోంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Auto Expo 2018: Renault To Showcase New Duster And Kwid Facelift. Read In Telugu

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark