డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్‌కు ఫ్రీలాన్స్ రైటర్లు కావలెను

Written By:

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్‌కు ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్లు కావలెను. టూ వీలర్ మరియు ఫోర్ వీలర్ ఆటోమొబైల్ వార్తలు మరియు కథనాలను తెలుగు పాఠకుల కోసం అర్థవంతంగా, సులభమైన రీతిలో చదివే విధంగా ఆర్టికల్స్ రాయాల్సి ఉంటుంది. తెలుగులో చక్కగా రాసే నైపుణ్యం ఉండి, రాయాలనే ఆసక్తి మరియు తపన మీకు ఉంటే డ్రైవ్‌స్పార్క్ తెలుగు మీకు చక్కటి అవకాశం కల్పిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్‌కు ఫ్రీలాన్స్ రైటర్లు కావలెను

మీరు తెలుసుకోవాల్సింది...

సమాచారంతో కూడిన నాణ్యమైన కథనాలు:

మీరు ఎంపిక చేసుకునే కథనాలు ఆకట్టుకునే విధంగా, అర్థవంతమైన శీర్షికలతో, విలువైన విషయాలతో కూడి ఉండాలి. అవి పాఠకులను ఆకట్టుకునే విధంగా పలు విశేషాలను, విశిష్టతలను లోతుగా వివరించాలి. స్పష్టతతో కూడిన వ్యాకరణ దోషాలు లేని కథనాల కోసం అధిక ప్రాధాన్యత ఉంటుంది.

కాపీ కథనాలు వద్దు:

కాపీ కథనాలను ఏమాత్రం ఆమోదించము. డ్రైవ్‌స్పార్క్ తెలుగు అందుకు మినహాయింపు కాదు. కాపీ చేసి పంపే వార్తలకు చోటు లేదు. రచయితల విశ్వసనీయతను, సమగ్రతను మేం ఇష్టపడుతాం. ఇతర వెబ్‌సైట్ల నుంచి గానీ ఇతర వనరుల నుంచి గానీ కాపీ చేసి పంపద్దు.

ఆర్టికల్స్ ఫార్మాట్:

  • ఆర్టికల్ నిడివి కనీసం 500 పదాలతో ఉండాలి. తెలుగు భాషలో పూర్తి కథనం ఉంటే మంచిది. అర్థం కాని ఎస్ఎంఎస్ భాష వాడకూడదు.
  • మా సైట్‌లో ఇది వరకే ప్రచురించిన అంశాల మీద రాయకూడదు. ఎందుకంటే అది పాఠకులకు విసుగు తెప్పించే విధంగా ఉంటుంది. ఆ విధమైన ఆర్టికల్స్‌ను వీక్షించడానికి పైన సెర్చ్ ఆప్షన్ వాడండి. 

మాకు ఎందుకు రాయాలి?

అవును, మీ రచనా నైపుణ్యాలను ప్రదర్శించడానికి, తగిన ఆదాయం సమకూర్చుకోవడానికి ఇది మీకు సరైన వేదిక. మీ ఆర్టికల్స్‌కు పాఠకుల సంఖ్య ఎక్కువగా ఉంటే తగిన ఇన్సెంటివ్ కూడా లభిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు మాత్రమే కాదు తెలుగు వన్ఇండియా, లైఫ్‌స్టైల్(Boldsky), టెక్నాలజీ(Gizbot) మరియు పర్యాటక రంగం(NativePlanet) వంటి రంగాలలో ఆర్టికల్స్ రాయడానికి ఆసక్తి ఉన్న వారికి ఆహ్వానం కలదు.

ఈ మెయిల్ అడ్రస్‌కు సంప్రదించండి: www.lekhaka.com

English summary
Read In Telugu: Freelance writers required for DriveSpark Teugu

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark