ఇయానిక్ & కోనా ఎలక్ట్రిక్ కార్లను సిద్దం చేసిన హ్యుందాయ్

Written By:
Recommended Video - Watch Now!
Auto Rickshaw Explodes In Broad Daylight

ప్రపంచ దేశాలు ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని విరివిగా చేపట్టాయి, కానీ శరవేగంగా అభివృద్ది చెందుతున్న భారత్‌లో మాత్రం ఎలక్ట్రిక్ కార్ల ఊసే లేదు. ఇప్పటికీ ఏ కార్ల కంపెనీ కూడా అతి ముఖ్యమైన ఎలక్ట్రిక్ కారు విడుదల, అభివృద్ది మరియు ఫ్యూచర్ ప్లాన్లను వెల్లడించలేదు.

అయితే, కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ భారత్‌లోకి 2019 నాటికి ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది.

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లు

హ్యుందాయ్ మోటార్స్ భారత్‌లో రానున్నమూడేళ్లలోపు కొత్త ఉత్పత్తుల అభివృద్ది మరియు తయారీ కోసం సుమారుగా 6,300 కోట్ల రుపాయలు పెట్టుబడిపెడుతోంది. గుర్గావ్‌లో నూతన కార్యాలయం ఏర్పాటు, కొత్త ఇంజన్‌లు అభివృద్ది పరంగా ఈ పెట్టుబడిని ఉపయోగించనుంది.

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లు

హ్యుందాయ్ మోటార్స్ తమ తొలి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారును 2019 నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ ఖరారు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్‌లో కోనా ఎస్‌యూవీ లేదా ఇయానిక్ సెడాన్ ఉండే అవకాశం ఉంది.

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లు

భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రణాళికల గురించి హ్యుందాయ్ ఇండియా విభాగాధిపతి వై.కె కూ మాట్లాడుతూ, "హ్యుందాయ్ తొలి ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాది(2019)లో విడుదల చేస్తున్నాం. విడుదల సమయంలో అది ఇయానిక్ సెడాన్ లేదా కోనా ఎస్‌యూవీ ఆధారిత వెర్షన్‌లలో ఏదో ఒకదానిని ఖాయం చేస్తామని పేర్కొన్నాడు."

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లు

భారత్‌లో కస్టమర్లు ఎలాంటి ఎలక్ట్రిక్ కార్లను కోరుకుంటున్నారనే అనే దాని గురించి అధ్యయనం చేస్తోంది. కస్టమర్ల అభిప్రాయం మేరకు, ఎస్‌యూవీ తరహా ఎలక్ట్రిక్ వెహికల్ లేదా సెడాన్ ఎలక్ట్రిక్ వెహికల్‌లో ఏదే ఒక మోడల్‌ను సిద్దం చేయనుంది.

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లు

దేశీయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా భారత ప్రభుత్వం ప్రకటించే పాలసీ కోసం కూడా హ్యుందాయ్ మోటార్స్ ఎదురుచూస్తోంది. 2030 నాటికి కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే అనుతించే లక్ష్యంలో ఉన్న భారత్ ప్రణాళికలకు అనుగుణంగా, 2030 నాటికి వ్యక్తిగత కార్లలో 40 శాతం హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లే ఉండాలనే దిశానిర్ధేశాన్ని పెట్టుకుంది.

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లు

అంటే, హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లు ఇండియాలోనే తయారవుతాయా...? అంటే, ప్రస్తుతం కాదనే చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ కార్ల తయారీకి కావలసిన విడి భాగాలను దిగుమతి చేసుకొని చెన్నైలోని ప్రొడక్షన్ ప్లాంటులో అసెంబుల్ చేసి, మార్కెటింగ్ చేయనుంది.

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లు

కోనా ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇది పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లలో లభ్యమవుతోంది. అయితే, కోనా ఎలక్ట్రిక్ వెహికల్‌ను భారత్‌లో దీనిని ముందస్తుగా బుక్ చేసుకున్న వారికే డెలివరీ ఇవ్వనుంది. కోనా ఎలక్ట్రిక్‌ను అతి త్వరలో జరగబోయే ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించి, వచ్చే ఏడాది విపణిలోకి లాంచ్ చేయనుంది.

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లు

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో సాంకేతికంగా 140కిలోవాట్ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది రెండు విభిన్న కెపాసిటి ఉన్న బ్యాటరీలతో లభ్యం కానుంది. అవి, 39.2kWh మరియు 64kWh. 39.2kWh ఉన్న కోనా ఎస్‌యూవీ 240కిలోమీటర్లు మరియు 64kWh వెర్షన్ గరిష్టంగా 390కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరైన ఉత్పత్తులతో వ్యూహాత్మక ప్రణాళికలతో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి ప్రవేశిస్తే ఏ దిగ్గజానికైనా సక్సెస్ ఖాయం. దేశీయంగా ఉన్న మహీంద్రా, టాటా మరియు మారుతి సంస్థలు ఎలక్ట్రిక్ కార్ల విభాగం మీద సరైన ఆసక్తి చూపడం లేదు.

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లు

అయితే, కొరియా దిగ్గజం భారత్‌లో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో ప్రవేశించాలనే తమ నిర్ణయాన్ని వెలిబుచ్చింది. ప్రపంచ శ్రేణి నాణ్యత మరియు విదేశీ మార్కెట్లో ఇప్పటికే విడుదల చేసి, పరీక్షించి చూసిన మోడళ్ల భారత్‌లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కాబట్టి ఇయానిక్ సెడాన్ లేదా కోనా ఎస్‌యూవీ వీటిలో ఏది వచ్చినా అద్భుతమైన ఫలితాలు సాధించడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

Trending DriveSpark YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Hyundai Electric Vehicle (EV) Launch Details Revealed — Could Be An SUV Or A Sedan
Story first published: Sunday, February 4, 2018, 9:53 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark