హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏఎమ్‌టి విడుదల: ధర రూ. 7 లక్షలు

హ్యుందాయ్ ఇండియా విపణిలోకి ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లాంచ్ చేసింది. హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏఎమ్‌టి ప్రారంభ ధర రూ. 7.04 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

By Anil Kumar

హ్యుందాయ్ ఇండియా విపణిలోకి ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లాంచ్ చేసింది. హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏఎమ్‌టి ప్రారంభ ధర రూ. 7.04 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

2018 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏఎమ్‌టి విడుదల

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్ కేవలం రెండు వేరియంట్లలో మాత్రమే పరిచయం అయ్యింది. మ్యాగ్నా మరియు ఆస్టా వేరియంట్లను ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.తాజాగా జరిగిన ట్రాన్స్‌మిషన్ అప్‌డేట్ ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మ్యాన్యువల్ మరియు ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది.

2018 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏఎమ్‌టి విడుదల

అయితే, సివిటి ట్రాన్స్‌మిషన్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యమవుతోంది. పెట్రోల్ సివిటి మ్యాగ్నా మరియు పెట్రోల్ సివిటి ఆస్టా వేరియంట్ల ధరలు వరుసగా రూ. 7.04 లక్షలు మరియు రూ. 8.16 లక్షలుగా ఉన్నాయి.

2018 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏఎమ్‌టి విడుదల

హ్యుందాయ్ ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్ పో 2018లో హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఆవిష్కరించింది. అయితే, ఎలైట్ ఐ20 కారును ఐ20 రెగ్యులర్ హ్యాచ్‌బ్యాక్ కారుకు కొనసాగింపుగా తొలుత 2014లో లాంచ్ చేసింది.

2018 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏఎమ్‌టి విడుదల

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్ కారులో సాంకేతికంగా 1.2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యుల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభ్యమయ్యే ఇది గరిష్టంగా 83బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏఎమ్‌టి విడుదల

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 89బిహెచ్‌పి పవర్ మరియు 220ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌తో కూడా లభ్యమవుతోంది. అయితే, ఇది కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తోంది. ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌ను కేవలం పెట్రోల్ వేరియంట్లకు మాత్రమే పరిమితం చేసింది.

2018 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏఎమ్‌టి విడుదల

భద్రత పరంగా హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎలైట్ ఐ20 సివిటి వేరియంట్ల మీద దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ డీలర్ల వద్ద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

2018 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏఎమ్‌టి విడుదల

సివిటి అనగా కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ అదే విధంగా ఏఎమ్‌టి అనగా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్. రెండింటిని కూడా ఆటోమొబైల్ పదజాలంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అంటారు. అయితే, పలు కంపెనీలు ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను సివిటి లేదా ఏఎమ్‌టి అని పిలుస్తాయి. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్న కార్లు సిటీ డ్రైవింగ్‌కు చక్కగా ఉపయోగపడతాయి. అందుకే ఈ మధ్య కాలంలో ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది.

2018 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఏఎమ్‌టి విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ ఇండియా ఎట్టకేలకు తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20 కారులో సివిటి గేర్‌బాక్స్ పరిచయం చేసింది. డిజైన్ మరియు సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, కస్టమర్లు ఎంచుకోవడానికి ఆప్షన్లను మరింత పెంచింది. హ్యుందాయ్ ఎలైట్ ఐ20 సివిటి విపణిలో ఉన్న మారుతి బాలెనో సివిటి మరియు హోండా జాజ్ సివిటి వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai Elite i20 CVT Launched In India; Prices Start At Rs 7.04 Lakh
Story first published: Tuesday, May 22, 2018, 14:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X