విపణిలోకి లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ లగ్జరీ సెడాన్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:
Recommended Video - Watch Now!
Lexus LS 500h Launched In India | First Look | Features | Specifications | Interiors - DriveSpark

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్(LS 500h) లగ్జరీ సెడాన్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. సరికొత్త లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ ధర రూ. 1.77 కోట్లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. ఐదవ తరానికి చెందిన సరికొత్త ఎల్ఎస్ 500హెచ్ కారు లెక్సస్ ఇండియా యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్.

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్

లెక్సస్ తొలుత ఈ ఎల్ఎస్ 500హెచ్ కారును 2017లో జరిగిన డెట్రాయిట్ ఆటో షోలో ఆవిష్కరించింది. జపాన్ దిగ్గజం లెక్సస్ దేశీయ విపణిలోకి ఎల్ఎస్ 500హెచ్ కారును లాంచ్ చేసి, ఇండియన్ మార్కెట్లోని తమ లైనప్‌లో లభించే కార్ల సంఖ్యను ఐదుకు పెంచుకుంది.

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ వేరియంట్లు మరియు ధరలు

సరికొత్త లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ మరియు డిస్టినిక్ట్.

వేరియంట్లు ధరలు
Luxury Rs 1,77,21,000
Ultra Luxury Rs 1,82,21,000
Distinct Rs 1,93,71,000
లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్

లెక్సస్ ఎస్ఎల్ 500హెచ్ ఇంజన్ మరియు స్పెసిఫికేషన్స్

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ సెడాన్‌లో రెండు ఎలక్ట్రిక్ మోటార్ల అనుసంధానంతో పాటు 3.5-లీటర్ల కెపాసిటి గల వి6 ఇంజన్ కలదు. ఎలక్ట్రిక్ మోటార్లు మరియు ఇంజన్ కలిసి సంయుక్తంగా 354బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ ఇంజన్ ఉత్పత్తి చేసే మొత్తం పవర్ మరియు టార్క్ 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గుండా అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది. లెక్సస్ ప్రకారం ఎల్ఎస్ 500హెచ్ హైబ్రిడ్ సెడాన్ మైలేజ్ లీటరుకు 15.38కిలోమీటర్లుగా ఉంది.

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్

సరికొత్త లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.4 సెకండ్ల వ్యవధిలోనే అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది. లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ మొత్తం బరువు 2.2 టన్నులుగా ఉంది.

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ పొడవు 5,235ఎమ్ఎమ్, వెడల్పు 1,900ఎమ్ఎమ్, ఎత్తు 1,450ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 3,125ఎమ్ఎమ్‌గా ఉంది.

Trending On DriveSpark Telugu:

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

ప్రతి కారులో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలు!

మొదటిసారి రోడ్డెక్కిన 2018 మారుతి స్విఫ్ట్

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ డిజైన్

జపాన్ దిగ్గజం లెక్సస్ ప్రపంచ దృష్టిని ఆకర్షించే మరియు అత్యంత భిన్నమైన డిజైన్‌ను తమ ఎల్ఎస్ 500హెచ్ సెడాన్‌లో అందించింది. ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద పరిమాణంలో ఫ్రంట్ గ్రిల్ మరియు గ్రిల్‌కు ఇరువైపులా పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న అడాప్టివ్ హై బీమ్ సిస్టమ్ కలదు.

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ సైడ్ ప్రొఫైల్‌లో ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ నుండి మొదలయ్యి, టెయిల్ ల్యాంప్స్ వద్ద ముగిసే క్యారెక్టర్ లైన్ కలదు. 20-అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు 245/45 ఆర్ 20 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి.

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్

రియర్ డిజైన్ విషయానికి వస్తే, ఎల్ఇడి కాంబినేషన్ టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించే లీనియర్ ఎల్ఇడి డిజైన్ ఆకృతి ఈ టెయిల్ లైట్ల సొంతం. బంప్ క్రింద ఉన్న సెన్సార్‌ను కాలు ద్వారా సెన్స్ చేస్తే డిక్కీ డోర్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది. 430-లీటర్ల స్టోరేజ్ కెపాసిటి కలదు.

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ ఫీచర్లు

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ ఇంటీరియర్‌లో లెథర్ అప్‌హోల్‌స్ట్రే(కారు లోపలి వైపు పై భాగం), 20 దిశలలో ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ఫ్రంట్ సీట్లు, 12.3-అంగుళాలతో పెద్ద పరిమాణంలో గల టచ్ ప్యాడ్ డిస్ల్పే ఉంది. డివిడి ప్లేయర్ మరియు 23-స్పీకర్లున్న మార్క్ అండ్ లెవిన్‌సన్ ఆడియో సిస్టమ్‌కు అనుసంధాం చేయబడింది.

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్ లగ్జరీ సెడాన్‌లో హెడ్స్ అప్ డిస్ల్పే, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, 22-మార్గాల్లో అడ్జెస్ట్ చేసుకునే సౌకర్యం గల హీటెడ్ మరియు వెంటిలేటెడ్ రియర్ సీట్లు మెసేజ్ ఫంక్షనాలిటీతో ఉన్నాయి. వెనుక సీట్ల కోసం ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ మరియు కలపతో చేసిన అలంకరణలు ఉన్నాయి.

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్

భద్రత పరంగా ఎల్ఎస్ 500హెచ్‌లో లెక్సస్ ఎన్నో అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 12 ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేక్స్, ఎలక్ట్రిక్ పవర్ ద్వారా కంట్రోల్ చేయగలిగే బ్రేకులు, బ్రేక్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హోల్డ్ ఫంక్షనాలిటీ గల హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటి కంట్రోల్ మరియు పలు రకాల ఇతర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

లెక్సస్ ఎల్ఎస్ 500హెచ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత్‌లోకి ఎల్ఎస్ 500హెచ్ విడుదలతో జపాన్ దిగ్గజం లెక్సస్ జర్మన్ లగ్గజరీ కార్ల తయారీ దిగ్గజాలకు సవాల్ విసిరిందని చెప్పవచ్చు. అధునాతన డిజైన్, హైబ్రిడ్ సిస్టమ్ మరియు ఎన్నో విలాసవంతమైన మరియు భద్రత ఫీచర్లతో లెక్స్ ఎల్ఎస్ 500హెచ్ విపణిలో ఉన్న మెర్సిడెస్ ఎస్-క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ మరియు ఆడి ఏ8 కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

Trending DriveSpark YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Lexus LS 500h Launched In India — Prices Start At Rs 1.77 Crore
Story first published: Monday, January 15, 2018, 16:18 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark