మహీంద్రా ఎక్స్‌యూవీ700 విడుదలకు సర్వం సిద్దం

మహీంద్రా ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో మహీంద్రా సరికొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇప్పుడు పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించిన దీనిని పూర్తి స్థాయిలో

By Anil Kumar

ఇండియన్ ప్రీమియం ఎస్‌యూవీల విభాగంలో టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు మిత్సుబిషి పజేరో వంటి ఎస్‌యూవీలకు ఓ క్రేజ్ ఉంది. దేశీయంగా అతి పెద్ద ఎస్‌యూవీల తయారీ దిగ్గజంగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పుడు వాటి సరసన చేరేందుకు సిద్దమైంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

అవును, మీరు చదువుతోంది అక్షరాలా నిజమే... మహీంద్రా ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో మహీంద్రా సరికొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇప్పుడు పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించిన దీనిని పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

మహీంద్రా లైనప్‌లో ఎక్స్‌యూవీ500 పైస్థానంలో నిలవనున్న ఎక్స్‌యూవీ700 నిజానికి మహీంద్రా తయారు చేసింది కాదు. మహీంద్రా బ్రాండ్ పేరు మరియు ఎక్స్‌యూవీ700 బ్యాడ్జింగ్‌ గల ఈ ఎస్‌యూవీ శాంగ్‌యాంగ్ కంపెనీకి చెందిన కొత్త తరం రెక్ట్సాన్.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

ఈ ఎస్‌యూవీని దక్షిణ కొరియా దిగ్గజం నిర్మించినప్పటికీ, దేశీయంగా వీటి సేల్స్ మరియు సర్వీసింగ్ మహీంద్రా ఆధ్వర్యంలోనే ఉంటాయి. ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే విపణిలో ఉన్న టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ ప్రీమియం ఎస్‌యూవీలకు గట్టిపోటీనిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

శాంగ్‌యాంక్ ఈ న్యూ జనరేషన్ రెక్ట్సాన్ (ఎక్స్‌యూవీ700) ఎస్‌యూవీని 63 శాతం ధృడత్వం గల స్టీల్ మరియు 1.5 జీపీఎ గిగా-స్టీల్‌తో అత్యాధునిక క్వాడ్-ఫ్రేమ్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. దీంతో తేలికపాటి బరువు మరియు అత్యుత్తమ నిర్మాణ నాణ్యత సాధ్యమయ్యింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఫుల్ సైజ్ ఎస్‌‌యూవీలో మూడు వరుసల సీటింగ్ లేఔట్ ఉంది మరియు 7-మంది వరకు ప్రయాణించవచ్చు. ఎక్స్‌యూవీ700 పొడవు 4.85 మీటర్లు, వెడల్పు 1.92 మీటర్లు, ఎత్తు 1.8 మీటర్లు అదే విధంగా దీని వీల్ బేస్ ఫార్చ్యూనర్ కంటే 120ఎమ్ఎమ్ అధికంగా ఉంది. దీంతో అత్యంత విశాలంగా సౌకర్యవంతమైన క్యాబిన్ దీని సొంతమయ్యింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

వరుసగా ఆనుకొని ఉన్న వ్యక్తిగత సీట్లు మసాజ్ ఫంక్షన్‌తో లభిస్తున్నాయి. మరియు ఫుల్లీ కనెక్టెడ్ సెంటర్ కన్సోల్‌ను గుర్తించవచ్చు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ కోసం డ్యాష్‌బోర్డు మధ్యలో9.2 అంగుళాల డిస్ల్పే మరియు ప్రతి హెడ్ రెస్ట్ వెనుక రియర్ ప్యాసింజర్ల కోసం 10.1-అంగుళాల డిస్ల్పేలు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

ప్రయాణికుల భద్రతకు పెద్దపీఠ వేస్తూ మొత్తం తొమ్మిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి (ఫ్రంట్, ఫ్రంట్ మరియు రియర్ సైడ్, కర్టన్ మరియు డ్రైవర్ మోకాలు వంటి ప్రదేశాల్లో ఉన్నాయి.), అడ్వాన్స్‌డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ చేంజ్ అసిస్ట్, ట్రాఫిక్ సేఫ్టీ అసిస్ట్ మరియు హై బీమ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

సాంకేతికంగా మహీంద్రా అభివృద్ది చేసిన 2.2-లీటర్ యూరో-6 ఉద్గార ప్రమాణాలను పాటించే డీజల్ ఇంజన్ ఇందులో కలదు. ఇది గరిష్టంగా 178బిహెచ్‌పి పవర్ మరియు 420ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

అంతే కాకుండా, కొత్తగా అభివృద్ది చేెసిన 2.0-లీటర్ జిడిఐ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. మెర్సిడెస్ బెంజ్ నుండి సేకరించిన 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 221బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయ అగ్రగామి ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు ప్రీమియం ఎస్‌యూవీల విభాగంలోకి ప్రవేశించబోతోంది. ఎక్స్‌యూవీ700 7-సీటర్ లగ్జరీ మరియు ప్రీమియం ఎస్‌యూవీని దీని పోటీదారుల కంటే రూ. 3 నుండి 5 లక్షల తక్కువ ధరతో రూ. 20 నుండి 25 లక్షల ధరల శ్రేణిలో విడుదల చేసే అవకాశం ఉంది.

Source: MotorBeam

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra XUV700 blue colour shows how long it is in new spy shots
Story first published: Thursday, July 5, 2018, 10:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X