కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వితారా బ్రిజా సృష్టించిన మరో విప్లవం

By Anil Kumar

ఇండో మరియు జపాన్ దిగ్గజాలు మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మరియు సుజుకి సంస్థలు ఉమ్మడి భాగస్వామ్యంతో దేశీయంగా మారుతి సుజుకి బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు. అప్పట్లో మారుతి 800 లేదా అంబాసిడర్ కార్లు మాత్రమే ఉండేవి.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వితారా బ్రిజా సృష్టించిన మరో విప్లవం

కానీ, ఆటోమొబైల్ రంగంలో చోటు చేసుకున్న మార్పులతో బాడీ డిజైన్ శైలిని కార్లను వివిధ రకాలగా వర్గీకరించారు. అందులో ఒకటి కాంపాక్ట్ ఎస్‌యూవీ. గత నాలుగైదేళ్ల వరకు ఈ సెగ్మెంట్లో చెప్పుకోదగ్గ మోడళ్లేవీ ఉండేవి కాదు. అయితే, రెనో డస్టర్ మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీల రాకతో కాంపాక్ట్ ఎస్‍‌‌యూవీలకు డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వితారా బ్రిజా సృష్టించిన మరో విప్లవం

ప్రతి సెగ్మెంట్లో పై చేయి సాధిస్తున్న మారుతి సుజుకి సరిగ్గా ఇదే సమయంలో వితారా బ్రిజా ఎస్‌యూవీని విపణిలోకి ప్రవేశపెట్టింది. నిజజీవిత అవసరాలకు చాలా దగ్గరగా ఉండే డిజైన్ అంశాలతో వచ్చిన మారుతి వితారా బ్రిజా భారీ విజయాన్ని సాధించింది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వితారా బ్రిజా సృష్టించిన మరో విప్లవం

వితారా బ్రిజా సక్సెస్ గురించి ఖచ్చితమైన వివరాలు చెప్పాలంటే, బ్రిజా విడుదలైన 2016 నుండి ఇప్పటి వరకు ఏకంగా 2.75 లక్షల వాహనాలు రోడ్డెక్కాయి. నాలుగు మీటర్లు లోపు పొడవు ఉండే మారుతి వితారా బ్రిజా రాకతో ఈ సెగ్మెంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కస్టమర్లు కూడా ఎస్‌యూవీల అధికంగా ఎంచుకుంటున్నారు.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వితారా బ్రిజా సృష్టించిన మరో విప్లవం

మారుతి సుజుకి తొలుత డీజల్ ఇంజన్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో మాత్రమే విడుదలయ్యింది. అయితే, కస్టమర్లు ఎంచుకునేందుకు మరిన్ని ఆప్షన్లను కల్పించే ఉద్దేశ్యంతో ఇటీవల ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో అప్‌డేటెడ్ వితారా బ్రిజాను లాంచ్ చేసింది

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వితారా బ్రిజా సృష్టించిన మరో విప్లవం

మారుతి వితారా బ్రిజా ఎస్‌యూవీలోని విడిఐ, జడ్‌డిఐ మరియు జడ్‌డిఐ ప్లస్ వేరియంట్లో పరిచయం చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 8.54 లక్షల, రూ. 9.32 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 10.49 లక్షలు ఎక్స్-షోరూమ్‌(ఢిల్లీ)గా ఉన్నాయి.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వితారా బ్రిజా సృష్టించిన మరో విప్లవం

తాజాగా అందిన సేల్స్ రిపోర్ట్స్ ప్రకారం, ఇప్పటి వరకు అమ్ముడైన వితారా బ్రిజా ఎస్‌యూవీలో అత్యధికంగా టాప్ ఎండ్ వేరియంట్లే ఉన్నట్లు తెలిసింది. మొత్తం విక్రయాల్లో జడ్‌డిఐ మరియు జడ్‌డిఐ ప్లస్ వేరియంట్ల వాటా 56 శాతంగా ఉంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వితారా బ్రిజా సృష్టించిన మరో విప్లవం

విడుదలైనప్పటి నుండి ప్రతి నెలా సగటు విక్రయాలు 12,300 యూనిట్లుగా నమోదయ్యాయి. ఒక్క చివరి నెలలోనే ప్రతి నెలా జరిగే విక్రయాల కంటే 50 శాతం అధికంగా నమోదై 20,804 యూనిట్ల వితారా బ్రిజా ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వితారా బ్రిజా సృష్టించిన మరో విప్లవం

ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎక్జ్సిక్యూటివ్ డైరక్టర్ ఆర్ఎమ్ కల్సి మాట్లాడుతూ, "ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్లో మారుతి వితారా బ్రిజా అత్యంత కీలకమైన మోడల్. వితారా బ్రిజా ద్వారా ఎంతో యువ కస్టమర్ల ఆకాంక్షలను నెరవేర్చాము. ఇప్పుడు వారి కోసం మరింత సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని కల్పించేందుకు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేసినట్లు చెప్పుకొచ్చాడు."

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వితారా బ్రిజా సృష్టించిన మరో విప్లవం

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఉన్న కార్లను కస్టమర్లు ఇప్పుడు విరివిగా ఎంచుకుంటున్నారు. గత మూడేళ్ల కాలంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ల విక్రయాలు మూడింతలు పెరిగాయి. ఈ కారణంగానే, భారతదేశపు పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఆటోమేటిక్ ట్రాన్స్‌‌మిషన్ పరిచయం చేశారు. దీనికి తోడు అప్‌డేటెడ్ డిజైన్‌లో వచ్చిన బ్రిజా ఆటోమేటిక్ వేరియంట్ కస్టమర్లను మరింత ఆకట్టుకోనుంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వితారా బ్రిజా సృష్టించిన మరో విప్లవం

ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనసంధానంతో లభించే వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీలో సాంకేతికంగా 1.3-లీటర్ కెపాసిటి గల డిడిఐఎస్200 డీజల్ ఇంజన్ కలదు. ఇది 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వితారా బ్రిజా సృష్టించిన మరో విప్లవం

భద్రత పరంగా మారుతి వితారా బ్రిజా ఆటోమేటిక్ వేరియంట్లో ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, హై-స్పీడ్ వార్నింగ్ అలర్ట్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రి-టెన్షనర్ మరియు ఫోర్స్ లిమిటర్స్ వంటి ఎన్నో అదనపు భద్రత ఫీచర్లు ఉన్నాయి.

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వితారా బ్రిజా సృష్టించిన మరో విప్లవం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి వితారా బ్రిజా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లు విపణిలో ఉన్న టాటా నెక్సాన్ మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీలు లభించే మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లకు గట్టి పోటీనిస్తుంది. బ్రిజా ఆటోమేటిక్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 8.54 లక్షల కావడంతో ఎంట్రీ లెవల్ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకోనుంది. అంతే కాకుండా నెక్సాన్ ఆటోమేటిక్ ప్రారంభ వేరియంట్ కంటే దీని ధర తక్కువగా ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Vitara Brezza Sales Figures — Top End Variants Account To Over 50 Percent Of Total Sales
Story first published: Friday, May 11, 2018, 15:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X