అనధికారికంగా న్యూ మారుతి స్విఫ్ట్ బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు

Written By:

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తమ మూడవ తరానికి చెందిన సరికొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ కారును ఫిబ్రవరిలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శన వేదికగా మార్కెట్లోకి లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

2018 మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

నూతన డిజైన్ మరియు ఫీచర్లతో సరికొత్త 2018 మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కొత్త అవతారంలో రానుంది. అయితే, కొంత మంది డీలర్లు 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మీద అనధికారిక బుకింగ్స్ ప్రారంభించారు.

Recommended Video - Watch Now!
Watch Now | Indian Navy's MiG-29K Crashed In Goa Airport | Full Details - DriveSpark
2018 మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

మారుతి సుజుకి తమ అప్ కమింగ్ స్విఫ్ట్ మీద బుకింగ్స్ సంభందించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అతి త్వరలో నూతన స్విఫ్ట్ బుకింగ్స్, బుకింగ్ ధర మరియు డెలివరీలకు సంభందించిన ప్రకటన చేసే అవకాశం ఉంది.

2018 మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

దక్షిణ భారతదేశంలోని పలు మెట్రో నగరాల్లో కొన్ని మారుతి సుజుకి విక్రయ కేంద్రాలు అతి త్వరలో మార్కెట్‌ను చేరనున్న స్విఫ్ట్ మీద రూ. 11,000 లతో బుకింగ్స్ ఆహ్వానించాయి.

2018 మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

మారుతి ప్రస్తుతం విక్రయిస్తున్న స్విఫ్ట్(సెకండ్ జనరేషన్) అందుబాటులోలేనట్లు తెలిపారు. అంతే కాకుండా, పాత మోడల్ స్విఫ్ట్ మీద బుకింగ్స్ కూడా తీసుకోవడం లేదు. పాత స్విఫ్ట్ స్టాక్ ఉన్న డీలర్లు మాత్రమే విక్రయిస్తున్నారు.

2018 మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

మారుతి సుజుకి ఇప్పటికే పాత తరం స్విఫ్ట్ ప్రొడక్షన్‌ను శాశ్వతంగా నిలిపివేసింది. మరియు డీలర్లకు పాత స్విఫ్ట్ కార్లను సరఫరా చేయడాన్ని కూడా ఆపేసింది. విడుదల అనంతరం ఉండబోయే డిమాండ్‌ను అంచనా వేసి న్యూ స్విఫ్ట్ ముందస్తు ప్రొడక్షన్ ప్రారంభించే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

2018 మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

త్త తరం స్విఫ్ట్ గురించి ఓ డీలర్ మాట్లాడుతూ, వేరియంట్ల పేర్లు ప్రస్తుతం ఉన్నవే కొనసాగుతాయి అయితే వాటిలో ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరిగా రానున్నాయని పేర్కొన్నాడు.

2018 మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

డీలర్ల కథనం మేరకు, మారుతి స్విఫ్ట్ మీద జనవరి చివరి నాటికి అఫీషియల్ బుకింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. మరియు కొత్త తరం స్విఫ్ట్ మీద వెయిటింగ్ పీరియడ్ రెండు నుండి మూడు నెలల వరకు ఉండవచ్చు. అధికారిక బుకింగ్స్ స్టార్ట్ అయితే మిగతా విషయాలు తెలుస్తాయి.

Trending On DriveSpark Telugu:

2018లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం విడుదలయ్యే కార్లు

గుండె ధైర్యం ఉన్న వారే ఈ వీడియో చూడండి!

గుట్కా వ్యాపారమే 120 లగ్జరీ కార్లు, హెలీకాఫ్టర్ మరియు ఎన్నో కంపెనీలకు యజమానిని చేసింది

2018 మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

న్యూ 2018 స్విఫ్ట్ విషయానికి వస్తే, పాత తరం స్విఫ్ట్‌తో పోల్చుకుంటే ఆల్ న్యూ ఫ్రంట్ డిజైన్ సొంతం చేసుకుంది. రీడిజైన్ చేయబడిన ముందు మరియు వెనుక భాగం, సిగ్నేచర్ ఫ్లోటింగ్ రూఫ్ లైన్, సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు ఎన్నో అత్యాధునిక ఫీచర్లతో వస్తోంది.

2018 మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

మారుతి చివరగా విడుదల చేసిన న్యూ డిజైర్ ఇంటీరియర్‌‌ తరహా డిజైన్‌ను పోలి ఉండే ఇంటీరియర్‌ను స్విఫ్ట్‌లో కూడా అందిస్తోంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ప్రీమియమ్ ఫీల్ కలిగించే అప్‌హోల్‌స్ట్రే వంటివి ప్రత్యేకంగా నిలవనున్నాయి.

2018 మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

అధిక ధృడత్వం గల బాడీ కోసం తన్యత ఎక్కువగా ఉన్న స్టీల్‌తో సుజుకి యొక్క హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద తేలికపాటి బరువుతో కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును రూపొందించారు. ఇదే హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద బాలెనో మరియు న్యూ డిజైర్ కార్లను కూడా అభివృద్ది చేశారు.

2018 మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

ఆల్ న్యూ మారుతి స్విఫ్ట్‌లో మారుతి వారి అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభించనుంది. వరుసగా 82బిహెచ్‌పి మరియు 74బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే ఇవి 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌లో లభ్యం కానున్నాయి.

2018 మారుతి స్విఫ్ట్ బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి భారీ అంచనాల మధ్య స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును అత్యంత సరసమైన ధరతో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పిటకే యూరోపియన్ మరియు జపనీస్ మార్కెట్లో ఉన్న న్యూ స్విఫ్ట్‌ను అదే డిజైన్ శైలిలో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. దీని విడుదలతో హ్యాచ్‌సెగ్మెంట్ మొత్తం మారుతి వశం కావడం ఖాయం. పూర్తి స్థాయిలో మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మరియు ఫోర్డ్ ఫిగో కార్ల నోర్లు మూయించనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: 2018 Maruti Swift Unofficial Bookings Begin At Select Dealerships

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark