టాటా ఇ విజన్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

By Anil Kumar

దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2018 జెనీవా మోటార్ షోలో టాటా ఇ-విజన్ ఎలక్ట్రిక్ సెడాన్ కాన్సెప్ట్ కారును తొలిసారిగా ఆవిష్కరించింది. ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థలకు ధీటుగా టాటా మోటార్స్ తమ ఫ్యూచర్ ఎలక్ట్రిక్ ప్రీమియమ్ సెడాన్‌ కారును అభివృద్ది చేసింది.

టాటా ఇ విజన్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

టాటా మోటార్స్ తమ అధునాతన ఒమేగా ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఇ-విజన్ కాన్సెప్ట్‌ సెడాన్‌ను అభివృద్ది చేసింది. 4.3 మీటర్ల కంటే పొడవున్న తమ అన్ని ఎలక్ట్రిక్ కార్లను టాటా ఒమేగా ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే అభివృద్ది చేస్తోంది.

టాటా ఇ విజన్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

టాటా డిజైనింగ్ బృందం టాటా వారి నూతన ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఫిలాసఫీ ఆధారంగా అత్యంత ఆకర్షణీయంగా ఇ-విజన్ కాన్సెప్ట్ కారును తీర్చిదిద్దింది. భవిష్యత్తును ప్రతిబింబించే శైలిలో అత్యంత సున్నితమైన మెటీరియల్‌తో ఈ కాన్సెప్ట్ మోడల్‌కు రూపాన్నిచ్చారు. తాజాగా, టాటా ఇ-విజన్ కాన్సెప్ట్ రియర్ ఫోటోలు ఆన్‌లైన్ వేదికగా చక్కర్లు కొడుతున్నాయి.

టాటా ఇ విజన్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

ఒక బిల్డింగ్ ప్రక్కన పార్క్ చేసి ఉన్న టాటా ఇ-విజన్ కాన్సెప్ట్ కారు ఫోటోలు రహస్యంగా లీక్ అయ్యాయి. ఈ ఫోటోలు ఇప్పుడు, ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. ఆటో షో లేదా టాటా షోరూముల్లో ఉండాల్సిన ఇ-విజన్ చాలా సాధారణంగా అక్కడ ఎందుకు పార్క్ చేశారనేది తెలియరాలేదు.

టాటా ఇ విజన్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

టాటా మోటార్స్ గతంలో జరిగిన మోటార్ షోలో ఆవిష్కరించడానికి ముందే, ఇ-విజన్ కాన్సెప్ట్‌కు సంభందించిన స్టుడియో ఫోటోలను రివీల్ చేసింది. అయితే, ప్రస్తుతం లీక్ అయిన ఫోటోలు వాస్తవంగా తీసినట్లు కనబడుతున్నాయి.

టాటా ఇ విజన్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

టాటా ఇ-విజన్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ డిజైన్ ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షిస్తుంది. ప్రత్యేకంగా చెప్పుకోదగిన వాటిలో, సెడాన్ చుట్టూ ఉన్న అల్యూమినియం హ్యుమానిటీ లైన్స్, 21-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఫ్రేమ్ రహిత డోర్లను గమనించవచ్చు.

టాటా ఇ విజన్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

కాన్సెప్ట్ ఇటీరియర్‌లో లెథర్ మరియు వుడ్ కాంబినేషన్ ఫినిషింగ్‌లో ఉన్న డ్యాష్‌బోర్డ్ గమనించవచ్చు. డ్యాష్‌బోర్డ్ మీద ఉన్న ఇంస్ట్రుమెంట్ కన్సోల్ డిస్ల్పే మాదిరిగా పనిచేస్తుంది. అంతే కాకుండా డ్యాష్‌బోర్డ్ మధ్యలో లోపలకి బయటికి వెళ్లే టచ్‌స్క్రీన్ కూడా ఉంది.

టాటా ఇ విజన్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

టాటా మోటార్స్ అఫీషియల్‌గా రివీల్ చేసిన మునుపటి ఇంటీరియర్ ఫోటోలోని డ్యాష్‌బోర్డులో మూడు డిస్ల్పేలు ఉన్నాయి.

టాటా ఇ విజన్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

టాటా ఇ-విజన్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ ఫీచర్లు మరియు టెక్నాలజీ విషయానికి వస్తే, డ్రైవింగ్‌ను మరింత సరళతరం చేసే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ (ADAS), హ్యుమన్-మెషీన్ ఇంటర్‌ఫేస్ (HMI), డ్రైవ్ అనలిటిక్స్, జియోస్పాషియల్ న్యావిగేషన్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

టాటా ఇ విజన్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

ఇప్పటికే చాలా మంది వాహన రంగ నిపుణులు టాటా ఇ-విజన్ కారు ఎలక్ట్రిక్ ప్రీమియమ్ సెడాన్ లక్ష్యంగా విపణిలోకి రానుందని చెబుతున్నారు. అయితే, ఇది సి-సెగ్మెంట్ మోడల్ అనే పుకార్లు కూడా చాలానే ఉన్నాయి. ప్రస్తుతం, సి-సెగ్మెంట్ సెడాన్ విభాగంలో హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్ వంటి మోడళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

టాటా ఇ విజన్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

అత్యాధునిక ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తున్న టాటా ఇ-విజన్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 300కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉన్నట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే, దేశీయ ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో ఒక కొత్త అధ్యయనానికి తెర దించుతుందని చెప్పవచ్చు.

టాటా ఇ విజన్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా ఇ-విజన్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ ప్రస్తుతం కాన్సెప్ట్ దశలోనే ఉంది. కాన్సెప్ట్ వెర్షన్‌లో ఉన్న ఎన్నో అంశాలు ప్రొడక్షన్ వెర్షన్ మోడల్‌లో ఉండచ్చు ఉండకపోవచ్చు. కానీ, భవిష్యత్తు అవసరాలను మరియు పోటీని దృష్టిలో ఉంచుకుని మెరుగైన మోడల్‌గా ప్రవేశపెట్టడానికి టాటా ప్రయత్నిస్తోంది.

టాటా ఇ విజన్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

టాటా మోటార్స్ తమ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ 2.0 వెర్షన్ ఆధారంగా ఇ-విజన్ కాన్సెప్ట్‌తో హెచ్5ఎక్స్ కాన్సెప్ట్ ఎస్‌యూవీ మరియు 45ఎక్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లను రూపొందించింది. ఈ రెండు మోడళ్లను ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది.

Source: Autocar Forum

Most Read Articles

English summary
Read In Telugu: Tata E-Vision Electric Sedan Concept — More Real-Life Images Emerge
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X